రెహమాన్
ఓ చిన్నారి నేను లోకంలోకి వచ్చేశానంటూ అరిచిన తొలి ఏడుపుని విని కన్నతల్లి సంతోషంతో కళ్లు చెమ్మగిల్లి 50 ఏళ్లు అయిపోయింది. అతడి ఇప్పటి ఆలాపన విని ఉద్వేగంతో ప్రపంచం కన్నీరొలుకుతోంది. ఈ రెండు సంతోషాల మధ్య ఓ సంగీత సాగరాన్ని మధించేసిన ఆ వ్యక్తి పయనంలో విషాద గీతాలు ఎక్కువే. ఏఆర్ రెహమాన్ ఇప్పుడో సుప్రసిద్ధ సంగీతకారుడు. లివింగ్ లెజెండ్. కేవలం కళా రంగానికే పరిమితం కాక అటు సేవలోను ముందుండే రెహమాన్ ఈ మధ్యే రాజకీయాంశాల్లోను హోరు గానం చేస్తున్నాడు.
రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అని తెలిసే ఉంటుంది. 1966 జనవరి 6న చెన్నైలో జన్మించిన రెహ్మాన్ సగం జీవితం పూర్తి చేశాడు. తండ్రి ఆర్‌కె శేఖర్, తల్లి కరీమా బేగం. ఆర్‌కె శేఖర్ ఫిల్మ్ స్కోర్ కంపోజరే కాక తమిళం, మలయాళ సినిమాలకు మ్యూజిక్ కండక్టర్ కూడా. నాలుగేళ్లపుడు తండ్రికి క్యారేజీ ఇచ్చేందుకు అమ్మతో కలసి వెళ్లేవాడు. నాన్న చేసే పనిని గమనిస్తూ ఉండేవాడు. అలా సంగీతం అతనిలోకి ప్రవేశించింది. తొమ్మిదేళ్లకే అనుకోకుండా ఒకరోజు పియానోతో ఓ ట్యూన్ చేసి నాన్నకు వినిపించాడు. దానిని శేఖర్ తీసిన మలయాళ చిత్రం 'పెన్‌పడా'లో విలితెన్ కిన్నమ్ పాటగా మార్చారు. అప్పుడే కాదు ఇప్పుడూ అది అరుదైన ప్రతిభే. ఆ ప్రతిభ మరిన్ని స్వరాలు కూర్చుతుండగా రెహమాన్ తండ్రి శేఖర్ మరణించాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. రెహమాన్‌కు తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్లు. వారిని పేదరికం వెంటాడటంతో తన తల్లి కుటుంబ పోషణ కోసం సంగీత వాయిద్యాలను అద్దెకు ఇచ్చి వచ్చిన డబ్బుతో ఇల్లు జరిపేది. ఫీజు కట్టలేక స్కూలు మానుకున్న రెహమాన్ 11 సంవత్సరాల వయస్సులోనే కుటుంబ భారం నెత్తిపై వేసుకుని తల్లికి చేదోడుగా గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా మ్యూజిక్ ట్రూప్‌లో చేరాడు. అలాంటి కష్టకాలంలో నాన్న అడుగుజాడల్లో నడవటానికి అమ్మ కరీనా బేగం ఎంతో సపోర్టుగా ఉంది. త్వరగానే సంగీతం వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది. రెహమాన్ నాన్న స్నేహితుడైన మళయాళం స్వరకర్త ఎమ్‌కె అర్జున్ దగ్గర ఎన్నో గంటలు సంగీత సాధన చేశాడు. 13 ఏళ్లకే దూరదర్శన్‌లో వండర్ బెలూన్ కార్యక్రమంలో నాలుగు కీ బోర్డులపై ఒకేసారి మ్యూజిక్‌తో ఆటలాడి అత్యంత ప్రజాదరణను పొందాడు. చిన్నవాడిగా నున్నప్పుడే రాజ్-కోటీ దగ్గర అసిస్టెంట్‌గా చేరి కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చాడు. మలయాళ చిత్రం యోధతో పరిచయమై తెలుగులో 'రోజా' చిత్రంతో తన సత్తాను భారతదేశానికి చాటి చెప్పాడు. ప్రఖ్యాత సంగీత ప్రముఖులైన యం.యస్. విశ్వనాథన్, రమేష్ నాయుడు, రాజ్‌కోటి వంటి వారితో కలిసి ప్రదర్శనలు ఇవ్వడమే కాక జాకీర్ హుస్సేన్, కన్నాకుడి వైద్యనాథన్, ఎల్.శంకర్‌తో ప్రపంచ యాత్రలు చేశాడు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో 'జయహో' పాటకు సంగీతాన్ని అందించి ప్రతిష్టాత్మకమైన 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును కైవసం చేసుకున్న తొలి భారతీయు డయ్యాడు. రెహమాన్ చెన్నైలోని స్కూలులో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశాడు. ఇప్పుడు అతడే అనేక సంగీత కళాశాలల్లో జీవిత పాఠమయ్యాడు.
దిలీప్...రెహమాన్‌గా...
రెహమాన్ అక్కకు 1984లో తీవ్రమైన జబ్బు చేసింది. అప్పుడు ఒక సూఫీ సాధువు బోధనలకు ఆకర్షితుడయ్యాడు. 1989 నాటికి రెహమాన్ కుటుంబం పూర్తిగా ఇస్లాంలోకి మారింది. అప్పుడు తన వయస్సు 23 సంవత్సరాలు. దిలీప్ కుమార్‌గా ఉన్న పేరును అల్లా రఖా రెహమాన్‌గా మార్చుకున్నాడు. తను జింగిల్స్ చేస్తున్న సమయంలోనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కొరకు వెతుకుతున్న మణిరత్నానికి రెహమాన్ జింగిల్స్ చాలా కొత్తగా, వినసొంపుగా వుండడంతో రోజా చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ చిత్రంలోని పాటలు అద్భుత విజయాన్ని సాధించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 'రాజత్ కమల్' నేషనల్ అవార్డు దక్కింది. చలనచిత్ర చరిత్రలోనే మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం అదే మొదటిసారి. అప్పుడు రెహమాన్ వయస్సు 24 సంవత్సరాలు. ఆ తర్వాత మణిరత్నం సినిమాలకు ఎక్కువగా రెహమానే మ్యూజిక్‌ని అందజేశాడు. తను అందుకున్న 4 నేషనల్ అవార్డులలో 2 మణిరత్నం మూవీస్ కావడం విశేషం.
సంగీత సంద్రం
'మొజార్ట్ ఆఫ్ మద్రాస్'గా పిలవబడే రెహమాన్ ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు 4 నేషనల్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు, 15 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్‌లతో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మశ్ర్రీ, పద్మభూషణ్, 2009లో 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్ర సంగీతానికి జంట ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే జీవిత కథాచిత్రం 'బర్త్ ఆఫ్ ఎ లెజండ్'కు సంగీతాన్ని సమకూర్చారు. రెహమాన్‌కు భార్య సైరాభాను, పిల్లలు ఖతీజా, రహీమ్, అమన్ ఉన్నారు. తనే కాకుండా తన పిల్లల చేత కూడా సినిమాల్లో పాటలు పాడిస్తున్నాడు. యువసంగీత దర్శకుడు జీవి ప్రకాష్ రెహమాన్ మేనల్లుడు. ఈయన చెన్నైలో కెఎంకాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ టెక్నాలజీ అనే సంగీత కళాశాలను 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పేద బాలల కోసం స్థాపించాడు. లండన్‌లోని మిడిలెసెక్స్ యూనివర్శిటీకి అనుబంధంగా ఈ కళాశాల పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ సంగీత కోర్సులను అందిస్తోంది.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565