వినుర వేమ
ఇన్ని తరాల పాటు తెలుగుజాతికి ఉత్తేజకారకంగా నిలిచిన వేమన పద్యాలు పాడేసుకుంటున్నాం.. వాడేసుకుంటున్నాం. కాని వాటి కర్త వేమన్న గురించి మనకు తెలిసిందెంత? తెలుసుకున్నదెంత? తెలుసుకోవాలనే ప్రయత్నమెంత? తెలిసిన దాన్ని తెలివిడితో ఉపయోగించినదెంత? అదైనా ఎంత కాలం తర్వాత? మరి మన నరాల్లో స్వరాల్లో భాగమై పోయిన ప్రజాకవిని తెలుసుకుందాం. వేమనను విందాం. వేమన జీవితం-సాహిత్యం గురించే ఈ వారం అట్టమీది కథ.
తెలుగు సాహిత్య చరిత్రలో మధ్య యుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించి, తెలుగు నేలపైన సంచరించి ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలుచెప్పిన కవి వేమన. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగి, మనవేమన-వంటిమాటలతో తెలుగు ప్రజలు వేమనను సొంతం చేసుకున్నారు. వేమన ఆధునిక తెలుగు సమాజానికి తెలియకముందే 1730లో ఫాదర్ లీగార్ అనే క్రైస్తవ మతగురువు అనంతపురం నుంచి వేమన పద్యాలను ప్యారిస్‌లోని కింగ్స్ గ్రంథాలయానికి పంపించాడంటే, అప్పటికే ఆయన పద్యాల ప్రాశస్త్యం ఎంతటిదో మనకు తెలుస్తుంది. 1816లో జె.అబెదుబారు రచించిన 'హిందువుల ఆచారాలు పండుగలు' అనే పుస్తకంలో వేమనను గురించిన ప్రస్తావనను 1824లో సి.పి.బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి 1829లోను 1839లోను రెండు దఫాలుగా ఆంగ్లపాఠంతో సహా ప్రచురించడంతో ఆధునిక తెలుగు సమాజానికి వేమన తెలిసివచ్చాడు. 1924లో బ్రౌన్ రాసిన ముందుమాటలో These poems have attained very great popularity and partly are found translated into Tamil, Malayalam and Canarese” అని రాశారంటే వేమన అప్పటికే దక్షిణ భారతదేశమంతా ప్రాచుర్యం పొంది ఉన్నాడు అని అర్థమౌతుంది. వేమన పద్యాల్లో కన్పిస్తున్న స్థలనామాల్ని పరిశీలించి, 32 గ్రామ నామాల్ని కనుగొన్నారు. వీటిలో మళ్లీ తెలుగు భావాల్ని చెప్పడానికి, పద్యాల్లో ఛందస్సుకి అనుకూలంగా ఉపయోగించుకొంటూనే.. ఉత్తరాన గోదావరి నుండి దక్షిణాన సేతువు (తమిళనాడు) వరకూ, తూర్పున దివిసీమ లోని 'మోపిదీవి' నుండి, పశ్చిమాన కొంకణం వరకూ వేమన పర్యటించిన ప్రాంతంగా ఆరుద్ర చెప్పారు. ఉదయ పర్వతం, కంబం, కటారు పల్లె, కదిరి, కంచి, కొండవీడు, గండికోట, తిరుపతి, తిరుమల, నంది దుర్గం, మూగచింతల, మోపిదేవి, శ్రీశైలం (పర్వతం) గోదావరి మొదలైనవి. ఇవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందినవని స్పష్టమవుతున్నాయి.

కల్పితాలే ఎక్కువ
వేమన గురించిన చలామణిలో వున్న చాలా కథలు కల్పితాలు. లేదా భక్తిపూరితమైన నమ్మకాలు. ముఖ్యంగా వేమన కొండవీటి రాజు సోదరుడుగా పుట్టాడని, విశ్వద అనే వేశ్య, అభిరాముడనే కంసాలి మిత్రుడు ఉండేవారని వారిద్దరి పేరునే మకుటంగా చేసుకున్నాడన్నది కట్టుకథేనని పరిశోధకులు తేల్చారు. కాని వేమన గురించిన సినిమాలు నాటకాలు, ఆఖరుకు నార్ల వంటివారు రాసిన సాధికార చరిత్రలు కూడా ఆ కథల చుట్టూనే తిరిగాయి. వేమన రాజవంశీకుడై వుండడనేది ఒక సూత్రీకరణ. స్వతహాగా సేద్యం తెలిసిన మధ్యతరగతి రెడ్డి అని మరో వాదన. రాయలసీమలో కాపులను రెడ్లు అంటారు గనక ఎలాగైనా అనుకోవచ్చు. ఇవి కూడా కవికీ కవితకూ అభేదం చూస్తున్న ఫలితాలే. వేమన గురించే గాక చాలా మంది ప్రాచీన కవుల జీవితాల గురించి పెద్దగా తెలియదు. వాటిపై ఇంతటి వూహాగానాలు చేసిన వారెవరూ లేరు. కాని వేమన జనప్రియుడు కావడం వల్లనే గాక ఆయన పద్యాస్త్రాల ప్రభావం తగ్గించేందుకు కూడా ఇలాటి కథలు ప్రచారంలో పెట్టారు. శ్రీనాథుడు, పోతన గురించి గాని తెనాలి రామలింగని గురించి గాని ఇలాటి కథలెన్ని లేవు? ఆ కారణంగా వారి రచనల విలువ తగ్గించలేదే? కాని వేమన విషయానికి వచ్చే సరికి చలామణిలోని పలు రకాల పద్యాలు ప్రస్తావించి ఆయనకు సంబంధించిన ఆధారాలు లేవు గనక స్పష్టంగా చెప్పలేమని తికమక పెడుతుంటారు.
ఇదో కథ
వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగారు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకున్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకున్నాడు. కలిమి కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు. కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. చివరకు పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మహాసమాధి చెందాడని చెప్తారు.
వేమన జీవించిన కాలం
వేమన జీవించిన కాలం గుర్తించటానికి లభ్యమవుతున్న కొన్ని పద్యాల్ని పరిశీలించవచ్చు పారిస్ ప్రతిలోని...
''బాల్యవార్ధకములు పరగంగబొందిది
సప్తదశకమనెడు సరణిసుమ్ము
(వివరమెంచి) జూచి వేదాంత మెరుగడే
విశ్వదాభిరామ వినురవేమ''
అనే పద్యంలో సప్తదశకం ను బట్టి వేమన 70 సంవత్సరాలు జీవించి ఉండవచ్చుననీ, 1650 నుండి 1700 వరకూ దేశంలో వేమన సంచారం చేసి ఉంటారని సమగ్ర ఆంధ్ర సాహిత్యం, పునర్ముద్రణ,ఎనిమిదవ సంపుటిలో ఆరుద్ర ఊహించారు.
వేమన వికాసమిలా...
వేమన కవిత్వంలోని సంక్లిష్టతను సంఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే విజయనగర సామ్రాజ్య పతనం ప్రభావాన్నే గాక ఆ రాజ్య విధానాల వల్ల ఏర్పడిన వాతావరణ ప్రభావాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. కల్లోల కాలమెప్పుడూ కవిత్వానికి కవివాక్కుకూ పదును పెడుతుంది. సంక్షోభంలో సంవేదనలు సాంద్రమవుతాయి. సంక్లిష్టతలు సాహిత్యసృజనగా మారతాయి. వేమన కవిత్వంలో మనం స్థిర సమాజాన్నే గాక మారుతున్న విలువలను కొత్తపాతల ఘర్షణను కూడా చూస్తాం. 17వ శతాబ్దమంతా యుద్ధాలమయమే. కేంద్రంలో రాజులు ఎవరనే దానితో నిమిత్తం లేకుండా స్థానిక ప్రభువులు పాలెగాళ్లుగా పేరొందిన పాళియగార్లు దిగువన పెత్తనం చేస్తూ ప్రజలను పీడిస్తూ వచ్చారు. నిజానికి ఈ పాలియగార్లు చిల్లర రాజులు పొరుగు వూళ్లను దోచుకున్న ఉదంతాలు కూడా కోకోల్లలు. సామాజికంగా ఈ కల్లోలిత పరిస్థితులు ప్రజలలో అభద్రతను పెంచి మూఢనమ్మకాలకు పాలుపోశాయి. వర్ణవ్యవస్థ వికృతరూపం దాల్చింది. వేమన నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర
ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు-ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టాడు.తనను తానే 'వెర్రి వేమన్న' అని అభివర్ణించుకొన్నాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవాడు అరుదు.
పద్యాల్లో బతుకు
ఆర్థికం, స్త్రీ, కుల-మతాలు, వ్యక్తి-సమాజం వంటి అనేక విషయాల్లో వేమన తీరు ఆయన పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా చాలా విషయాల్లో ఆయన అభ్యుదయ భావాలు నేటి కాలానివా అనిపిస్తాయి. వేమన చెప్పాడని స్త్రీలపై వచ్చిన కొన్ని పద్యాలు ఆయనవో కాదో చెప్పలేం. ఎందుకంటే ప్రజా సాహిత్యంపై, మానవ వికాసంపై ఆధిపత్య వర్గాలు దాడులు చేస్తూనే ఉంటాయి. తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని విషయాల్లో నిజంగానే ఆయనలో లోపాలున్నాయో లేదో అని కచ్చితంగా చెప్పలేనపుడు మిగతా విషయాల్లోని అభ్యుదయ దృష్టితో వేమనను సానుకూలంగా అర్థం చేసుకోవచ్చు. సరిపడని విషయాల్ని వదిలిపెట్టేయవచ్చు. ప్రజల్లో వేమనపై ఉన్న మంచి అభిప్రాయానికి లేనిపోని అనుమానాలు, అన్వయాలు, రంధ్రాన్వేషణలతో తూట్లు పొడవడం కన్నా ఆయన ముందుకు తీసుకెళ్లిన వికాసాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడమే సరైన పద్ధతి. ఆ అభ్యుదయ వికాసాన్ని ఈ కొన్ని పద్యాల్లో...
కులాలు.. జాతులు
''కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు
సామ జాతమయెయ సకల కులము
హెచ్చు తగ్గుమాట లెట్లెరుంగగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ''
మతాలు... అభిమతాలు
''మతము వేషధార్లు మరి మహిమీద బదివేలు
మూఢజనుల గలప మూగుచుంద్ర
కొంగలు గుమిగూడి కొఱకవా బోదెలు
విశ్వదాభిరామ వినురవేమ''
ఆచారాలు.. వ్యక్తిత్వాలు...
''ఆత్మశుద్ధిలేని యాచారమదింయేల'' అన్నా
''భాండశుద్ధిలేని పాకమేల యన్నా,
చిత్తశుద్ధిలేని శివపూజలేలరాయన్నా
విశ్వదాభిరామ వినురవేమ''
చదువులు.. సంధ్యలు...
''స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే
సంశయంబు విడదు సాధకునకు
చిత్రదీపమునకు చీకటి పోనట్లు
విశ్వదాభిరామ వినురవేమ''
ధనం.. సమాజం...
''తల్లి బిడ్డలకును దగవు పుట్టించెడు
ధనము సుఖము కూర్చాదని వచింత్రు
కాని గడనలేక గడచుట యెట్లురా?
విశ్వదాభిరామ వినురవేమ''
''కులము గలుగు వారు గోత్రంబుకలుగువారు
విద్యచేత విర్రవీగువారు
పసిడి కల్గువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ''
మాధ్యమాలు.. ప్రచారాలు...
''పుత్తడి గలవాని పృష్ఠంబు పుండైతె
వసుధలోన చాలవార్తకెక్కు
పేదవాని యింట పెండ్లెన నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ''
తోటకూరకైన దొగ్గలికైనను
తవిటికూరకైన తవిటికైన
కావ్యములను చెప్పు గండ్యాలు ఘనమైరి
విశ్వదాభిరామ వినురవేమ!
అధికారాలు.. తంత్రాలు...
''అల్పబుద్ధి వానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడి కుక్క చెరుకుతీపెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ''
పట్టనేర్చుపాము పడిగ యోరగజేయు
చెరుప జూచురాజు చెలిమి జేయు
చంపదలచు రాజు చనువిచ్చు చుండురా
విశ్వదాభిరామ వినురవేమ!
ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకులేదు వట్టి బ్రాంతిగాని,
గొడ్డుటావు పాలు గోకితే చేపునా?
విశ్వదాభిరామ వినురవేమ?
ప్రభువు కోతియైన ప్రగడల్ పందులు
సైనికుండు నిక్కి సేనలు పసులు
ఏన్గుల శ్వచయము లెెలుకలు పిల్లులు
విశ్వదాభిరామ వినురవేమ!
మూఢవిశ్వాసాలు.. వెర్రి నమ్మకాలు
''విప్రులెల్ల గూడి వెర్రి కూతలు గూసి
సతి పతులను గూర్చి సమ్మతమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా
విశ్వదాభిరామ వినురవేమ''
''బల్లి పలుకులు విని ప్రజ తమ పనులెల్ల
సఫల మగుననుచు సంతసించి
కాని పనులకు తమ ఖర్మ మటందురు
విశ్వదాభిరామ వినురవేమ''
భక్తి.. కపటం
''నీళ్ల మునగనేల నిధులు మెట్టగనేల
మొనసివేల్పునకు మ్రొక్కనేల?
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినురవేమ''
శ్రమ.. తత్త్వం
భూమిలోన బుట్టు భూసార మెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రగతి భావ దీపం
హేతుశీలత, మానవీయత, సామాజిక న్యాయం, ధిక్కార తత్వం, శ్రమ గౌరవం, ప్రతిఘటనల ప్రతిబింబమైన వేమన ఈనాటి అవసరాలకూ ఆలంబనే. అంతెందుకు? వేమన పద్యాలలో వున్నన్ని ప్రశ్నలు మరే కవిలోనూ మనకు కనిపించవు. భక్తితెచ్చిన బాధలో కనిపించని దేవుణ్ని ప్రశ్నించిన వారున్నారు గాని కనిపించే సమాజ దుర్లక్షణాలపై కత్తిదూసిన వారు, రాజులనూ యాజులనూ ప్రశ్నించిన వారు వేమనలా ఎందరు? అందుకే ఆయన వారసత్వం అమూల్యం. అసమానం. పరిశోధనలతో భర్త్రహరి చెప్పిన శౌర్య పద్థతి మూర్ఖపద్ధతి వంటిదే వేమన శైలి అని కొందరనవచ్చు గాని అది అసంబంద్ధమైన పోలిక. భర్త్రహరి రాజులపై కొంత నిఘ్టారంగా రాసినా కొత్త విలువలేమీ చెప్పింది లేదు. ఆయన చెప్పిన శౌర్యం ధైర్యం అన్నీ కులీన లక్షణాలుగానే ధ్వనిస్తాయి. కాలం పరిమితుల వల్ల కులం వంటి అంశాల జోలికి వెళ్లింది లేదు. ఆ విషయంలో వేమన తన కాలం కన్నా చాలా చాలా ముందుకు నడిచాడు. 'కుండ కుంభమయ్యె కొండ పర్వతమయ్యె' అంటూ సంస్కృతీకరణను కూడా ఎత్తి చూపాడు. మాలల గురించి మరో మూడు వందలేళ్ల తర్వాత గురజాడ చెప్పింది అప్పుడే చెప్పేశాడు. 'మాలవానినంట మరి నీళ్లమునిగేరు' అనీ, 'మాలవానినేల మహిలోన నిందింప' అనీ చాలా చోట్ల ఆ ప్రస్తావనలు చేశారు. పైగా పండితులమని విర్రవీగేవారిని ఉద్దేశించి వాస్తవికతతో సంబంధం లేని చిలకపలుకుల వంటిదేేనని గురజాడ చెప్పింది కూడా వేమన రాసిందే. 'శ్రమములోన పుట్టి సర్వంబు తానౌను' అన్నప్పుడు 'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమై నది' లేనేలేదన్న శ్రీశ్రీ గుర్తుకు రాకుండా వుండడు. 'అల్పబుద్ధివానికధికారం ఇవ్వడం', 'గణకులొప్పుకున్న గవ్వలు చెల్లడం', రాతిబొమ్మలకు రంగైన వలువలేలని ఆక్షేపించడం, శకునాలను ముహూర్తాలను తోసిపుచ్చడం ఇవన్నీ చూస్తే వేమన ఈ కాలం వాడే నా అని ఆశ్చర్యం కలుగుతుంది. సానుజాతమయ్యె సకల కులము అన్న వేమన పేరిట తొలి రోజుల్లో చాలా వూళ్లలో యువజన సంఘాలు గ్రంథాలయాలు నాటక సమాజాలు ఏర్పడి చైతన్యం పెంచడంతో పెద్ద మనుషులు తట్టుకోలేకపోయారు. వేమన రాసింది కవిత్వం కాదనీ, ఆయన చదువుకోలేదని రాయడం చూస్తే మన సమాజంలో సంప్రదాయ భావాలు ఎంతగా ఘనీభవించి పోయాయో తెలుస్తుంది. దేవుడిపేరుతో పెట్టే నైవేద్యాలన్నీ మనిషికోసమేగానీ, దేవుడు తినడని చెప్పడం కాకుండా, అలాంటి అశాస్త్రీయమైన ఆలోచననుండి బయటపడిన మనిషే వికాసం పొందుతాడని పరోక్షంగా చెప్పాడు. ఆలోచనను అదుపులో పెట్టుకోవాలేకాని బోడిగుండు చేయించుకోవాల్సిన అవసరంలేదని హెచ్చరించాడు. ఒక్కొక్కసారి ఆలోచించి, పరిస్థితులను అంచనా వేసుకొని ఒదిగిపోవడమే వివేచనాజ్ఞానమని, వ్యక్తిత్వవృద్ధికి అది తోడ్పడుతుందని వేమన చెప్పాడు. 'అనువుగానిచోట అధికుల మనరాదు' 'యొదగి ఒక్క వంక యుండవలయును' అని చెప్పటంలో అననుకూలమైన పరిస్థితుల్లో అణిగిమణిగి ఉండాల్సిన అవసరాన్ని వేమన గుర్తుచేశాడు. ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ద్వారందగ్గర తల వంచుకొని వెళ్ళడం మనకే శ్రేయస్కరం. ఇలాంటి వివేచనాజ్ఞానం కలిగి ఉండమని వేమన సాహిత్యం చెప్తుంది.
ఇదేవిధంగా మంచి ఆలోచనతో ఉండటం వల్ల, అబద్ధాలు ఆడకుండా సత్యవంతమైన జీవితం గడపటం (కల్లలాడుకంటే కష్టంబు మరిలేదు) వల్ల ఉప్పు, కర్పూరం ఒకేవిధంగా ఉన్నప్పటికీ వేరుచేసి చూసే దృష్టిని అలవాటు చేసుకోవడం వల్ల, దానగుణం వల్ల, పరిమితంగా ఆహారం తీసుకోవడం వల్ల, నైతికత వల్ల, స్నేహశీలత వల్ల, వ్యక్తిత్వవికాసం వృద్ధి చెందుతుందని అనేక పద్యాల్లో వేమన వివరించాడు. జీవితంలో రుణపార్శ్వం వైపు కాకుండా ధనపార్శ్వంవైపు చూడగలగడం మంచి వ్యక్తిత్వమని ఆయన చెప్పాడు. చంపదగిన శత్రువు కన్పించినా అతనికి కీడుచేయకుండా మంచి చేసి పంపిస్తే అతనిలో మార్పు వస్తుందని అంటాడు వేమన. గువ్వ కోసం శరీరాన్ని కోసిచ్చాడు కాబట్టే శిబిరాజు కీర్తి వార్తకెక్కిందని, మేలుచేసే వ్యక్తికి ఎప్పుడూ ఆ గొప్పతనం ఉంటుందని వేమన సిద్ధాంతం. గ్రియర్సన్ చెప్పినట్లు 'మానవుడు సగౌరవంగా ఈ భూమిలో తలయెత్తుకొని తిరిగి స్వతంత్రముగా మనవలయుననియే ఆయన వాంఛ, మానవస్వాతంత్య్రం సమానత్వం ప్రతిష్ఠను ఆకాంక్షించే ప్రపంచ దార్శనిక మహాకవులలో వేమన సర్వోత్తముడు' అన్న మాటలు అక్షరసత్యాలు.
మానవీయం.. సామాజికం
వేమన నలిగినబాటలో నడిచిన కవికాదు. ఆయన తనదైన కొత్తదారిని, సొంతదారిని నిర్మించుకున్నారు. ఆయన వాణి, ఆయనబాణి ఆయనవే సమకాలిక సమాజాన్ని పౌరాణిక నేత్రాలతో దర్శించి, విశ్లేషించి కవిత్వం రాసి ఉంటే వేమనను గురించి ఇవాళ ఇంతగా మాట్లాడు కోవలసిన పని ఉండేది కాదు. ఆయన తనకాలపు సమాజాన్ని సామాజిక వైజ్ఞానిక నేత్రాలతో దర్శించాడు. విమర్శనాత్మకంగా విశ్లేషించాడు. ఆ చూపు నిశిత మైనది, మానవీయమైనది. హాస్యం అధిక్షేపం ఆయన కవిత్వ సాధనాలు. ఆడంబరం లేని అందమైన తెలుగు భాష ఆయన అభివ్యక్తికి గొప్ప కొరముట్టు. భాషాడంబర ప్రదర్శనమనే బలహీనతకు లోను కాకపోవడం వేమనలోని భాషా యోగిని పట్టిచూపుతుంది. వస్తువు, భావుకత, భాష అన్నీ సొంతమే. అరువు తెచ్చుకున్నవి కావు. ఆటవెలది పద్యం ఆయన కవిత్వవాహిక. సామాజిక పరివర్తన ఆయన గమ్యం. విమర్శనాత్మకత ఆయన గమనం, వేమనను వెలుగు లోనికి తెచ్చిన సి.పి.బ్రౌన్ “Vemana in Telugu Literature is what Lucian in Greek” (గ్రీకు సాహిత్యంలో లూషన్ ఎలాంటి వారో తెలుగు సాహిత్యంలో వేమన అలాంటివారు) అన్నారు. సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితులు - ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి మానవ సంబంధాలు, వాటిని నడిపిస్తున్న శక్తులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. వేమన తన కవిత్వంలో ప్రస్తావించిన, విమర్శించిన అనేకాంశాలు ఏదో ఒకరూపంలో- యధాతథంగాగాని, రూపం మార్చుకొనిగాని, మరింతముదురు రూపంలోగాని- ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక వివక్షలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ రుగ్మతలు, దొంగ గురువులు, సాంస్కృతిక మరుగుజ్జుతనం, మానవస్వార్థం, దురలవాట్లు, విగ్రహారాధన, సామాజిక సంఘర్షణలు, మానసిక కల్మషాలు, విలువల పతనం, ఆడంబరాలు, కక్షలు, కార్పణ్యాలు సమాజానికి ఎంత హాని చేస్తాయో నాలుగువందల ఏళ్ళ క్రితమే గుర్తించి హెచ్చరించిన వైతాళిక కవి వేమన. ఇవి ఇలాంటివి మన సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే వేమన ఈనాటి అవసరం. నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ వడికీ వరవడి వేమనే. ఆనాటికి బహుశా ఈ నాటికి కూడా వేమనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో బాణీల్లో మహోన్నత శిఖరాలధిరోహించిన మహాకవులు కూడా ఆయన పదును ముందు పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టం . అందులోనూ అన్ని రంగాలనూ స్పృశించిన వారు, అనుక్షణం గుర్తుకు వచ్చే శాశ్వత వాక్యాలు సృష్టించిన వారు మరిలేరు. తెలుగు భాషలో వేమన పద్యచరణాలు సామెతలుగా మారిపోయాయి. నానుడులుగా స్థిరపడిపోయాయి. ఎందుకంటే అవి జీవితంలోంచి వచ్చాయి. జీవితంలో నిల్చిపోయాయి. జీవితసత్యాలై పోయాయి.
ఇంతకూ వేమన
ఏ కాలం వారు?
పండితులూ పరిశోధకులందరూ ఇంచుమిం చుగా వేమన 1650 ప్రాంతాలలో వాడని తేల్చారు గనక ఆ కాలాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు.
వంగూరి సుబ్బారావు - 1412-1480
శేషాద్రి వెంకట రమణ కవులు -1460-1600
వేదం వెంకటకృష్ణ శర్మ - 1565-1625
వేటూరి ప్రభాకరశాస్త్రి - 1650
బండారు తమ్మయ్య - 1652-1725
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ - 1700
ఎన్.గోపి - 1655
మన కవి
ప్రాచీన తెలుగు కవులలో వేమన నిస్సందేహంగా విశిష్టమైన కవి. అతికొద్ది మంది ప్రాచీన కవులను రాజాస్థాన కవులని, ఆస్థానేతర కవులని విభజించుకుంటే ఆస్థానేతర కవులలో వేమన ప్రముఖుడు. మార్గ, దేశి కవులుగా విభజించుకుంటే వేమన అచ్చమైన దేశికవి. అనువాద, మౌలిక కవులుగా విభాగించుకుంటే, వేమన కల్తీలేని మౌలిక కవి. పౌరాణిక, సాంఘిక కవులని విభజించు కుంటే వేమన స్పష్టమైన సాంఘిక కవి. ప్రౌఢ, సరళ కవులని విడదీసుకుంటే వేమన అత్యంత సరళమైన కవి. యథాతథ, తిరోగమన, పురోగమన కవులుగా విడదీసుకుంటే వేమన నిస్సందేహంగా పురోగమన కవి. ''కవి ప్రవక్తా కాలంకన్నా ముందుంటారు''. అన్న గురజాడ మాటకు ప్రాచీన తెలుగు కవులలోంచి ఒక్క కవిని ఉదాహరించాలంటే వేమనే కనిపిస్తాడు. వేమన పద్యాలను ఇంత కాలం చీకట్లో అట్టిపెట్టిన వారు ఎన్ని అకృత్యాలకు పాల్పడి వుంటారో వూహించడం కష్టం కాదు. వూహించడం అవసరం కూడా. చార్వాకులు, లోకాయతుల రచనలను వారి విమర్శకుల నుంచి తెలుసుకున్నట్టే వేమన ప్రతులను కూడా వ్యతిరేకుల గుప్పిటి నుంచి విడిపించాల్సి వచ్చింది. పరస్పర విరుద్ధంగా ఇలా వేమన చెప్పి వుంటాడా అనే సందేహం కలిగిన చోట్ల ఈ అంశం కూడా గమనంలో వుంచుకోవడం అవసరం. ఆ అభ్యుదయ భావాలను సహించలేని వారు భాష్యాలు మార్చడానికి ప్రయత్నించి వుంటారనడంలో ఆశ్చర్యమేమీ లేదు.
విశ్వజనీనం
'విశ్వదాభిరామ వినురవేమ' అన్న మకుటుం వేమన్న పేరు తెలియని తెలుగు వారుంటారా? విశ్వద అన్న పదం కన్నడంలో విశ్వజనీనం అన్న దానికి పర్యాయపదమని చెప్పుకునే వివరణ సంతృప్తికరంగా వుంది. జగదభిరాముడు అన్న ప్రయోగం ప్రసిద్ధమేకదా అలాగే విశ్వదాభిరాముడు అని వుండొచ్చు. ఇక్కడ అభిరాముడంటే ఆసక్తుడనే. వేమన తన కవిత్వంలో చిత్రించిన సామాజికాంశాలలో చాలా భాగం ఇంకా కొనసాగుతున్నాయి. వాటినిర్మూలనకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 104 ఉపహ్రాలను ఒకేసారి ప్రయోగించగల వైజ్ఞానిక విప్లవ వాతావరణం ఒకవైపు, కాలంచెల్లిన భావాలు అభిప్రాయాలు ఆచారాలు మరో వైపు రాజ్యమేలుతున్న సందర్భంలో మరోసారి వేమనను అధ్యయనం చేయడం అవసరం. అందుకే సాహితి స్రవంతి 2017 ఏప్రిల్ 30న మహాకవి శ్రీశ్రీ జన్మదినాన ''వేమన సాహితీసమాలోచన'' అనే సదస్సును నిర్వహిస్తున్నది. 187 ఏళ్ళక్రితం వేమన పద్యాలను అనంతపురం నుండే ప్యారిస్‌కు పంపారు. ఆ అనంతపురంలో ఈ సదస్సు జరగడం ఉచితంగా ఉంది. వేమన తన కాలం కన్నా ఎంత ముందున్నారో తెలుసుకోడానికి, మనం ఇవాళ ఆయన కన్నా ముందున్నామా, వెనుకున్నామా నిర్ణయించుకోడానికి ఈ సదస్సు మంచి అవకాశం.
ఈ సదస్సు సందర్భంగా ప్రజాశక్తి బుకహేౌస్ వారు 13 పుస్తకాలు ప్రచురించారు. అవి ఇవి.
1. వేమన పద్యాలు : సి.పి.బ్రౌన్ 1839 నాటి సంకలనం
2. వేమన : రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
3. ప్రజాకవి వేమన : ఎన్. గోపి
4. వేమన్న వెలుగులు : ఎన్. గోపి
5. నిత్యసత్యాలు వేమన పద్యాలు : కె.ఎల్. కాంతారావు, కె.ఉషారాణి
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో
6. వేమన కవిత్వం - ఇతర తత్వవేత్తలు గుర్రంవెంకటరెడ్డి, పోచన రామిరెడ్డి
7. వేమన కవిత్వం - మానవత, విశ్వమానవత
8. వేమన కవిత్వం - సామాజికత
9. వేమన కవిత్వం - స్త్రీ
10.వేమన కవిత్వం - తాత్వికత
11.వేమన కవిత్వం - ఇతర భారతీయకవులు
12.వేమన కవిత్వం - ప్రాదేశికత
13.వేయివెలుగుల వేమన - వ్యాససంకలనం- స్నేహ డెస్క్

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565