కరక్కాయతో లాభాలెన్నో!
కరక్కాయ చూర్ణం ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం కలిపేయాలి. అందులోంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున సేవిస్తే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
పసుపు కొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో ఉంచి వేడిచేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే ‘గోరు చుట్టు వాపు ’రోగం శమిస్తుంది.
ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజనానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది.
కరక్కాయ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే విషజ్వరాలు తగ్గుతాయి.
కాస్తంత కరక్కాయ చూర్ణాన్ని, 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా సేవిస్తూ, ఉప్పు, కారం, మసాలాలు లేని చప్పిడి ఆహారం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణంలో కొంచెం బెల్లం కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తే ర క్త మొలలు హరిస్తాయి.
కృష్ణా! నిన్నెలా చేరేది!
శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో మురళి ఒకటి. దానిని ఎప్పుడూ వదలక తన దగ్గరే ఉంచుకునేవాడు. మురళీ గానంతో శిశువులను, పశువులను, అందరినీ సమ్మోహనపరిచేవాడు. చివరికి నిద్రించు సమయంలో కూడా మురళిని వదిలేవాడు కాదు. ఇలా కృష్ణుడు.. మురళిపై చూపుతున్న అవ్యాజమైన ప్రేమను చూసి రుక్మిణీదేవి ఒకసారి అలకపూనింది. పతియే ప్రత్యక్ష దైవమని భావించి, నిరంతరం ఆయన నామ స్మరణతో కాలం గడుపుతున్నా... తనకు దక్కని అదృష్టం ఆ వెదురు కర్రకు ఎలా దక్కిందని బాధపడింది. ఇదే విషయమై కృష్ణ పరమాత్మను నిలదీయాలని భావించింది. ఒకనాటి సాయంత్రం.. అంతఃపురంలో సేదతీరుతున్న కృష్ణుడి దగ్గరకు రుక్మిణి వచ్చింది. ‘‘స్వామీ! ఈ మురళి పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా! నిరంతరం నీ స్పర్శతో పునీతం అవుతోంది. నీ మోవిపై వాలి రాగాలు పలుకుతోంది. నీ కర భూషణంగా మారి అనంతమైన ఖ్యాతిని మూటగట్టుకుంది. నాక్కూడా అటువంటి అదృష్టం ప్రసాదించవచ్చు కదా!’’ అని అడిగింది రుక్మిణి.
భార్య మనసులోని బాధను గ్రహించిన కృష్ణభగవానుడు చిరునవ్వు నవ్వి.. ‘‘సఖీ! ఈ మురళి పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఏదీ లేదు. దీనికి పాపమూ, పుణ్యమూ ఏమీ తెలియవు. ఒకసారి ఈ మురళి లోపలి వైపు చూడు’’ అని వేణువును రుక్మిణికి అందించాడు కృష్ణుడు. అలాగే చూసింది రుక్మిణి. ‘‘లోపల అంతా ఖాళీగానే ఉంది స్వామి..!’’ అని బదులిచ్చిందామె. ‘‘రుక్మిణి! మురళి లోపల ఖాళీగా ఉన్నదని గ్రహించావు కదా! ఆ మురళి తన లోపల ఏ పదార్థాన్నీ ఉంచుకోలేదు. తనలోని వస్తుజాలాన్నంతటినీ పరిత్యజించి.. మురళిగా ఆవిర్భవించింది. స్వచ్ఛమైన భక్తుడి హృదయం కూడా ఇలా ఖాళీగా ఉండాలి. రాగద్వేషాలు, దుస్సంస్కారాలు, ప్రాపంచిక విషయాలు, మనోవైకల్యం.. వీటన్నిటికీ అతీతంగా నిష్కల్మషమైన మనసుతో ఎవరైతే ఉంటారో..! వారందరూ నా వాళ్లే! అటువంటి వాళ్లే భగవానుడికి ప్రీతిపాత్రులు అవుతారు. మనశ్శుద్ధి, నిర్మలత్వమే దైవప్రాప్తికి హేతువు’’ అని పలికాడు కృష్ణపరమాత్మ. ఆ మాటలు విన్న రుక్మిణి.. స్వామికి ప్రణమిల్లి.. నిర్మలమైన మనసుతో స్వామిని ఆరాధించింది.
నలుపు తగ్గించే తేనె!
కొందరికి బాహుమూలల్లో నలుపుదనం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు అనేకం. ఏదేమైనా ఈ నలుపుదనాన్నీ, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండే మృతకణాలను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించి చూడండి.
చందనం: గులాబీనీరూ, చందనం పొడిని సమపాళ్లలో తీసుకుని ముద్దలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని నలుపుగా ఉండే ప్రదేశంలో రాసుకుని అయిదు నిమిషాల తర్వాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
వంటసోడా: దీనికి కాసిని నీళ్లు కలిపి బాహుమూలల్లో రాసుకోవాలి. దీనివల్ల నలుపుదనం పోయి.. దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇది నలుపుదనానికీ కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.
తేనె: రెండు చెంచాల చొప్పున తేనె, నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. రెండురోజులకోసారి ఇలా చేస్తుంటే సమ్య అదుపులోకి వస్తుంది.
కీరదోస: చక్రాల్లా తరిగిన కీరదోస ముక్కల్ని బాహుమూలల్లో రుద్దుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక స్నానం చేస్తే.. మృతకణాలు పోవడంతోపాటూ.. నలుపు కూడా తగ్గుతుంది.
కొబ్బరినూనె: ఇది కూడా నలుపుదనం పోగొట్టడంలో తోడ్పడుతుంది. కొన్ని చుక్కల నూనెను ఆ ప్రాంతంలో రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా స్నానం చేసేముందు రోజూ రాసుకుంటుంటే చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది.
కమలాపండు తొక్కలు: కమలా పండు తొక్కల పొడీ, గులాబీనీటిని కలిపి ముద్దలా చేసుకుని రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.
లోపలి శత్రువులను జయించాలి!
అర్జునునికి శత్రుపక్షంలోని వారందరూ బంధువులు, గురువులు అని తెలిసినప్పటికీ, వారిని జయించాలనే ఉద్దేశంతోనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే వారందరినీ చూడగానే మమకారం పెల్లుబికి, నిస్సహాయుడయ్యాడు, నిలువెల్లా విషాదం ఆవరించడంతో యుద్ధం చేయలేనని వెనుదిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినదే శ్రీమద్భగవద్గీత. ఇంతకీ గీత ఏమంటోందంటే... పుట్టిన ప్రతిప్రాణికీ మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి జన్మించడమూ తప్పదు, అనివార్యమైనదీ, నిశ్చితమైనదీ అయిన జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడే వారి కోసం దుఃఖించడం సరికాదు అంటాడు శ్రీకృష్ణుడు.
అంటే చనిపోయేది ప్రాణి మాత్రమే, ఆత్మ కాదు. మనం ఎవరయితే మరణించారని అనుకుంటున్నామో ఆ మరణించింది భౌతిక సమ్మేళనాలే కాని, చైతన్యరూపంలో ఉండే ఈ ఆత్మ మాత్రం కాదు. ముండకోపనిషత్ ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవి హృదయంలో ఉండి అక్కడి నుంచి శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటుంది. ఈ చైతన్య ప్రసారం ఆగినప్పుడే దేహం నిర్జీవమవుతుంది. శరీరం నశించినా ఆత్మ మరణించదు. కనుక ఆత్మ నిత్యం, సత్యం, శాశ్వతం, పురాతనం అయినది. ఇది తెలిసిన వాడు జ్ఞాని. మానవుడు చిరిగిపోయిన పాతవస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే నాశన రహితమైన ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు యుద్ధం లేకపోవచ్చు కానీ, అంతఃశత్రువులున్నారు. కామక్రోధలోభమోహమదమాత్సర్యాలే ఆ శత్రువులు. ఆ శత్రువులను జయించడం కోసమైనా గీతను ఆకళింపు చేసుకోవడం, అందులోని సూత్రాలను ఆచరించడం అవసరం.
very very nice
ReplyDelete