పుట్టు వెంట్రుకలు...
షోడశ సంస్కారాలలో కేశఖండనం లేదా చూడాకర్మ ఒకటి. దీనినే పుట్టువెంట్రుకలు తీయటం అని వ్యావహారికంగా చెప్పుకుంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటిసారి వెంట్రుకలు తీయించే కార్యక్రమం.
సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండకుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తుంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. గోళ్ళు, జుత్తు మృత కణజాలం కదా! పైగా జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు.
పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చబడవు. అందుకే చిన్న పిల్లల తల పైభాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది.
కొంతమంది పిల్లలకు త్వరగా కొద్దినెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకు మాడు గట్టి పడుతుంది. అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉన్నన్ని రోజులూ మలిన జలాలలో నాని ఉంటుంది. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా ఆరోగ్యకరమైన జుట్టు వస్తుంది.
పుట్టు వెంట్రుకలు తీయడం వెనక రీజన్స్ ఏంటి ?
పుట్టు వెంట్రుకలు తీయటం అని వ్యవహారంలో చెప్పబడే ఒక సంస్కారం ఇది. దీనిని కేశఖండనం, ముండనం, క్షౌర కర్మ అని కూడా అంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటి మారు వెంట్రుకలు తీయించే కార్యక్రమం. ఏ పనినైనా మొదటి మారు చేసేప్పుడు ఆ పనికొక గౌరవాన్ని ఆపాదించటానికి, దాని వల్ల ఆ జీవికి మేలు కలిగించటానికి ఒక సంస్కారంగా మలచారు మన పెద్దలు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండ కుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తు ఉంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. కుదరక పోవటానికి తల్లి మళ్ళీ గర్భిణిగా ఉండటం ప్రధాన కారణ మవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తల్లి ఒడిలో కూర్చోబెట్టి చేస్ “బలాయుర్వర్చోభి వృద్ధిశ్చ చూడకర్మ ఫలం స్మృతమ్. ” ఈ చూడా కర్మ చేయటం వల్ల దేహానికి బలం, ఆయుస్సు, తేజస్సు, కలుగుతాయని స్మృతులు చెపుతున్నాయి.
“కేశ ఖండనం సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, కలిగించి ఉత్సాహాన్ని వృద్ధి చేస్తుంది. ” అని చరక సంహిత చెపుతుంది. గోళ్ళు, జుత్తు మృత కణ జాలంకదా! (పైగా జుత్తుకి మనిషి చేసిన పాపాలు సంక్రమిస్తాయట. కనుక ఎన్నో సందర్భాలలో, వైదిక క్రియ కలాపాలలో శిరోముండనం చేయించటం కనపడుతుంది. వెంట్రుక శరీరం మీద కాక మరెక్కడ కనపడినా దోషంగా భావించ బడుతుంది.) కేశ ఖండనానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. అందులోనూ శిశువు శరీరానికి మొదటి మారు కత్తి వంటి వాడి ఆయుధాన్ని తాకిస్తారు, కనుక మామూలుగానే జాగ్రత్త వహించ వలసిన అవసరం ఉంది. దానిని ఒక పవిత్ర కార్యకలాప మంటే, సంప్రదాయ మంటే ఎంతో భయ భక్తులతో వ్యవహరిస్తారు.
ప్రస్తుత నాగరక సమాజంలో కేశ ఖండనం, ముఖ్యంగా మగ పిల్లలకు తప్పని సరి. చిన్నతనంలో జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు.
పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చ బడవు. అందుకే చిన్న పిల్లల తల పై భాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది. కొంత మంది పిల్లలకు త్వరగా కొద్ది నెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకి మాడు గట్టి పడుతుంది . అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉండగా అక్కడి మలిన జలాలలో నాని ఉంటాయి. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా పొడవైన బలమైన జుట్టు వస్తుంది.
గృహ్య సూత్రాలలో చెప్పబడిన చూడాకర్మ మంత్రాలు వైదిక సాహిత్యంలోనివి అవటం వల్ల ఇది చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. తూర్పు ముఖంగా బిడ్డని తల్లి ఒడిలో కూర్చుండ బెట్టి, ఆచమనం, సంకల్పం, ఈశ్వర స్తుతి అగ్ని ప్రజ్వలనం, ఆహుతి సమర్పణం చేయాలి. చల్లటి నీటితో, ఆ పై వేడి నీటితో కేశాలని తడిపి, వెన్నతో కానీ, పెరుగుతో కానీ తుడవాలి. ముందుగా కత్తిని స్తుతించి తలమీద మూడు దర్భలను పెట్టి, కత్తిరించి పార వేయాలి.
“ ఓం శివో నామాసి స్వధితిస్తే పితా నమస్తే అస్తు మామా హిగ్ మ్ సీః ” (పటిష్ఠమైన లోహంతో తయారు చేయ బడిన ఖడ్గమా! నీకు నమస్కారం. మాకెట్టి హాని కలుగ చేయకుందువు గాక!) అని ప్రార్థించటం, క్షురకుని సూర్యుని అవతారంగా భావించి సన్మానించటం ప్రతి పని ముట్టుని, ప్రతి వృత్తిని గౌరవించే సంప్రదాయానికి అద్దం పడుతుంది. ఎందుకంటే మనిషి జీవితం సుఖంగా సాగటానికి అన్ని వృత్తుల వారి సహకారం అవసరం. కనుక అన్నింటికి సమ ప్రాధాన్యం ఇవ్వబడింది. దర్భలను కత్తిరించి చేతికి కొంచెం అలవాటు అయిన తరువాత ఎడమ చెవి వెనుక నుండి మొదలు పెట్టి ప్రదక్షిణంగా జుట్టుని తీయాలి. శిశువుకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింప చేసి, తల్లి ఒడిలో కూర్చో బెట్టి, క్షురకునికి ధాన్యం ఇవ్వాలి. అందరకు నమస్కరింప చేసి , పురోహితునికి దక్షిణ తాంబూలాదుల నిచ్చి ఆశీర్వదాన్ని ఇప్పించాలి. బిడ్డకి హారతి ఇవ్వాలి.
మొదటి కత్తెర మేన మామ వేయటం కొంత మంది తెలుగు వారి ఇంటి ఆచారం. ఇటువంటి భేదాలెన్నో ప్రాంతాలని బట్టి, వంశాచారాలని బట్టి కనపడుతుంటాయి . కొంత మంది ఇళ్ళలో ఆడ పిల్లలకి కూడా పుట్టు వెంట్రుకలు తీయించే ఆచారం ఉంది. మగ పిల్లలకి మాత్రం తప్పని సరి. ఈ రోజుల్లో ఎందుకైనా మంచిదని ఏదో దేవాలయంలో జుట్టు తీయించి మొక్కు తీర్చుకుంటున్నారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565