MohanPublications Print Books Online store clik Here Devullu.com

అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే....... వైతరణి నది | Garuda Puranam in telugu books | గరుడ పురాణం


ONLINE....

అబద్ధమాడిన వారు  నరకాన్ని చవి చూడాల్సిందే....... వైతరణి నది

అబద్ధమాడిన వారు
నరకాన్ని చవి చూడాల్సిందే.......
వైతరణి నది.....
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు.
ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?
వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉన్నది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గూండా లోనికి వస్తారు.
ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని వుండును.
వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.
గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.
హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు.
శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గూండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గూండా రారు, ఇంకా చెప్పలంటే యమలోకనికే రారు.
++++++++++++++++++++++
#గరుడ #పురాణం 796 pages
Print book ₹750/-
_______________________
#GARUDA_PURANAMU
Free PDF download:---
________________________

Mohan publications
Kotagummam
Opp.AJANTHA hotel
Rajamahendravaram
9032462565










ఏడు మహా నరకాలు - ఘోర శిక్షలు-----

నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ''ప్రేతపతి'' అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. దూత, ధనేశ్వరుని తనతో తీసుకు వెళ్తూ మార్గమధ్యం లోని నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు.
01. తప్తవాలుకం
''ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాలిన శరీరాలతో దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీన్నే ''తప్త వాలుక నరకం'' అంటారు. అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేదవిదులను, యజమానిని, కాళ్ళతో తన్నినవారి పాదాలను యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు..
(2)ఈ నరకంలో సూది మొనల్లాంటి భయకర ముఖాలు కలిగిన పురుగులు, పాపాత్ముల శరీరాలను తొలచివేస్తుంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని బయటపెట్టే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు.
క్రకచం
03. ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు.
04. అసిపత్రవనం
నరకాలలో నాలుగోది అసిపత్రవనం. భార్యాభర్తలను విడగొట్టే లేదా తల్లిదండ్రుల నుండి వారి సంతానాన్ని ఎడబాటు కలిగించే పాపులు ఈ నరకం చేరి నిలువెల్లా బాణాలతో, అసిపత్రాలతో హింసించబడతారు. రక్తం కారుతుండగా, వెంబడిస్తున్న తోడేళ్ళకు భయపడి శోకాలు తీస్తూ, పరుగులు తీస్తూ ఉంటారు. విపరీతమైన హింస తో కూడిన ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.
05. కూటశాల్మలి
పర స్త్రీలను, పరుల ద్రవ్యాన్ని హరించిన వాళ్ళు, ఇతరత్రా అపకారాలు చేసిన వాళ్ళు ''కూటశాల్మలి'' నరకం చేరతారు. ఇక్కడ 16 రకాలుగా దండిస్తారు.
రక్తపూయం
06. ఇది ఆరవ నరకం. ఇక్కడ దుర్మార్గులు తలకిందులుగా వేళ్ళాడుతూ
యమకింకరులచేత హింసించబడుతుంటారు. తినకూడనివి తిన్నవారు, ఇతరులను నిందించినవారు, చాడీలు చెప్పినవారు ఈ నరకం చేరతారు.
WWW.GRANTHANIDHI.BLOGSPOT.IN
07. కుంభీపాకం
మొట్టమొదట నీకు విధించబడినది, ఘోరాతిఘోరమైనది, నరకాలన్నిటిలోకీ నికృష్టమైనది కుంభీపాక నరకం. అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది.
రౌరవం
08. నరకాలలో ఎనిమిదవది అయిన ఈ రౌరవం దీర్ఘకాలికం. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు.
ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి.
1. అపకీర్ణం, 2. పాంక్తేయం, 3. మలినీకరణం, 4. జాతిభ్రంశం, 5. ఉపవీతకం, 6. అతిపాతకం, 7. మహాపాతకం
పైన చెప్పిన ఏడు రకాల నరకాల్లో ఆయా పాపాలు చేసినవారు శిక్షలు అనుభవిస్తూ, మగ్గుతున్నారు. కానీ, నువ్వు కార్తీక వ్రతస్తులైన వారి సాంగత్యం ద్వారా అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వల్ల ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు.
ఇలా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు.
అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై, ధన యక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమా. అందువల్ల శ్రీకృష్ణుడు ''సత్యభామా! పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు'' అని సత్యభామకు చెప్పి సాయంసంధ్యానుష్టానార్ధమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list