ఎల్లో కల్లోలం
ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే! హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం కాలేయానికి ముప్పు ఖాయం. కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ! ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్ రాకుండా చూసుకోవడం చాలా.. చాలా.. చాలా.. అవసరం. అందరికీ కామెర్లుగా తెలిసిన ఈ హెపటైటిస్ వైరస్ ఒక ఎల్లో కల్లోలం!!
హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం.
మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం. గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా.
ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్‌పై అవగాహన పెంచుకోవడం అవసరం.
హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది?
హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది.
ఎప్పుడు బయట పడతాయి?
హెపటైటిస్ వైరస్‌లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్‌లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్‌లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్‌లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్‌కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి.
హెపటైటిస్‌లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు.
చికిత్స: అన్ని రకాల హెపటైటిస్‌లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు.
వైరస్ సంక్రమణ
హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్‌లలో ఏ, ఈ అనే వైరస్‌లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్‌లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి.
హెపటైటిస్ – ఏ
మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల.
హెపటైటిస్ – బి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – సి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – డి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – ఈ
మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట.
నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా?
కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్‌ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి.
⇒ సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి
⇒ హెపటైటిస్ వైరస్‌ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి.
⇒ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి.
⇒ మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి.
⇒ ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
⇒ ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి.
⇒ తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
⇒ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙ కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు.
హెపటైటిస్ ఏ ఇది భారత్‌లో ఎక్కువ
⇒సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది
⇒దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్)
⇒ వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి n ఐజీఎమ్ హెచ్‌ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు.
⇒ దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం
⇒అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది
⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్)
⇒వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
హెపటైటిస్ బి
⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది
⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది
⇒సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది
⇒దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది
⇒లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది
⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
హెపటైటిస్ సి
⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే
⇒దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్
⇒దీని చికిత్సకు వైరల్ ఆర్‌ఎన్‌ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం
⇒అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది
ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే!
⇒హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు
⇒కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా
⇒దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం
⇒కాలేయానికి ముప్పు ఖాయం.
⇒కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ!
⇒ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్
⇒రాకుండా చూసుకోవడం
⇒చాలా.. చాలా.. చాలా.. అవసరం.
⇒అందరికీ కామెర్లుగా తెలిసిన
⇒ఈ హెపటైటిస్ వైరస్
హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం. మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం.
గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా. ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్‌పై అవగాహన పెంచుకోవడం అవసరం.
హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది?
హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది.
ఎప్పుడు బయట పడతాయి?
హెపటైటిస్ వైరస్‌లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్‌లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్‌లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్‌లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్‌కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి.
హెపటైటిస్‌లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు.
చికిత్స: అన్ని రకాల హెపటైటిస్‌లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు.
వైరస్ సంక్రమణ
హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్‌లలో ఏ, ఈ అనే వైరస్‌లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్‌లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి.
హెపటైటిస్ – ఏ
మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల.
హెపటైటిస్ – బి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – సి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – డి
రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా
హెపటైటిస్ – ఈ
మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట.
నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా?
కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్‌ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి.
∙సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి ∙హెపటైటిస్ వైరస్‌ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి ∙ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి ∙మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి ∙ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి ∙తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు.
హెపటైటిస్‌ల గురించి సంక్షిప్తంగా
హెపటైటిస్ ఏ ఇది
భారత్‌లో ఎక్కువ సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్) వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి ఐజీఎమ్ హెచ్‌ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు.దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం
అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
హెపటైటిస్ బి
⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది
⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది.
⇒చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది.
⇒ దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది.
⇒ లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
హెపటైటిస్ సి
⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే
⇒ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ n దీని చికిత్సకు వైరల్ ఆర్‌ఎన్‌ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం.
⇒ నివారణకు అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది.
⇒ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది.
⇒కొద్దికాలంగా అందుబాటులో కొన్ని కొత్త మందులు.
హెపటైటిస్ డి
ఇది తనంతట తానే మనుగడ సాధించలేదు. సాధారణంగా హెపటైటిస్ బి వచ్చిన వారిలో ఆ తర్వాత కనిపిస్తుంది.
దీర్ఘకాలిక సిర్రోసిస్ లేదా తీవ్రమైన సిర్రోసిస్‌కు కారణమవుతుంది.
ఇంటర్‌ఫెరాన్ వంటి మందులతో చికిత్స సాధ్యమే.
ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
హెపటైటిస్ ఇ
⇒ఒక్కోసారి చాలా మంది సమూహాలుగా దీని బారిన పడవచ్చు లేదా విడివిడిగానూ రావచ్చు
⇒ఏ వయసువారిలోనైనా రావచ్చు కానీ యుక్తవయస్కుల్లోనే ఎక్కువ
⇒మలం వల్ల కలుషితమైన ఆహారంతోనే వ్యాప్తి
⇒వ్యాధి దీర్ఘకాలికం కాదు. కాకపోతే అప్పటికప్పుడు తీవ్రంగా వస్తుంది
⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్)
⇒త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డాక్టర్ బాలచంద్రన్ మీనన్
కాలేయ వ్యాధుల నిపుణులు –
సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565