ఇక్కట్లు – పరిహారాలు
ఉపశమనం
ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా అర్హతలకు, అనుభవానికి తగిన అవకాశాలు దక్కవు. దొరికిన అవకాశాలు తగిన ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉండవు. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి.
► కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి.
► ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి దూరంగా ఉండండి. జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి.
►కుంకుమపువ్వును, కస్తూరిని కలిపి తిలకంగా ధరించండి. నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి.
►ప్రవహిస్తున్న నీటిలో చిన్నబెల్లం ముక్కను, అక్షతలను విడిచిపెట్టండి. కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి.
►వెదురుబొంగులో పంచదార నింపి, నిర్జన ప్రదేశంలో దానిని పాతిపెట్టండి. మర్రిచెట్టు మొదట్లో పాలు, కొబ్బరినీరు పోయండి.
► శనివారం పూర్తిగా మద్యమాంసాలకు దూరంగా ఉండండి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం జరిపించండి. రుద్రాభిషేకం జరిపించడం వల్ల కూడా దోషనివారణ జరుగుతుంది.
– పన్యాల జగన్నాథ దాసు
విశ్వాస మహిమ
ఒకసారి ఒకడు సముద్రాన్ని దాటి లంకనుంచి భారతదేశానికి రావాలనుకున్నాడు. విభీషణుడి దగ్గరకు వెళ్లి ఆయన సలహా కోరాడు. విభీషణుడు ఏదో ఒక వస్తువును అతని అంగవస్త్రంలో పెట్టి ముడి వేసి, ‘‘భయపడకు. నువ్వు నీటిపై నడిచి సముద్రాన్ని క్షేమంగా దాటగలుగుతావు. అయితే, నీ అంగవస్త్రానికి కట్టిన దానిని మాత్రం ముడివిప్పి చూడకు. అలా చేస్తే మునిగిపోతావు’’ అని హెచ్చరించాడు. విభీషణుడి మాటలపై విశ్వాసంతో అతడు నేలమీద నడిచినంత సులభంగా సముద్రం మీద నడిచిపోసాగాడు. కొంతదూరం వెళ్లేసరికి అతనికి ఒక సందేహం కలిగింది.
‘నేను ఇంత సులభంగా నీటిమీద ఎలా నడిచి పోగలుగుతున్నాను? విభీషణుడు నా కొంగు చివర ఏమి కట్టి ఉంటాడు? తీసి చూస్తే బాగుంటుంది’ అనుకున్నాడు. అంగవస్త్రం ముడివిప్పి చూశాడు. దానిలో ఒక ఆకు ఉంది. ఆ ఆకుమీద ‘శ్రీరామ’ అని రాసి ఉంది. దాన్ని చూసి, ‘ఓస్! ఇంతేనా?’ అనుకున్నాడు. వెంటనే నీటిలో మునిగిపోయాడు. విశ్వాసం కొద్దిగా సడలిపోగానే అతనికి అంతకు ముందున్న శక్తి పోయింది. అదే అతని వినాశనానికి నాంది అయింది.
వైతరిణి ఎలా ఉంటుంది?
జీవులు ఆయువు తీరిన తర్వాత తాను చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గనరకాలకు వెళతారని విశ్వాసం. అలా నరకానికి వెళ్లే క్రమంలో వైతరణి అనే నదిని దాటవలసి వుంటుందని కూడా కొన్ని పురాణాలలో ఉంటుంది. ఇంతకీ ఆ వైతరణీ నది ఎలా ఉంటుందో చూద్దామా...
వైతరణీనది వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. దానితో పాటు చీము కూడా.
మహా జలచరాలు. భరించలేనంత దుర్వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా, పాపి చేసిన పాపాలకు ఫలితం అక్కడ అనుభవించాల్సిందే. అందు కనే మరణించిన వారి సంతానం భువిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియచెప్పినట్లు గరుడ పురాణంలో తెలుస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565