Protect Your Phone Like this
++++++++ఇలా చేస్తే...మీ ఫోను భద్రం+++++++
స్నేహితులతో ఛాటింగ్, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆన్‌లైన్ షాపింగ్, సమాచారాన్ని భద్రపరుచుకోవడం... ఇలా అన్నింటికీ స్మార్ట్‌ఫోనే ఆధారమైపోయింది. పాకెట్‌లో ఇమిడిపోయే ఈ చిన్న గ్యాడ్జెట్ రోజువారీ జీవితంలో కీలకమైపోయింది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సౌకర్యాలు అవసరమే అయినా వాటిని ఎంత దూరంగా ఉంచితే మీ ఫోన్‌కు అంత రక్షణ. బ్యాకప్, ఎన్‌క్రిప్షన్, పర్మిషన్లు, జీపీఎస్... ఇలా చాలా ఆప్షన్లు అవసరమే... అయినా వాటిని కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేస్తే మీ ఫోన్ రక్షణ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు.
కొన్ని కావాలంటే... కొన్ని వదులుకోక తప్పదు. ఇది స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ వర్తిస్తుంది.రక్షణ కావాలంటే కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్లు వదులుకోక తప్పదు.ఆప్షన్లు, ప్రైవసీని బ్యాలెన్స్ చేస్తేనే స్మార్ట్‌ఫోన్ వినియోగం సవ్యంగా సాగుతుంది.
జీపీఎస్ ఉండాలా?

మొబైల్ ఫోన్లలో జీపీఎస్ ఆప్షన్‌ను విరివిగా వాడుతున్నాం. గూగుల్ మ్యాప్స్, క్యాబ్ బుకింగ్‌లు ఇలా ఏదైనా జీపీఎస్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ చోరీకి గురైన పక్షంలో అది ఎక్కడుందో తెలుసుకోవడానికీ ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇందులో హై యాక్యురసీ, బ్యాటరీ సేవింగ్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. హై యాక్యురసీ ఆప్షన్ వాడటం వల్ల జీపీఎస్ ఫలితాల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. మీ ఫోన్ చోరీకి గురైతే దీని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ సేవింగ్ మోడ్‌లో జీపీఎస్‌ను వాడితే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.
* దీని కోసం ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ‘లొకేషన్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ జీపీఎస్‌లోని రకాలు కనిపిస్తాయి. దాంట్లో ‘బ్యాటరీ సేవింగ్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.
* దీని కోసం ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ‘లొకేషన్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ జీపీఎస్‌లోని రకాలు కనిపిస్తాయి. దాంట్లో ‘బ్యాటరీ సేవింగ్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.
యాడ్‌లు మన ఇష్టం
ప్లేస్టోర్‌లో ఉచిత ఆప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని వాడుతుంటే మధ్యలో యాడ్‌లు వస్తుంటాయి. ఆ ఆప్‌లు వాడాలంటే యాడ్‌లను భరించాల్సిన పరిస్థితి. అలా వచ్చే యాడ్‌లలో మీరు గూగుల్‌లో తరచుగా వెతికే విషయాలకు సంబంధించిన యాడ్‌లు రావడం గమనించారా? అంటే మీ సెర్చ్ వివరాలపై గూగుల్ ఓ కన్నేసిందని అర్థం. గూగుల్ మీ ఆసక్తులను తెలుసుకోకుండా నిరోధించాలంటే గూగుల్ సెట్టింగ్స్‌లోని ‘యాడ్స్’ ఆప్షన్‌లో ‘ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్’ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. అలా మీ సమాచారం బయటకు వెళ్లకుండా చూసుకోవచ్చు.
* దీని కోసం మీ ఫోన్‌లోని గూగుల్ సెట్టింగ్స్ ఆప్‌లోకెళ్లండి. అందులో సర్వీసెస్ ట్యాబ్‌లో ‘యాడ్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒత్తితే Optout interest -based ads అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే సరి.

ప్లేస్టోర్‌లోనివే
మీ స్నేహితుడి ఫోన్‌లో ఉన్న ఆప్‌ను మీ ఫోన్‌లోకి షేర్ ఇట్ లాంటి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఆప్‌ల ద్వారా తీసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుంచి కొన్ని ఆప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటారు. మీ సౌకర్యం కోసం ఇలా చేస్తారు... కానీ ఇది మీ ఫోన్‌కు శ్రేయస్కరం కాదు. ప్రతి ఆప్ ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. బయటి నుంచి వచ్చే ఆప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీ సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంది. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో Unknown Sources ఆప్షన్ ఆన్‌లో ఉంటేనే ఆ ఆప్‌లు ఇన్‌స్టాల్ అవుతాయి. కాబట్టి ఈ ఆప్షన్‌కు దూరంగా ఉండి మీ ఫోన్‌కు రక్షణ కల్పించుకోవచ్చు.
* దీని కోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ డివైజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో Unknown Sources ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్‌లో ఉంచాలి.
* దీని కోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ డివైజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో Unknown Sources ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్‌లో ఉంచాలి.
బ్యాకప్ చేయాలా?
ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు దాచుకోవడానికి గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ లాంటి క్లౌడ్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఫోన్‌లోని సెట్టింగ్‌లు, ఆప్ ప్రిఫరెన్స్‌లు, పాస్‌వర్డులనూ బ్యాకప్ ఆప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఫోను పోయినప్పుడు లేదంటే కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు డ్రైవ్ నుంచి వాటిని పునరద్ధరించుకోవచ్చు. అయితే ఫోను దొంగతనానికి గురైతేనో లేదంటే హ్యాక్ అయితేనో డ్రైవ్ బ్యాకప్ పెట్టుకున్న మొత్తం డేటా అవతలి వాళ్ల చేతిల్లోకి పోతుంది. వీలైనంతవరకు క్లౌడ్ సర్వీసు బ్యాకప్ ఆప్షన్‌ను తక్కువగా వినియోగిస్తే మంచిది.
* దీని కోసం సెట్టింగ్స్‌లోని బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్‌లోకెళ్లండి. అక్కడ ‘గూగుల్ బ్యాకప్ అండ్ రీసెట్’ విభాగంలో Back up my data ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకుంటే సరి.
* దీని కోసం సెట్టింగ్స్‌లోని బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్‌లోకెళ్లండి. అక్కడ ‘గూగుల్ బ్యాకప్ అండ్ రీసెట్’ విభాగంలో Back up my data ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకుంటే సరి.
తెరకు తాళం
స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యమైన సమాచారాన్ని దాచుకుంటున్నాం. ఫోన్ నంబర్లు, క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్‌లు, ప్రైవేట్ దస్త్రాలు, ఈమెయిళ్లు ఇలా అన్నీ అందులోనే ఉంటున్నాయి. ఫోన్ చేతులు మారితే ఆ సమాచారం కూడా చేతులు మారుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే స్క్రీన్ లాక్ ప్రాథమిక రక్షణ మంత్రం. ఇందులో ప్యాట్రన్, పాస్‌వర్డ్, పిన్, ఫింగర్ సెన్సార్ ఆప్షన్లు ఉన్నాయి. మీకు అనువైన లాక్ ఆప్షన్‌తో మీ ఫోన్‌కు రక్షణ కల్పించుకొండి. అయితే ప్రతిసారీ ఫోన్ చూడాలంటే స్క్రీన్ లాక్ అడ్డం అనుకునేవాళ్లూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్ చోరీకి గురైనా, ఎక్కడైనా పడేసుకున్నా మీ సమాచారం ఇతరుల చేతికి చేరకుండా స్క్రీన్‌లాక్ కాపాడుతుంది.
* సెట్టింగ్స్‌లోని స్క్రీన్‌లాక్ ఆప్షన్‌లో కెళ్లండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకుంటే సరి. కొత్త తరం ఫోన్లకు ఫింగర్ ప్రింట్ ద్వారా స్క్రీన్ లాక్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది.

ఎన్‌క్రిప్షన్ అస్త్రం
ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్తే అందులోని సమాచారం చూడకుండా ఉండాలంటే ఎన్‌క్రిప్షన్ అనేది మరో మార్గం. ఎన్‌క్రిప్షన్ అంటే మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు చూడకుండా పాస్‌వర్డ్ రక్షణగా దాచేయడం అన్నమాట. స్క్రీన్‌లాక్‌కు అడ్వాన్స్‌డ్ ఆప్షన్ అనుకోవచ్చు. స్క్రీన్ తెరచినా ఆ ఫోన్ ఎన్‌క్రిప్ట్ అయ్యుంటే సమాచారాన్ని యాక్సెస్ చేయడం కుదరని పని. ఎన్‌క్రిప్ట్ చేస్తే ఆ ఫోన్ సెట్టింగ్‌లు, ఆప్స్, ఫొటోలు, వీడియోలు... ఇలా అన్నీ రక్షణ కవచంలోకి వస్తాయి. పాస్‌వర్డ్ సహాయంతోనే ఆ సమాచారాన్ని చూడగలం. ఎన్‌క్రిప్షన్‌కు సుమారు గంట సమయం పడుతుంది. ఆ సమయం మీ పోన్‌లోని సమాచారం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
* ఎన్‌క్రిప్ట్ చేయడానికి ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘ప్రైవసీ’ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ ‘ఎన్‌క్రిప్ట్’ అనే విభాగం కనిపిస్తుంది. అందులో ‘ఎన్‌క్రిప్ట్ ఫోన్’ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని ఒత్తితే మీ ఫోన్‌లోని సమాచారం ఎన్‌క్రిప్ట్ అవుతుంది.

పర్మిషన్ ఇవ్వండి
మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న ఆప్ మీ ఫోన్‌లో ఏయే సమాచారాన్ని యాక్సెస్ చేస్తుందో తెలుసా? తెలుసుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు మీ ఫోన్‌లోని ఒక ఆప్‌కు కాంటాక్ట్స్ తెలియకూడదనుకుంటున్నారు. వెంటనే ఫోన్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లి ఆప్స్ ట్యాబ్‌లో పర్మిషన్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఆ ఆప్‌ను ఒత్తితే ఇది ఏయే పర్మిషన్లు యాక్సెస్ చేస్తుంది అనే వివరాలు వస్తాయి. అక్కడ కాంటాక్ట్స్ ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే సరి. ఇలా కాల్స్, కెమెరా, నోటిఫికేషన్లు... లాంటి విషయాలకూ పరిష్మన్ తొలగించొచ్చు. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
పరిశోధన చేయండి
ప్లేస్టోర్‌లో ఎలాంటి ఆప్స్ ఉంటున్నాయనే విషయంపై గూగుల్ అంతగా దృష్టిసారించదు. కాబట్టి ‘ప్లేస్టోర్‌లోని ఆప్‌నే కదా డౌన్‌లోడ్ చేస్తున్నా’ అని ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది కాదు. ఓ ఆప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు అందులోనూ కొత్తగా ప్లేస్టోర్‌లోకి వచ్చిన ఆప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు కొన్ని అంశాలు పరిశీలించాలి.
* ఆ ఆప్‌ను ఇప్పటి వరకు ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు, రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తున్నారా అనేది తెలుసుకోవాలి.
* మీ ఫోన్‌లో ఆ ఆప్ ఏయే వివరాల్ని యాక్సెస్ చేస్తుందనేది తెలుసుకోవడం తప్పనిసరి. దీనికి క్లూఫుల్ ఆప్ ఉపయోగపడుతుంది.
* ఆప్‌ల ప్రైవసీ వివరాలను తెలిపే కార్నేజ్ మెల్లన్ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లోనూ ఆ ఆప్‌కు సంబంధించిన వివరాలు పరిశీలించాలి.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565