కూల్ కూల్...కలర్‌ఫుల్..!
ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి... మరోవైపు అయినోళ్ల పెళ్ళిళ్లు కూడా ఇప్పుడే.. బయటికెళ్లాలంటే ఎండలు తట్టుకునే డ్రెస్ వేసుకోవాలి. పెళ్లికి వెళ్లాలంటే ఖరీదైన పట్టుచీర కట్టుకెళ్లాలి. ఫ్యాషనబుల్ లుక్‌తో, చిరునవ్వులు చిందిస్తూ పదిమందిలో కనిపించాలంటే...వేసుకునే దుస్తులు కంఫర్ట్‌గా ఉండాలి. సేమ్ టైమ్ అందంగా ఉండాలి.ఈ సమ్మర్ సీజన్‌ని, పెళ్ళిళ్ల సీజన్‌ని కూల్‌గా బీట్ చేయాలంటే.. హీట్‌ని షూట్ చేసే కలర్స్ సెలక్ట్ చేసుకోండి.డిజైనర్లు చెప్తున్న కూల్.. కూల్. . ఫ్యాషన్ మంత్రాన్ని ఫాలో అయిపోండి.
అనన్య సుంకరి
ఫ్యాషన్ అంటే కళ్లు చెదిరే డిజైన్లే కాదు. కంఫర్ట్‌గా ఉండడం కూడా ఇంపార్టెంటే అంటారు చాలామంది. తిండి విషయంలో సీజనల్ ఫుడ్ ఉన్నట్టే.. దుస్తుల విషయంలో కూడా సీజనల్ కలర్స్ ఉంటాయి. మండుతున్న ఎండలను బీట్ చేయాలంటే లైట్ కలర్సే ఆయుధం అంటున్నారు ఫ్యాషన్ పండితులు. నచ్చిన డిజైన్లను సెలక్ట్ చేసుకునేటప్పుడు, సీజన్‌ని కూడా గుర్తు పెట్టుకుని రంగుకు ప్రాధాన్యం సూచిస్తున్నారు వారు. ఇంతకీ ఈ సమ్మర్‌లో ఎలాంటి రంగుల దుస్తులు వాడాలో, ఏ రంగులైతే శరీరాన్ని చల్లబరుస్తాయో.. చెప్పే కలర్‌ఫుల్ టిప్స్ మీ కోసం..
వైట్.. వైట్.. బీట్ ద హీట్!
రంగులన్నింటిలో వైట్ ఫ్యామిలీ కలర్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ పండితులు. ఏ కార్యక్రమమైనా, ఎలాంటి ఫంక్షనైనా ధవళవర్ణం మిమ్మల్ని మెరిపిస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలామంది తెల్లదుస్తులు అల్మారా ల్లోంచి బయటకు తీస్తారు. ఎందుకంటే తెలుపు రంగు సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించేలా వేడిని శరీరానికి తాకనివ్వదు. పైగా వైట్ డిగ్నిటీకి, డీసెంట్‌కి కేరాఫ్ అడ్రస్. రాజుల నుంచి రాజకీయ నాయకుల దాకా, యంగేజ్ నుంచి ఓల్డేజ్ దాకా.. వాళ్లూ, వీళ్లూ అనే తేడా లేకుండా వైట్ కలర్ అందరికీ హాట్ ఫేవరెట్. ఎప్పుడైనా వైట్ ఆల్వేస్ కింగ్!
గ్రీష్మంలో గ్రీన్!
ఆకుపచ్చ రంగు రకరకాల వేరియేషన్లలో ఉంటుంది. లైట్, వార్మ్, కూల్ రంగుల్లో హీట్‌ని బీట్ చేస్తుంది గ్రీన్. వేడిని నేరుగా శరీరంలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. ఎండలు దంచికొట్టే గ్రీష్మ రుతువులో గ్రీన్ కలర్‌తో కూల్ కూల్‌గా గడిపేయొచ్చు. సమ్మర్, వింటర్ అనే తేడా లేకుండా గ్రీన్‌కి ఆల్‌టైమ్ ఫేవరెట్ కలర్‌గా పేరుంది. బ్లూ, బ్రౌన్, ఎల్లో, బ్లాక్, వైట్, పర్పుల్, లినెన్, ఆరెంజ్ రంగులు గ్రీన్‌కి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. ట్రెండ్‌సెట్టర్‌గా పదికాలాల పాటు పచ్చగా ఉండాలంటే.. పచ్చకలర్‌కి ఫ్యాన్ అయిపోండి.
హాట్ కలర్... టర్కోస్!
బ్లూ, గ్రీన్ కలర్స్ కలిస్తే వచ్చే కలర్ ఇది. 2010లో పాన్‌టోన్ కంపెనీ కలర్ ఆఫ్ ది ఇయర్‌గా టర్కోస్‌ని ఎంపిక చేసింది. స్కై బ్లూ నుంచి డీప్ గ్రీన్ మధ్య దీని షేడ్స్ ఉంటాయి. దీనిలోని లైటర్ షేడ్స్‌ని ఫెమినెన్ షేడ్స్ అంటారు. 1990ల్లో ఈ కలర్ హాట్ ఫేవరెట్‌గా ఉండేది. ఇప్పటికీ ఈ రంగుకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. లావెండర్, పేల్ పింక్స్, వైట్, బ్లాక్ లాంటి కొన్ని రంగులతో మాత్రమే ఈ రంగు మ్యాచ్ అవుతుంది.
గ్రేషియస్... గ్రే!
సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచాలంటే గ్రే కలర్ బెస్ట్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చూడ్డానికి డల్‌గా కనిపించినా క్లాతింగ్‌లో ఈ రంగు ైస్టెలే వేరు. క్లాసీ లుక్‌తో పర్‌ఫెక్ట్ ఫ్యాషన్ ఐటమ్‌గా ఈ రంగును చెప్తారు. లైటర్ షేడ్, బ్లాక్ షేడ్, డార్క్ షేడ్ గ్రే కలర్‌లో అన్నీ షేడ్స్ అదరగొట్టేలా ఉంటాయి. డార్క్, కర్కోల్ గ్రేతో కలిపి వేస్తే కార్పోరేట్ లుక్ వస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ లాంటి కాంబినేషన్‌లో గ్రే కలర్‌ని మ్యాచ్ చేస్తే చూడ్డానికి సూపర్‌గా ఉంటుంది. పింక్, బ్లూ, లావెండర్, గ్రీన్, రెడ్, ఎల్లో గకూడా గ్రేకి మ్యాచింగ్ కలర్స్.
డార్క్ కలర్స్... వద్దే వద్దు!
ఈ సీజన్‌లో ముదురు రంగుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. డార్క్ కలర్స్‌కి హీట్‌ని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరం తొందరగా వేడెక్కుతుంది. బ్లాక్, డార్క్ బ్రౌన్, ముదురు గ్రీన్ లాంటి థిక్ కలర్స్ అస్సలు వేసుకోవద్దు. లైట్ కలర్సే సమ్మర్‌లో చూడడానికి కంఫర్ట్‌గా బాగుంటాయి. లైట్ పింక్, బేబీ పింక్, స్కై బ్లూ, యాష్, సీ గ్రీన్ లాంటి కలర్స్‌ని కాటన్ వేర్‌లో ధరిస్తే సమ్మర్ హీట్‌ని తట్టుకోవచ్చు.
సిల్వర్‌తో... గోల్డెన్ లుక్!
ఇది హండ్రెడ్ పర్సెట్ మోడ్రన్ కలర్. ఈ కలర్‌తో కలిపి వేసుకున్న డ్రెస్‌కి రిచ్‌లుక్ వస్తుంది. పార్టీల్లో, సెలబ్రేషన్స్‌లో ఈ వెండి మెరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదీ.. అదీ... అని కాకుండా అన్నీ రంగులతో సిల్వర్ కలర్ ఈజీగా మ్యాచవుతుంది. మోడ్రన్‌గా చూపిస్తూ... రిచ్‌లుక్ ఇస్తుంది.
బ్లూటిఫుల్!
నీలిరంగు లైట్ అండ్ ఫ్రెండ్లీ కలర్. ఫ్యాషన్ మీద అంతో ఇంతో అవగాహన ఉన్నవారు ఈ రంగులో ఏదో ఒక షేడ్‌ని ఇష్టపడతారు. అమెరికాకి చెందిన పాన్‌టోన్ అనే రంగుల కంపెనీ బ్లూ కలర్‌ని 2008లో కలర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. గ్రీన్, లైట్, రెడ్, ఆరెంజ్ రంగులు బ్లూ కలర్‌కి మంచి కాంబినేషన్స్. బేబీ బ్లూ, స్కై బ్లూ, థిక్ బ్లూ అని బ్లూ కలర్‌లో డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పటికీ ఈ రంగు సమ్మర్ స్పెషల్ రంగే! లుక్కుకి లుక్కు.. ైస్టెల్‌కి ైస్టెల్.. కూల్‌కి కూల్ బ్లూ కలర్‌తోనే సాధ్యం.
-బ్లూ, లైట్ గ్రీన్, లెమన్ ఎల్లో, టర్కోస్, సిల్వర్, గ్రే, వైట్, పింక్... ఈ రంగులు సమ్మర్ కూల్ కలర్స్‌గా చెప్తారు ఫ్యాషన్ పండితులు.
-తెలుపు రంగుకు యూవీ కిరణాల నుంచి శరీరాన్ని రక్షించే గుణం ఉంటుంది.
-లైట్ పింక్, డైమండ్ కలర్‌తో ఉండే రోస్ క్వార్ట్స్ కలర్‌ని 2016 కలర్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.
-గోధుమ రంగుకు దగ్గరగా ఉండే లినెన్ కలర్ సూట్లు సమ్మర్‌లో క్లాసీ లుక్‌తో పాటూ కంఫర్ట్‌ని కూడా ఇస్తాయి.
-పార్టీ వేర్ రంగుగా పొగాకు కలర్ ఫేమస్. సమ్మర్ కూల్ కలర్స్‌లో ఇది మోస్ట్ వాంటెడ్.
పెళ్లి కెళ్తున్నారా? : దాదాపుగా సమ్మర్ అంటేనే పెంళ్ళిళ్ల సీజన్. ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తాలు చాలా ఉంటాయి. ఒకవైపు వేసవి తాపం.. మరోవైపు బంధువుల వివాహ ఆహ్వానాలు.. సమ్మర్ హీట్‌ని తట్టుకుంటూ పెళ్ల్లిలకు హాజరు కావాలంటే వెడ్డింగ్ వేర్ లైట్‌గా ఉండేలా చూసుకోండి. ఎల్లో, పర్పుల్, పింక్, ఫ్లోరల్, లైట్ కలర్ కలంకారీ ఫ్యాబ్రిక్స్, పేస్టల్ కలర్స్, లెమన్ ఎల్లో, మెహందీ గ్రీన్, పీచ్ కలర్స్‌లో ఉండే వెడ్డింగ్ వేర్ అయితే ఈ వేసవిలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లైట్ గోల్డ్ కలర్ టాప్‌కి పర్పుల్, రెడ్, పింక్ ప్యాంట్స్ బాగా సూటవుతాయి. వధూవరుల కలర్స్ విషయానికొస్తే... లైట్ గ్రే, ఎల్లో, టీల్, సిల్వర్, వైట్ కలర్ కాంబినేషన్లు రిచ్‌లుక్ ఇస్తూ కూల్‌గా ఉంటాయి. బొప్పాయి, నారింజ, దానిమ్మ, పైనాపిల్ వంటి ఫ్రూట్స్ జ్యూస్‌తో పాటు ఆ కలర్స్ కూడా ఈ సమ్మరలో కూల్‌గా ఉంచుతాయి
.
.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565