తీర్థం, క్షేత్రాల భేదం ఏమిటి?
సర్వ సామాన్యంగా మనం తీర్థక్షేత్రం అనే పదాన్ని వాడుతున్నాం. వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేర్వేరు. నదీనదాలు, సముద్రపు తీరాన వెలసిన పవిత్రాలయాలను తీర్థాలంటారు. పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగ వంటి నదుల తీరంలో ఉన్న వారణాసి, గోకర్ణం, రామేశ్వరం వంటివి తీర్థాలు. కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు. క్షేత్రాల్లో స్థలక్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలున్నాయి. నేలపై ఉన్న ఆలయాలు స్థల క్షేత్రాలు కాగా కొండలపై వెలసినవి గిరి క్షేత్రాలు. తిరుమల, మంగళగిరి, సింహాచలం, శ్రీశైలం వంటివి గిరిక్షేత్రాలు. కొన్ని పవిత్రాలయాలు నదులు పక్కన కొండలపై ఉండవచ్చు. వాటిని కూడా క్షేత్రాలుగానే వ్యవహరించాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565