ఆహారం
జీవితానికి ఇంధనం...
మనమందరం కడుపున పుట్టాము. అదీ కడుపు గొప్పతనం. మన జీవితం కడుపులో మొదలైంది.మన జీవితం కడుపులో పడే ఆహారం వల్లే సాగుతుంది. ఆరోగ్యానికి అనారోగ్యానికి తేడా మనం తినే పదార్థాలవల్లే నిర్ణయించబడుతుంది. పౌష్ఠిక ఆహారం, సమతుల ఆహారం మనకి అవసరం. ఈ వ్యాసంలో రాసిన చాలా విషయాలు మీకు తెలిసినవే. కానీ మనకుండే పని ఒత్తిడి వల్ల ఈ విషయాలు తరచూ మరచిపోతుంటాం. ఈ పేజీని మీకు ఒక ‘రెడీ రెకనర్’ గా అందించాలన్నదే మా ప్రయత్నం. వంట గది తలుపు మీదో డైనింగ్ టేబుల్ పక్కనో ఈ పేజీని అతికించుకోండి. రోజూ చూసుకోండి. మీ కుటుంబానికి జీవం ఉట్టిపడేలా ఆరోగ్యకరమైన పోషణ ఇవ్వండి.
ఏ ఎత్తుకు ఎంత బరువు?
ఏ ఏ ఎత్తుకు ఎంత బరువండాలో అది వుహిళా, పురుషుడా అన్న అంశంతో వూరుతుంది. వురి వున బరువెంతో చూసుకునేందుకు వూర్గాలు ఉన్నాయి.
ఎత్తు, బరువ, సూచిక. (హైట్, వెయిట్ చార్ట్ ఇచ్చాం).
బాడీ, వూస్ ఇండెక్స్ ∙నడుము, హిప్ నిష్పత్తి ∙ శరీరంలో కొవ శాతం
మీరు లావెక్కుతున్నారా?...
మీరు బరువ పెరుగుతూ లావెక్కుతున్నారా? లేదా? అన్న విషయం ఓ చిన్న లెక్కతో తెలుసుకోవచ్చు. ఓ వ్యక్తి శరీరంలోకి కండ పాళ్లు అతడికి తగ్గట్లుగా ఉన్నాయా అన్న విషయాన్ని తెలుసుకునే ఈ సూచికను బాడీ వూస్ ఇండెక్స్ అంటారు. బాడీ వూస్ ఇండెక్స్ తెలుసుకోవడం ఎలాగంటే... ఉదాహరణకు మీ ఎత్తు ఐదడుగుల ఎనిమిది అంగుళాలు అనుకుందాం. అంటే 172 సెంటీమీటర్లు అన్నవూట. మీ బరువ# 65 కిలోలు అనుకుందాం. అప్పుడు 65 కిలోలు డివైడెడ్ బై 1.72 1.72 కాలిక్యులేట్ చేస్తే మీ బీఎంఐ వచ్చేస్తుంది. దీని విలువ 21.97 కిలోలు/మీటర్ స్క్వేర్. ఆరోగ్య కరమైన బీఎంఐ విలువ 19–23 వుధ్య ఉండాలి. మీరు బరువ పెరుగుతూ పోతే మీ బీఎంఐ విలువ కూడా పెరుగుతుంది.
బీఎంఐ లెక్కేశాక చూసుకోడానికి నిర్దేశిత ప్రవూణాలివి...
ఆరోగ్యకరమైన బాడీ వూస్ ఇండెక్స్ అంటే అది... 19–23 కిలోలు/మీటర్ 2
అవసరమైన దానికంటే బరువెక్కువ అంటే అది... 23–25 కిలోలు/మీటర్ 2
మీరు ఖచ్చితంగా బాగా లావే అని తేల్చే పరిమితి అంటే... మీ బీఎంఐ 25 కిలోలు/మీటర్2 పైవూటే అన్నవూట.
వురి ఒకవేళ మీ బాడీ వూస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువ గానీ ఉంటే... మీరు చాలా చాలా లావెక్కువ అన్నవూట.
30 నుంచి 34.9 బీఎంఐ ఉంటే... గ్రేడ్ – 1 ఒబేసిటీ అంటారు.
35 నుంచి 39.9 బీఎంఐ ఉంటే... గ్రేడ్ – 2 ఒబేసిటీ అని అంటారు.
40 కంటే ఎక్కువగా ఉంటే అది వూర్బిడ్ ఒబేసిటీ అని అంటారు. అంటే ఆ స్థాయిలో జబ్బులు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అన్నవూట.
వెయిస్ట్ హిప్ రేషియో...
నడుము కొలతకూ, దానికి కిందే ఉండే హిప్ కొలతకు వుధ్యనున్న నిష్పత్తిని చూడాలి. నడుము కొలతను, హిప్ కొలతతో భాగిస్తే వచ్చే విలువ పురుషుల్లో 0.9 నుంచి 0.95 కంటే తక్కువగానూ, వుహిళల్లో అయితే 0.85 నుంచి 0.86 కంటే తక్కువగానూ ఉండాలి. ఆ విలువలు అంతకు మించి ఉన్నాయంటే పొట్టభాగంలో కొవ#్వ చేరి బరువ# పెరుగుతున్నట్లు అర్థం. కొన్ని సందర్భాల్లో ఎత్తుకు తగ్గ బరువ ఉన్నా, వెయిస్ట్, హిప్ రేషియో చక్కగానే ఉన్నా కూడా శరీరంలో ఎక్కువ కొవ#్వ ఉండవచ్చు. ఇలాంటి వాళ్లలో కండ పాళ్ల కంటే కొవ#్వ పాళ్లు ఎక్కువన్నవూట. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహాపై బరువ తగ్గే ప్రయత్నం చేయాలి.
లావెక్కితే లాసెక్కువే...
మీరు అవసరమైన దానికంటే ఎక్కువ బరువంటే భవిష్యత్తులో షుగర్, హైబీపీ, గుండె జబ్బుల వంటి సవుస్యలు ఎన్నెన్నో వచ్చేందుకు అవకాశం ఉంది. వాటిని నివారించాలంటే లావ# పెరగకుండా నియంత్రించుకోవాలి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలతో బరువు ను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే, బరువు తగ్గడానికి డైటింగ్ పేరిట ఆహారం వూనేయడం సరికాదు. మీ అదనపు బరువ# తగ్గడానికి నెలకు 1 నుంచి 2 కిలోలు తగ్గితే అది ఆరోగ్యకరమైన తగ్గుదలే. నెలకు 4 కిలోలు వరకు తగ్గినా పర్లేదు. కానీ ఆ పరిమితి మించితే అది ఆరోగ్యకరం కాదు.
టమాటోటమాటో సాంకేతికంగా పండు అయినప్పటికీ మన దేశంలో కూరగాయగానే వాడటం అలవాటు. అందువల్ల దీనిని కూరగాయగానే పరిగణిస్తారు. టమాటోలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పండుతాయి. వీటిని కూరలు, పచ్చళ్లు, సలాడ్లతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే సాస్, కెచప్ వంటి వాటి తయారీలోనూ వాడతారు. వివిధరకాల వంటకాలకు అలంకరణ కోసం కూడా టమాటో ముక్కలను వాడతారు.
పోషకాలు: టమాటోలలో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, విటిమిన్–ఎ, విటమిన్–బి1, బి3, బి6, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె, బీటాకెరోటిన్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: టమాటోలు గుండెజబ్బులను, చక్కెరజబ్బును, రక్తహీనతను నివారిస్తాయి. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.
దోసకాయ
దోసకాయలు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో విరివిగా పండుతాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో పొడవుగా కనిపించే కీర దోసకాయలను సాధారణంగా పచ్చిగానే తింటారు. వీటిని సలాడ్లు వంటి వాటిలో వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఉప్పునీటిలో ఊరవేసి కూడా తింటారు. పసుపుగా గుండ్రంగా ఉండే దోసకాయలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు.
పోషకాలు: దోసకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. ఇవి డీహైడ్రేషన్‌ను దూరం చేస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. కడుపు మంట, అల్సర్లు వంటి బాధలను తగ్గిస్తాయి. స్థూలకాయాన్ని అరికడతాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండె సమస్యలను నివారిస్తాయి.
బెండకాయ
బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. భారత్‌లో బెండకాయలతో కూరలు, వేపుళ్లు, పులుసులు వంటి వంటకాలను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు. పోషకాలు: బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు:బెండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కాలిఫ్లవర్
కాలిఫ్లవర్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా సాగవుతోంది. ఇందులో ఎక్కువగా లేత పసుపు రంగులోనివే కనిపిస్తాయి. అయితే, ఊదా, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో కూడా కాలిఫ్లవర్ రకాలు ఉన్నాయి. కాలిఫ్లవర్‌ను రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల కాలిఫ్లవర్ తురుమును పచ్చిగానే సలాడ్లలో వాడతారు.
పోషకాలు: పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. జీర్ణకోశానికి రక్షణ ఇస్తుంది. అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది.
వంకాయలు∙
వంకాయలను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. వంకాయల్లో నానా రకాలు ఉన్నా, పోషక విలువలు అన్నింటిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. వంకాయలతో భారతీయులు రకరకాల కూరలు, పచ్చళ్లు, పులుసులు వంటివి చేసుకుంటారు. నేరుగా వాటిని కాల్చుకుని కూడా తింటారు. ఇతర దేశాల్లోనూ వంకాయలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు. వాటిని ఊరబెట్టి కూడా తింటారు.
పోషకాలు: వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి.
సొరకాయ
సొరకాయ నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయ. దీనినే ఆనపకాయ అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా ప్రాంతాల్లో దీనిని విరివిగా పండిస్తారు. మన దేశంలో సొరకాయను నేరుగా కూరగా వండుకోవడమే కాకుండా సాంబారు, పులుసు, పప్పు వంటి వంటకాల్లో విరివిగా వాడతారు. ఉత్తరాదిలో దీనితో మిఠాయిలు కూడా తయారు చేస్తారు. పలుదేశాల్లో సొరకాయ జ్యూస్‌ను సేవిస్తారు.
పోషకాలు: సొరకాయలో స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, నామమాత్రంగా ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణశాయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది.
క్యాబేజీ
క్యాబేజీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఊదారంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవడమే కాకుండా, క్యాబేజీ తురుమును పచ్చిగానే సలాడ్లు వంటి వాటిలో కలిపి తింటారు. కొన్ని ప్రాంతాల్లో క్యాబేజీని ఊరవేస్తారు.
పోషకాలు: పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: క్యాబేజీ జీర్ణకోశానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. చర్మానికి, కంటికి మేలు చేస్తుంది.
గోరు చిక్కుడు
భారత దేశంలోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లోనూ, పాకిస్థాన్‌లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది. దీనినే గోకరకాయ అని కూడా అంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీని సాగు జరుగుతోంది. అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోను గోరు చిక్కుడు పంట విస్తారంగానే పండుతోంది. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ గోరు చిక్కుడు మొక్కలు పెరుగుతాయి. గోరుచిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరుచిక్కుడు జిగురును రకరకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
పోషకాలు: గోరు చిక్కుడులో ప్రొటీన్లు, స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.
చిక్కుడుకాయ
చిక్కుడుకాయలను దాదాపు ప్రపంచమంతటా సాగు చేస్తారు. చిక్కుడుకాయలు లేతగా ఉండగానే కోసి, వంటల్లో వాడతారు. ముదిరిన చిక్కుడు కాయల నుంచి గింజలను వేరుచేసి, వాటిని ఎండబెట్టుకుని వంటకాల్లో వాడతారు. ఇక లేలేత చిక్కుడు ఆకులను పాలకూర మాదిరి ఆకుకూరలా ఉపయోగిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కూరగాయల్లో చిక్కుడు కాయలు బలవర్ధకమైనవి.
పోషకాలు: చిక్కుడుకాయల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్– బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. కండరాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. వార్ధక్య లక్షణాలను అరికడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. పక్షవాతం, గుండెపోటు వంటి జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
గుమ్మడి
తెలుగువారికి ఇష్టమైన, శుభప్రదమైన కూరగాయ గుమ్మడి. దీనిని ప్రపంచవ్యాప్తంగా సాగుచేస్తారు. గుమ్మడితో భారతీయులు కూరలు, పులుసులు వంటివి తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజలను కూడా వేయించుకుని తింటారు. పాశ్చాత్యులు గుమ్మడితో ప్యూరీ, సూప్, సలాడ్స్, కొన్ని రకాల మిఠాయిలు తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను కూడా పాశ్చాత్యులు వినియోగిస్తారు.
పోషకాలు: గుమ్మడిలో పీచు పదార్థాలు, చక్కెర, పిండి పదార్థాలు, స్వల్పంగా ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్యలాభాలు: గుమ్మడి ప్రొస్టేట్ వాపును తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు మలబద్ధకాన్ని నివారించి, పేగులను శుభ్రపరుస్తాయి. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధం చేస్తుంది. ఆయుర్వేదంలోనూ గుమ్మడిని రకరకాల చికిత్సల్లో ఉపయోగిస్తారు.
పొట్లకాయ
పొట్లకాయలు భారత్ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ వాడుకలో ఉన్నాయి. భారత్‌లో పొట్లకాయలతో రకరకాల కూరలు వండుకుంటారు. కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తర్వాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పొట్ల మొలకలను, ఆకులను కూడా తింటారు.
పోషకాలు: పొట్లకాయల్లో పీచు పదార్థాలు, స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: పొట్ల కాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
బీరకాయ
భారత్ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ బీరకాయలు విరివిగా పండుతాయి. పుష్కలంగా పీచు పదార్థాలు కలిగి, తేలికగా జీర్ణమయ్యే బీరకాయలను పథ్యం వంటల్లోనూ వాడతారు. బీరకాయలతో కూరలు, పచ్చళ్లు చేసుకుంటారు. కొన్నిచోట్ల బీరకాయ పచ్చిముక్కలనే సలాడ్లలో వాడతారు.
పోషకాలు: బీరకాయల్లో పుష్కలంగా పీచు పదార్థాలు, విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటి విటమిన్లు ఉంటాయి. జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: బీరకాయలు స్థూలకాయాన్ని నివారిస్తాయి. ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను నివారించి, జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
దొండకాయ
దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. భారత్‌లో దొండకాయలతో కూరలు, వేపుళ్లు వండుకుంటారు. వంటల కోసం సాధారణంగా మన దేశంలో లేత దొండకాయలను ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటì దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు.
పోషకాలు: దొండకాయల్లో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: దొండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి.
కాకరకాయ
భారత ఉపఖండ ప్రాంతంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కాకరకాయలను విరివిగా పండిస్తారు. కాకరకాయలతో రకరకాల కూరలు, పులుసులు, సూప్స్, సలాడ్స్ వంటివి తయారు చేసుకుని తింటారు. చిరకాలంగా వాడుకలో ఉన్న కాకరకాయను ఆయుర్వేద తదితర సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లోనూ వివిధ వ్యాధులను నయం చేయడం కోసం వినియోగిస్తారు.
పోషకాలు: కాకరకాయలో విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: కాకరలోని హైపోగ్లెసీమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి, చక్కెర జబ్బును అదుపు చేస్తుంది. సోరియాసిస్ సహా పలు చర్మవ్యాధుల నివారణకూ ఉపయోగపడుతుంది. డయేరియా వంటి జీర్ణకోశ వ్యాధుల చికిత్సలోనూ ఆయుర్వేద వైద్యులు కాకరను ఉపయోగిస్తారు.
బాదం
బాదం గింజలను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టంగా తింటారు. ఈ గింజలు బలవర్ధకమైన ఆహారం. ఇందులో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాల బాదం గింజలు ఉంటాయి. తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి బాదం సాగవుతోంది.
పోషకాలు: బాదంలో పిండి, పీచు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. మాంసకృత్తులు కూడా బాగా లభిస్తాయి. విటమిన్ ఇ బాదంలో సమృద్ధిగా లభిస్తుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు బాదం ద్వారా లభిస్తాయి.
ఆరోగ్య లాభాలు: బాదంతో గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. తక్షణశక్తిని పొందేందుకు కూడా బాదం బాగా పనికొస్తుంది. రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉన్నందున, మధుమేహం ఉన్నవారు బాదంను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది.
కొబ్బరి
కొబ్బరి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. భారతదేశంలో దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను కొట్టడం ఎప్పట్నుంచో వస్తోంది. కొబ్బరిని పచ్చిగా ఉన్నప్పుడు, ఎండబెట్టి రెండు రకాలుగానూ వాడుతూ వస్తున్నారు. కొబ్బరి నుంచి నూనెను కూడా తయారు చేస్తున్నారు. ఎండు కొబ్బరి సాధారణంగా ప్రతి వంటకంలో వాడుతూ ఉండటం చూడొచ్చు.
పోషకాలు: కొబ్బరిలో కొవ్వు, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, ఇ, బి6 విటమిన్లు దొరుకుతాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కొబ్బరిలో బాగా లభిస్తాయి.
ఆరోగ్య లాభాలు: మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు కొబ్బరి నీరు తాగినా, తిన్నా ఫలితం కనిపిస్తుంది. వాంతులు, కళ్లు తిరగడం లాంటి సమస్యలతో బాధపడే వారు కొబ్బరిని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కలరా వ్యాధికి కూడా కొబ్బరి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
పిస్తా
పిస్తా పప్పు మంచి బలవర్ధకమైన ఆహారం. కొంతే తిన్నా కడుపు నిండినట్లుగా అనిపించి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న పిస్తా ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి.
పోషకాలు: పిస్తాలో కొవ్వు, పీచు‡పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువే. విటమిన్ బి6, సి, ఇ పిస్తాలో లభించే విటమిన్లు. పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: డ్రై ఫ్రూట్స్ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ఇందులోని విటమిన్ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వే ఎక్కువగా ఉండటంతో డైట్‌లో దీనిని చక్కగా చేర్చుకోవచ్చు.
జీడిపప్పు
జీడిమామిడి పండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పును సేకరిస్తారు. ఉష్ణ మండలాల్లో ఎక్కువగా జీడిని సాగు చేస్తున్నారు. భారతదేశం నుంచి జీడి ఎగుమతి పెద్ద ఎత్తునే జరుగుతోంది. జీడి పండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి.
పోషకాలు: జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ మోతాదుల్లో లభిస్తాయి. విటమిన్ ఇ, కె, బి6 సమృద్ధిగా లభిస్తాయి. క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా జీడిలో మెండుగా ఉన్నాయి.
ఆరోగ్య లాభాలు: రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి, రక్తపోటును నియంత్రించడానికి జీడిపప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి కూడా జీడిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
ఎండు ద్రాక్ష
ద్రాక్ష పండును ఎండబెడితే తయారయ్యేదే ఎండు ద్రాక్ష. కిస్మిస్ అన్న పేరుతో ఇది మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ద్రాక్షలో 60 శాతం వైన్ తయారీకే ఉపయోగిస్తుండగా, 7 శాతం ఎండు ద్రాక్షను తయారు చేస్తున్నారు. మిగిలినవే ద్రాక్ష పండ్లుగా నేరుగా లభిస్తున్నాయి. కొన్ని రోగాల బారినపడిన వారికి కిస్మిస్‌నే ప్రత్యేకంగా డైట్‌లో చేర్చుతూ ఉంటారు.
పోషకాలు: పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, బి6 ఎక్కువగా లభిస్తాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి ఎండు ద్రాక్షలో లభించే ఖనిజ లవణాలు.
ఆరోగ్య లాభాలు: సంతానలేమితో బాధపడేవారికి ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలు తేల్చాయి. తరచూ జ్వరంతో బాధపడేవారికి ఎండు ద్రాక్ష మంచి ఔషధం. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి బాగా పెరిగేందుకు ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. రక్తహీనత, తక్కువ బరువు, సెక్స్ కోరికలు తగ్గడం లాంటి సమస్యలున్న వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
ఖర్జూరం
ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో లభ్యమయ్యే పండ్ల చెట్టు. ఇందులో ఆడా, మగా అంటూ వేర్వేరు రకాలు ఉంటాయి. ఆడ చెట్టు నుంచే ఖర్జూరం పండ్లు లభిస్తున్నాయి. ప్రపంచమంతటా ఖర్జూరం∙మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. తక్షణమే శక్తినిచ్చేది కావడంతో మార్కెట్‌లో ఖర్జూరంకు మంచి గిరాకీ ఉంది. మనిషికి పరిచయమైన మొదటి ఆహార వృక్షంగా ఖర్జూరంను చెప్పుకుంటూ ఉంటారు. రంజాన్ సీజన్‌లో ఖర్జూరం తినడంతోనే ముస్లింలు ఉపవాసాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. పండ్లలోని తేమను బట్టి మెత్తటివి, కాస్త ఎండినవి, పూర్తిగా ఎండినవి.. ఇలా రకరకాల ఖర్జూరాలు ఉన్నాయి.
పోషకాలు: ఖర్జూరంలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి మెండుగా లభిస్తోంది. పాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఖర్జూరంలో ఎక్కువగా లభిస్తాయి.
ఆరోగ్య లాభాలు: పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గడానికి, ఎముకలు బలంగా తయారవ్వడానికి, ఉదర క్యాన్సర్‌ను తరిమేయడానికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిది. డయేరియా, రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఖర్జూరంను చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
అంజూర
అంజూర పండ్లకు ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల ఏళ్ల కిందటే అంజూరను సాగు చేయడం మానవుడు మొదలుపెట్టాడు. నేడు ప్రపంచమంతటా అంజూర్ సాగు విస్తరించింది. కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు ఉండే ఈ పండ్లు వర్షా కాలంలోనే ఎక్కువగా సాగవుతున్నాయి. ఇక ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజూర్ డ్రై ఫ్రూట్ మాత్రం ఏడాది పొడుగునా మార్కెట్‌లలో లభ్యమవుతూనే ఉంటుంది.
పోషకాలు: అంజూరలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, ఎ, బి6 విటమిన్లు అంజూర ద్వారా లభిస్తున్నాయి. పొటాషియం, క్యాల్షియం ఇందులో ఎక్కువగా లభిస్తున్నాయి. సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఇతర ఖనిజ లవణాలు కూడా తగు మోతాదుల్లో ఉన్నాయి.
ఆరోగ్య లాభాలు: జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అంజూర్ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి, ఎముకలు బలంగా మారడానికి అంజూర్ పనికొస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్‌లకు అంజూర మంచి ఔషధం.
వేరుశనగ
భారతదేశమంతటా వంటకాలు చేయడానికి వేరుశనగల నుంచి తీసిన నూనెనే వాడుతూ ఉంటారు. ప్రపంచమంతటా వ్యాపించిన ఈ పంట, ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటల్లో ఒకటిగా వేరుశనగ కనిపిస్తూ ఉంది. వేరుశనగలు బలమైన ఆహారం. పల్లీలనే పేరుతో వేరుశనగలను పిలుస్తూ ఉంటారు. ఈ పల్లీలను వంటకాలలో రుచి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.
పోషకాలు: వేరుశనగలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. మాంసకృత్తులు కూడా పల్లీలలో తగు మోతాదుల్లో లభిస్తాయి. విటమిన్ సి, ఎ, బి6 విటమిన్లు బాగా లభ్యమవుతాయి. ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: పచ్చి పల్లీలు తీసుకుంటే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. పొట్టలో పడే క్యాన్సర్‌ను కూడా ఇవి తప్పించగలవు. ఉడకబెట్టిన పల్లీలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి.
నువ్వులు
ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఉష్ణమండల ప్రదేశాల్లో నువ్వులు విరివిగా సాగవుతాయి. ప్రధానంగా నువ్వులు నూనె గింజలే అయినా, నువ్వులను తాలింపుల్లోనూ, మసాలాల్లోనూ, మిఠాయిలు, చిరుతిళ్లకు గార్నిషింగ్‌గానూ ఉపయోగిస్తుంటారు. నువ్వులను బెల్లంతో కలిపి తయారు చేసే నువ్వుండలు, నువ్వుల చెక్కీలు మన దేశంలో పాపులర్ చిరుతిళ్లు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలోనూ, వేపుడు వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు.
పోషకాలు: నువ్వుల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఎముకలకు, దంతాలకు, కండరాలకు బలాన్నిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును గణనీయంగా నివారిస్తాయి. చర్మానికి, జుట్టుకు నిగారింపునిస్తాయి.
జీలకర్ర
చిరకాలంగా వాడుకలో ఉన్న సుగంధద్రవ్యం జీలకర్ర. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. జీలకర్రలో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అనే రెండు రకాలు ప్రధానంగా ఉంటాయి. రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను ఉపయోగిస్తారు. అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా కూడా జీలకర్రను ఉపయోగించడం మన దేశంలో అలవాటే.
పోషకాలు: జీలకర్రలో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జీర్ణ సంబంధిత సమస్యలకు, చర్మ సంబంధిత సమస్యలకు, జలుబు దగ్గు వంటి సాధారణ సమస్యలకు జీలకర్ర విరుగుడుగా పనిచేస్తుంది. గర్భాశయ, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు కూడా ఆయుర్వేదంలో జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు.
మిరియాలు
చూడటానికి నల్లగా, రుచికి కారంగా ఉండే మిరియాల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. స్పైసీ వంటకాల్లోనే కాదు, ఆయుర్వేద వైద్యంలోనూ మిరియాలను విరివిగా వాడతారు. భారత్ సహా పలు ఆసియా దేశాల్లోనూ, దక్షిణ అమెరికాలోనూ మిరియాలను విరివిగా సాగు చేస్తారు. వంటకాల్లోనే కాకుండా, ఆయుర్వేద ఔషధాల్లోనూ మిరియాలను ఉపయోగిస్తారు.
పోషకాలు: మిరియాల్లో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను నయం చేసే మిరియాలు.. శరీరంలోని కొవ్వును తగ్గించడంలోనూ, కండరాల నొప్పులను దూరం చేయడంలోనూ బాగా తోడ్పడతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశ సమస్యలకు, చర్మవ్యాధులకు, అలర్జీలకు, వాపులకు మిరియాలు మంచి విరుగుడుగా ఉపయోగపడతాయి.
అల్లం
ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోను, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు.
పోషకాలు: అల్లంలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: నోటి దుర్వాసన, అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, దగ్గు, జలుబు, కఫం, మధుమేహం వంటి సమస్యలకు అల్లం చక్కని విరుగుడుగా ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుతుంది. అరుచిని పోగొడుతుంది.
దాల్చిన చెక్క
మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కదే అగ్రస్థానం. ఆహార పదార్థాలకు చక్కని సుగంధం, నోరూరించే రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా అందించే దాల్చిన చెక్కలో మంచి ఔషధగుణాలు ఉన్నాయి. దాల్చినచెక్కను వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. సంప్రదాయ వైద్యంలోనూ దాల్చిన చెక్కను వాడతారు.
పోషకాలు: దాల్చిన చెక్కలో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: దాల్చిన చెక్కలో క్యాన్సర్ కారకాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇక మధుమేహం, కీళ్లనొప్పులు, రుతుక్రమ సమస్యలు, అజీర్తి సమస్యలకు, అకాల వార్ధక్యానికి దాల్చిన చెక్క చక్కని ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
ధనియాలు
ధనియాలు భారత దేశమంతటా విస్తారంగా సాగవుతాయి. పశ్చిమాసియా, దక్షిణ యూరోప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర ప్రాంతాల్లోనూ ధనియాలను సాగు చేస్తారు. మసాలా పొడుల్లో ధనియాలను విరివిగా ఉపయోగిస్తారు. ఇంటి వైద్యంలో భాగంగా ధనియాల కషాయం వాడతారు.
పోషకాలు: ధనియాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జీర్ణాశయ సమస్యల నివారణకు ధనియాలు బాగా ఉపయోగపడతాయి. కిడ్నీ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ధనియాల్లోని ఎసెన్షియల్ ఆయిల్స్ బ్యాక్టీరియాను అరికట్టగలవు.
మెంతులు
రుచికి చేదుగా ఉండే మెంతులను వాడటానికి చాలామంది వెనుకాడతారు గానీ, వీటిలో మంచి ఔషధ విలువలు ఉన్నాయి. భారత్‌లో మెంతులను ఊరగాయల్లోనూ, పోపు దినుసుగానూ వాడతారు. రకరకాల మసాలా పొడుల్లోనూ ఉపయోగిస్తారు.
పోషకాలు: మెంతుల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: మెంతులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెజబ్బులను నివారిస్తాయి. చక్కెర వ్యాధిని అదుపు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
తానికాయ
తానికాయలు భారత్‌తో పాటు దక్షిణాసియాలోని పర్వత ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి. ఆయుర్వేదంలోని త్రిఫలాల్లో ఇది కూడా ఒకటి. తానికాయను ఆయుర్వేద, టిబెటన్, చైనీస్, అరబిక్ సంప్రదాయ వైద్యాల్లో చిరకాలంగా వాడుతూ వస్తున్నారు.
పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: తానికాయలను దగ్గు, గొంతునొప్పి, ఉబ్బసం, జీర్ణాశయ సమస్యల చికిత్సలో విరివిగా వాడతారు. తానికాయలు అకాల వార్ధక్యాన్ని అరికడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తానికాయ గింజల నుంచి తీసిన నూనెను వాపులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి ఉపయోగిస్తారు. కంటిచూపు మెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు కూడా తానికాయ నూనె ఉపయోగపడుతుంది.
కరక్కాయ
కరక్కాయను వంటల్లో వాడకపోయినా, ఇంటింటా చిట్కా వైద్యాల్లో విరివిగా వాడతారు. కరక్కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, వియత్నాం, మలేసియా తదితర ఆసియా దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయలను ఉపయోగిస్తారు.
పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: ఆయుర్వేదంలోను, టిబెటన్ సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దగ్గు, ఉబ్బసం వంటి బాధల నుంచి ఉపశమనానికి కరక్కాయను అరగదీసి, తేనెలో కలిపి వాడతారు. ఉసిరికాయ, తానికాయలతో సమపాళ్లలో కరక్కాయలను కలిపి తయారు చేసే త్రిఫల చూర్ణం జీర్ణకోశ సమస్యలకు, మలబద్ధకానికి, మూలవ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
గంధ కచ్చూరాలు
అల్లంజాతికి చెందిన మొక్క నుంచి గంధ కచ్చూరాలు లభిస్తాయి. మొక్క దుంపలను వేరుచేసి, ఎండబెట్టి ఉపయోగిస్తారు. భారత్, చైనా సహా ఈ మొక్కలు దక్షిణాసియా అంతటా కనిపిస్తాయి. వంటింటి మూలికగా పనికొచ్చే గంధ కచ్చూరాలను మన దేశంలో వంటల్లో వాడటం అరుదు. అయితే, ఇండోనేసియా, చైనాలలో వీటిని వంటకాల తయారీలోనూ ఉపయోగిస్తారు.
పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలకు గంధ కచ్చూరాల కషాయం విరుగుడుగా పనిచేస్తుంది. కచ్చూరాలు చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. మూత్రాశయ సమస్యలను అరికడుతుంది.
బావంచాలు
బావంచా మొక్కలు దక్షిణ ఆసియా అంతటా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. బావంచా గింజలను ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లోను, టిబెటన్, చైనీస్ సంప్రదాయ వైద్యాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. మన దేశంలో గృహ వైద్యంలో కూడా బావంచాలను రకరకాల చిట్కా వైద్యాలకు ఉపయోగిస్తారు.
పోషకాలు: బావంచాల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: నొప్పి నివారణ ఔషధంగా బావంచాలు బాగా ఉపయోగపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు రాలడాన్ని అరికడతాయి. కిడ్నీ సమస్యలను నివారిస్తాయి. చైనీస్ వైద్యంలో బొల్లి వంటి మొండి చర్మ వ్యాధులను నయం చేయడానికి బావంచాలను వాడతారు.
పిప్పళ్లు
మిరియాల రంగులో కాస్త పొడవుగా కనిపించే పిప్పళ్లను వంటకాల్లోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ విరివిగా వాడతారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో పిప్పళ్లు విరివిగా లభిస్తాయి. పిప్పళ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
పోషకాలు: పిప్పళ్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: పిప్పళ్లలో ఉండే ‘పైపర్ లాంగుమిన్’ (పీఎల్) అనే రసాయనం కొన్ని రకాల క్యాన్సర్లను, మెదడులో ఏర్పడే కణితులను సమర్థంగా నిరోధించగలదని ఆధునిక పరిశోధనల్లో తేలింది. సంప్రదాయ వైద్యంలో పిప్పళ్లను ప్రధానంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కండరాల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడతారు.
వాము
రుచికి కాస్త ఘాటుగా ఉండే వాము వంటకాల్లోనూ, గృహ వైద్యంలోనూ చిరకాలంగా ఉపయోగంలో ఉంది. భారత్ సహా ఉష్ణమండల ప్రాంతాల్లో వామును సాగు చేస్తున్నారు. వాము సాగులో భారతదేశానిదే అగ్రస్థానం. వాము ఆకులను ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. వాములో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి.
పోషకాలు: వాములో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: వాము జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, వికారం, నోటి అరుచి వంటి బాధల నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సాధారణ బాధలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని అరికడుతుంది.
ఆవాలు
దాదాపు నల్లగా ముదురు రంగులోని ఆవాలను మన దేశంలో ఎక్కువగా వాడతారు. పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయి. మన దేశంలో పోపు దినుసుగా ఆవాలను విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాయ తయారీలోనూ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో ఆవాల ముద్దను వంటకాల్లో ఉపయోగిస్తారు. పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఆవ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు.
పోషకాలు: ఆవాల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండటంతో ఆవాల నుంచి ఆవనూనెను తీసి వంటకాల్లో ఉపయోగిస్తారు.
ఆరోగ్య లాభాలు: తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టడంలో ఆవాలు బాగా ఉపయోగపడతాయి. గర్భిణిలు వీటిని తీసుకోవడం వల్ల.. కడుపులోని శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఆవ నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లవంగాలు
లవంగాలు ఆసియా, ఆఫ్రికా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతాయి. చిరకాలంగా లవంగాలను వంటకాలతో పాటు సంప్రదాయ ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. రుచికి కారంగా ఉండే లవంగాలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
పోషకాలు: లవంగాల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి . ఆరోగ్య లాభాలు: లవంగాలు పంటినొప్పులను తగ్గిస్తాయి. వికారాన్ని, నోటి అరుచిని పోగొడతాయి. ఆకలి పుట్టిస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. కాలేయానికి రక్షణనిస్తాయి. తలనొప్పి, జలుబు, దగ్గు వంటి సాధారణ బాధల నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తాయి.
పసుపు
భారతీయ సంస్కృతిలో పసుపుకి విశిష్టమైన స్థానం ఉంది. పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. పూజ పునస్కారాల్లోనే కాదు, వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, చైనీస్ సంప్రదాయ ఔషధాల్లోనూ పసుపును వాడతారు.పోషకాలు: పసుపులో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: పసుపును రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు, చర్మ వ్యాధులకు పసుపు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.
యాలకులు
మిఠాయిలకు, మసాలా వంటకాలకు రుచిని, సువాసనను అందించే యాలకుల్లో ఎంతో మేలు చేసే పోషకాలు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. భారత ఉపఖండంతో పాటు ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లోనూ యాలకులను సాగు చేస్తున్నారు.పోషకాలు: యాలకుల్లో టెర్పినైస్, లిమొనెస్, టెర్పినోల్ వంటి ఔషధ గుణాలు గల రసాయనాలతో పాటు పిండి పదార్థాలు, ప్రొటీన్స్, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.ఆరోగ్య లాభాలు: యాలకులు నోటి దుసనను పోగొడతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండెజబ్బులను నిరోధిస్తాయి. వికారాన్ని, నోటి అరుచిని పోగొడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి భారత్‌తో పాటు దాదాపు ఆసియా అంతటా, ఈజిప్టు వంటి ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికాలో సాగవుతోంది. ప్రాచీనకాలం నుంచే వెల్లుల్లిని ఔషధంగా వినియోగించే వారు. వంటకాలకు అదనపు రుచి, వాసన కోసం వెల్లుల్లిని అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు.
పోషకాలు: వెల్లుల్లిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: వెల్లుల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పలు వ్యాధులను అరికడతాయి. క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతలను వెల్లుల్లి సమర్థంగా నయం చేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
పాలు
అందరూ పుట్టీపుట్టగానే తమ ఆకలిని అమ్మపాలతోనే తీర్చుకుంటారు. అలాంటి పాలలో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆవు పాలు, గేదె పాలు మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో కూడా మనకు తెలుసు. ప్రస్తుతం డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు రోజూ పాలు తాగాలని సూచిస్తున్నారు.
పోషకాలు: పాలలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, బి2, బి12, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పాలలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కండరాలకు బలం కలుగుతుంది. రోజూ కనీసం గ్లాసు పాలు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
జున్ను
ఆవు లేదా గేదె దూడను ప్రసవించాక, మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు. జున్నుపాలను మరిగిస్తున్నప్పుడు చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేసే జున్నును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.
పోషకాలు: జున్ను లో ప్రొటీన్లు, విటమిన్–ఎ, విటమిన్–డి, విటమిన్–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.ఆరోగ్య లాభాలు: మామూలు పాలలో కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక శక్తి, జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల దారుఢ్యానికి జున్ను చాలా మంచిది.
పనీర్
పనీర్‌ను ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాలలోనే ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా కూరల్లో, చిరుతిళ్లు, మిఠాయిల తయారీలో వాడతారు. ముఖ్యంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో బాగా వాడతారు. పెరుగు అలవాటు లేని వారు పనీర్‌ను తమ ఆహారంలో తీసుకోవడం మంచిది.
పోషకాలు: పనీర్‌లో ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్ ఎ, విటమిన్–డి, విటమిన్–ఇ, క్యాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పనీర్ ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలకు, ఎముకలకు బలం ఇస్తుంది. ఉదర క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
నెయ్యి
వెన్నను మరిగిస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే దీన్ని వివిధ రకాల వంటకాల్లో లేదా నేరుగానూ వాడతారు. దాదాపు అన్ని రకాల స్వీట్స్‌లో నెయ్యిని ఉపయోగిస్తారు.
పోషకాలు: నెయ్యిలో కూడా కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్–ఎ, విటమిన్–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: నెయ్యి తక్షణ శక్తినిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అరుచిని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. నెయ్యిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
వెన్న
ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాక పాల నుంచి నేరుగా యంత్రాల ద్వారా వెన్నతీస్తున్నారు. ఇదివరకటి కాలంలో మజ్జిగ చిలికి వెన్న తీసేవారు. వెన్నను చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. వెన్నను మిఠాయిలు, చిరుతిళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.
పోషకాలు: కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్–ఎ, విటమిన్–డి, విటమిన్–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: వెన్నలోని కొవ్వు, విటమిన్లు చిన్నారుల మెదడు పనితీరును, జీర్ణశక్తిని పెంచుతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. కండరాలు, ఎముకల ఎదుగుదలకు దోహదపడతాయి. శారీరక శ్రమకు కావలసిన శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పెరుగు
పాలతో తయారయ్యే ఈ పెరుగును అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తారు. తెలుగు వారికి ఈ పెరుగు మరీ ముఖ్యం. ఎన్ని రకాల కూరలతో తిన్నా, చివరికి పెరుగు లేకపోతే పెద్ద వెలితనే చెప్పాలి. అలాంటి పెరుగుతోనూ ఎన్నో లాభాలున్నాయి. కూరల్లో వేయడానికి టమాటాలు లేనప్పుడు పుల్లటి పెరుగును వేసుకుంటే, వంట రుచిగా ఉంటుంది.
పోషకాలు: పెరుగులో కూడా పాలలో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు జీర్ణకోశానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
ఆరోగ్య లాభాలు: పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ ుస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కండరాలకు, ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తొలగుతాయి.
కోడిమాంసం (చికెన్)
ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధాన మాంసాహార పదార్థం. ఇందులో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డాక్టర్లు కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదనే సూచిస్తుంటారు. కోడిమాంసం మంచి పౌష్టికాహారం. మాంసాహారం తినే వాళ్లలో చాలామంది కోడిమాంసాన్ని బాగా ఇష్టపడతారు.
పోషకాలు: కోడి మాంసంలో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్–ఎ, బి5 వంటి విటమిన్లు, ఐరన్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: కోడిమాంసంలోని ప్రొటీన్లు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. బరువు తగ్గాలని డైట్ పాటించే వారికి చికెన్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
వేటమాంసం (మటన్)
మేక, గొర్రె మాంసాలను వేటమాంసంగా పరిగణిస్తారు. మేక మాంసాన్ని తక్కువ వేడిలో వండితే ఆరోగ్యానికి మంచిది. మేక, గొర్రెల మెదడు, కాలేయాన్ని కూడా తింటారు. వాటి తల మాంసాన్ని చాలామంది ఇష్టపడతారు.
పోషకాలు: ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్– బి6, బి12 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: వేటమాంసం రక్తహీనతను అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ మహిళలు వేటమాంసాన్ని తింటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. వేటమాంసం ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
పీతలు
పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోనూ ఉంటాయి. వీటిని అన్ని దేశాల్లోనూ తింటారు. పీతలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు.
పోషకాలు: పీతల్లో ప్రొటీన్లు, కొవ్వులు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్–సి, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: మధుమేహ రోగుల ఆరోగ్యానికి పీతలు మేలు చేస్తాయి. దంతాలు, ఎముకలకు దారుఢ్యాన్నిస్తాయి. నాడీ వ్యవస్థకు, గుండెకు బలాన్నిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.
చేపలు
ప్రపంచవ్యాప్తంగా చేపలను విరివిగా తింటారు. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. మన దేశంలో చేపల పులుసు, చేపల వేపుడు లాంటివి చేస్తుంటారు. చేపల్లో సముద్రపు చేపలు, మంచినీటి చేపలు పలు రకాలు ఉంటాయి. చేపలను ఎండబెట్టి నిల్వ చేసుకుని కూడా వండుకుంటారు.
పోషకాలు: చేపల్లో ప్రొటీన్లు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్–ఎ, విటమిన్–డి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: చేపల్లో లభించే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. చేపలు మెదడుకు మేలు చేస్తాయి. పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి కూడా చేపలు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వారు తరచు చేపలను తినడం ఎంతో మంచిది.
కోడి గుడ్డు
రోజుకో ఉడికించిన గుడ్డును తినాలంటారు డాక్టర్లు. మనకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఈ గుడ్డులో ఉండటం విశేషం. ఉడికించిన గుడ్డును తినడం ఇష్టంలేని వారు బ్రెడ్ ఆమ్లేట్ లేదా గుడ్డుతో చేసే ఏ వంటకాలు తిన్నా, అన్ని పోషకాలు సమంగానే అందుతాయి.
పోషకాలు: గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్ ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్–డి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: గుడ్డు కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. గుండెజబ్బులను దూరంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను నివారిస్తుంది.
రొయ్యలు
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రకరకాల రొయ్యలను ఆహారంగా తీసుకుంటారు. అన్ని రకాల రొయ్యల్లోనూ దాదాపు అవే పోషకాలు ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా వండుతారు. సముద్రంలోని రొయ్యలే కాకుండా... వీటిని ప్రత్యేకమైన చెరువుల్లోనూ పెంచుతారు. పచ్చి రొయ్యలతో పాటు ఎండు రొయ్యలను కూడా తింటారు.
పోషకాలు: రొయ్యల్లో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: రొయ్యలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. దంతాలకు, ఎముకలకు మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి.
కంద
కంద భూమిలోపల పెరిగే ఒక రకం దుంప. పూర్వం కంద మూలాలను ప్రధాన ఆహారంగా తీసుకునే వారని తేల్చారు. కంద గడ్డ అన్న పేరుతో దీన్ని ఎక్కువగా పిలుస్తూంటారు. భారతదేశమంతటా కంద గడ్డ సాగు విస్తరించి ఉంది. ఇందులో సుమారు 14 జాతులు ఉన్నాయి. వీటిని ఎక్కువగా కూరల కోసం వాడుతున్నారు. అదేవిధంగా చిప్స్ కూడా తయారుచేస్తున్నారు.
పోషకాలు: కందలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, కె ఎక్కువగా లభించే విటమిన్లు. పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కందలో లభిస్తున్నాయి.
ఆరోగ్య లాభాలు: కందలో విటమిన్ సి ఎక్కువ. జ్వరం, ఫ్లూలతో పాటు ఇన్ఫెక్షన్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ కంద బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బాగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది.
బంగాళాదుంప
బంగాళాదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక రకం కూరగాయ. 17వ శతాబ్దం వరకూ దక్షిణ అమెరికా మినహా ప్రపంచదేశాలంతటికీ బంగాళాదుంప పరిచయం లేదు. భారతదేశానికి బ్రిటిష్ వారు బంగాళాదుంపను తీసుకొచ్చారు. ఆలుగడ్డ అని, ఉర్లగడ్డ అని రకరకాల పేర్లతో బంగాళాదుంపను పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత బంగాళాదుంప నాలుగో స్థానంలో ఉంది. బంగాళాదుంపలతో వంటల్లో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫ్రై, కూరలు, చిప్స్ ఇందులో కొన్ని. డయాబెటిక్ పేషెంట్స్ బంగాళాదుంపను తక్కువగా తీసుకుంటే మంచిది.
పోషకాలు: బంగాళాదుంపలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ. విటమిన్ సి, బి6, కె లాంటి విటమిన్లు బంగాళాదుంపలో ఎక్కువగా లభిస్తున్నాయి. పొటాషియం ఇందులో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. క్యాల్షియం, ఫాస్ఫరస్ లాంటివి కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.
ఆరోగ్య లాభాలు: బంగాళాదుంపలో సమృద్ధిగా లభించే విటమిన్ సి, పొటాషియం లాంటి పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడతాయి. రక్తపోటును నియంత్రించడలో, గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి కూడా బంగాళాదుంప ఉపయోగప డుతుంది. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం బంగాళాదుంపను తమ డైట్‌లో చేర్చుకుంటూ ఉంటారు.
బీట్‌రూట్
యూరప్‌లో పుట్టిన బీటుదుంప ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆకృతిని బట్టి ఇందులో చాలా రకాలున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ దుంపను కూరగాయగా, జ్యూస్‌గా ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. బీట్ దుంపలు కొంచెం తీపి, కొంచెం వగరు రుచిని కలిగి ఉంటాయి.
పోషకాలు: బీట్‌రూట్‌లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ ఎ, సి ఇందులో ఎక్కువగా లభించే విటమిన్లు. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటివి బీట్‌రూట్‌లో ఎక్కువగా లభించే ఖనిజ లవణాలు.
ఆరోగ్య లాభాలు: కాలేయం పనితీరు బాగుండటానికి బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి బాగా తోడ్పడుతుంది. ఒంట్లో రక్తం తక్కువ ఉన్నవారు బీట్‌రూట్ తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించడంలో కూడా బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది.
కర్రపెండలం
కర్ర పెండలం చేదుగా, తియ్యగా ఉండే రకం దుంపలు. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ దుంపలు ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఏటా ఒక పంటగా కర్రపెండలంను సాగు చేస్తూ వస్తున్నారు. కర్రపెండలంతో స్వీట్లు, కూరలు చాలానే చేస్తున్నారు.పోషకాలు: కర్రపెండలంలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. చక్కెర పదార్థాలు కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.
కర్రపెండలంలో విటమిన్ సి ఎక్కువ మోతాదులోనే లభిస్తుంది. పొటాషియం, జింక్, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కర్రపెండలంలో లభిస్తున్నాయి. ఆరోగ్య లాభాలు: తక్షణశక్తిని అందించడంలో కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి, మలబద్ధకం తగ్గడానికి, బరువు తగ్గడానికి, రక్తపోటును నియంత్రించడానికి కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది.
చామ దుంప
ఆసియా దేశాల్లోనే పుట్టిన చామ దుంప ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తునే చామను సాగు చేస్తున్నారు. చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చామ దుంపలు పెరుగుతాయి. చామను నేరుగా తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టి, కూరలుగా వండి చామను వాడుతూంటారు.
పోషకాలు: చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు చామ దుంపల్లో లభిస్తున్నాయి.
ఆరోగ్య లాభాలు: క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు. తక్కువ క్యాలరీ ఆహారం అవ్వడం వల్ల చామ దుంపలను బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అజీర్తి, హైపర్ టెన్షన్, కండరాలు బలహీనతకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.
క్యారట్
కాస్త తియ్యటి రుచి ఉండి నేరుగా తీసుకోగలిగే దుంప క్యారట్. క్యారట్‌ను పండ్ల జాబితాలోనే కలిపేయడం ఎక్కువగా చూస్తూంటాం. నారింజ రంగులో ఉండే క్యారట్ యూరప్ దేశాలలో పుట్టి ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించింది. క్యారట్‌ను కూరల్లో, స్వీట్స్‌లో, రకరకాల వంటకాల్లో వాడుతూ వస్తున్నారు.
పోషకాలు: క్యారట్‌లో పిండి, పీచు పదార్థాలతో పాటు చక్కెర కూడా ఎక్కువే! ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఎ, సి ఇందులో ఎక్కువగా లభించే విటమిన్లు. సోడియం, ఫాస్ఫరస్, క్యాల్షియం లాంటివి క్యారట్‌లో లభించే ఖనిజ లవణాలు.
ఆరోగ్య లాభాలు: ఉడకబెట్టి తినే క్యారట్‌తో క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. కంటిచూపు మెరుగవ్వడానికి క్యారట్ అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. మగవారిలో వీర్య కణాల కదలికను వేగవంతం చేయడానికి క్యారట్ ఉపయోగపడుతుంది.
చిలకడ దుంప
అన్ని వేళల్లో, చవక ధరల్లో లభించే దుంపల్లో చిలకడ దుంపను చెప్పుకోవచ్చు. తియ్యటి రుచి కలిగి ఉండే ఇవి రకరకాల రంగుల్లో లభ్యమవుతూ ఉంటాయి. అమెరికాలో చిలకడ దుంప మూలాలు ఉన్నాయి. ప్రపంచమంతటా వీటి సాగు విస్తరించి ఉంది. వీటితో చాలారకాల వంటలు చేస్తూ వస్తున్నారు.
పోషకాలు: చిలకడ దుంపలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ ఎ, సి, బి6, డి ఇందులో బాగా లభించే విటమిన్లు. పొటాషియం చిలకడ దుంపల్లో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. ఇవి కాక క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి కూడా బాగానే లభిస్తున్నాయి. ఆరోగ్య లాభాలు: అల్సర్‌ను తగ్గించడానికి చిలకడ దుంప బాగా ఉపయోగపడుతుంది. డి విటమిన్ లోపం ఉన్నవారు చిలకడ దుంపను డైట్‌లో చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబుతో సహా కొన్ని ఫ్లూలను నిరోధించడానికి కూడా చిలకడ దుంప పనికొస్తుంది.
ఆహారం... అపోహలు... వాస్తవాలు
అపోహ:
వండిన క్యారట్ల కంటే పచ్చి క్యారట్లు తినడం మంచిది.వాస్తవం: నిజానికి పచ్చి క్యారట్ల కంటే వండిన క్యారట్లు తినడమే మంచిది. క్యారట్లను వండితేనే పోషక విలువలు మరింత పెరుగుతాయి. వండే ప్రక్రియలో క్యారట్ల కణకవచం లోపల ఉన్న బీటా కెరోటిన్ అనే కీలకమైన పోషకం బయటపడుతుంది. బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే.
అపోహ:
పచ్చసొన వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది వాస్తవం: కోడిగుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందనే మాట నిజమే అయినా, శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడానికి ఇదేమీ కారణం కాదు. గుడ్లు పచ్చసొనతో పాటు తినడానికి, ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. పోషకాలు సమృద్ధిగా పొందాలంటే గుడ్డును పచ్చసొనతో పాటే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అపోహ:
బంగాళాదుంపలు ఎక్కువగా తింటే వాతం వస్తుంది.వాస్తవం: బంగాళాదుంపలు అతిగా తింటే వాతం వస్తుందనేందుకు ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో అతిగా తింటే స్థూలకాయం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, బంగాళాదుంపల్లో ఉత్త పిండి పదార్థాలు మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. బంగాళా దుంపల్లోని ఫైటో కెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల సమతుల ఆహారంలో బంగాళాదుంపలను కూడా భాగం చేసుకోవడమే మేలు.
అపోహ:
నెయ్యి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది వాస్తవం: ఇది కూడా పచ్చసొన పట్ల ఉన్న అపోహలాంటిదే. నిజానికి పొద్దు తిరుగుడు నూనె, పత్తిగింజల నూనె వంటి వాటితో పోలిస్తే నెయ్యిలోనే మేలు చేసే కొవ్వులు అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనల్లో తేలింది. నెయ్యి వాడటమే శ్రేష్టమని ఆయుర్వేదం చాలాకాలంగా చెబుతూ వస్తున్నా, ఇటీవలి కాలంలో మాత్రం నెయ్యి తింటే ఒంట్లో కొవ్వు పెరిగి, గుండెజబ్బులు వస్తాయనే అపోహ ప్రచారంలోకి వచ్చింది.
అపోహ:
పిండిపదార్థాలు తింటే స్థూలకాయం వస్తుంది వాస్తవం: పిండి పదార్థాల వల్ల స్థూలకాయం వస్తుందనేది ఏమాత్రం వాస్తవం కాదు. సమతుల ఆహారంలో పిండి పదార్థాల పాత్ర తిరుగులేనిది. రోజువారీ చేసుకునే పనులకు తగిన శక్తినిచ్చేవి పిండి పదార్థాలే. అందువల్ల మన రోజువారీ ఆహారంలో సింహభాగం ఉండాల్సినవి పిండి పదార్థాలే. నిజానికి స్థూలకాయానికి కారణం పిండి పదార్థాలు కాదు. తీసుకున్న ఆహారానికి తగినంతగా శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ఎవరికైనా స్థూలకాయం వస్తుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలు, జన్యు సమస్యలు కూడా స్థూలకాయానికి కారణమవుతాయి.
అపోహ:
తీపి పదార్థాలు తగ్గిస్తే చక్కెర జబ్బు రాదు వాస్తవం: తీపి పదర్థాలకు, చక్కెర జబ్బుకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. పాన్‌క్రియాస్ పనితీరు మందగించి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు చక్కెర జబ్బు వస్తుంది. జన్యు కారణాలు, స్థూలకాయం వంటి నానా సమస్యలు చక్కెర జబ్బుకు కారణమవుతాయి. చక్కెర జబ్బు లేనప్పుడు తీపి పదార్థాలను భేషుగ్గా తినొచ్చు. తీపి పదార్థాలను తగ్గించినంత మాత్రాన లేదా పూర్తిగా మానేసినంత మాత్రాన చక్కెర జబ్బు రాకుండా పోదు. అయితే, చక్కెర జబ్బు సోకిన తర్వాత మాత్రం జీవితాంతం వైద్యుల సలహాపై మందులు వాడుతూ ఉండటంతో పాటు తీపి పదార్థాలను ఆచి తూచి తినాల్సి ఉంటుంది.