వాట్ ఎ నెట్‌వర్క్ 2G to 5G
What A Network 2G To 5G
++++++వాట్ ఎ నెట్‌వర్క్ 2G to 5G ++++++
కంప్యూటర్‌లో ఒక వర్డ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి నిమిషాలు పట్టేది. అది గతం. ఇప్పుడు మొబైల్‌లోనే హెచ్‌డీ మూవీ నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది. 2జి నుంచి 3జి అప్‌గ్రేడ్ కావడం వల్ల ఇది సాధ్యమయింది. 4జిలో మరిన్ని సదుపాయాలు వచ్చిచేరాయి. 5జి వచ్చాక క్లిక్ చేస్తే సెకనులో మూవీ డౌన్‌లోడ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. డాటా ట్రాన్స్‌ఫర్‌లో పెను మార్పులు తీసుకొచ్చిన ఆ నెట్‌వర్క్‌ల విశేషాలు ఇవి....
ఇంకా 2జి సిమ్ వాడుతున్నారా? 3జిలోకి మారండి. 4జి కూడా వచ్చేసింది. నాలుగేళ్లలో 5జి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ‘జి’లన్నీ ఏంటంటారా? అవి మొబైల్ నెట్‌వర్క్ జనరేషన్‌ను సూచిస్తాయి. అంటే 4జి ఎంచుకుంటే 3 జనరేషన్ నెట్‌వర్క్ నుంచి 4 జనరేషన్ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నామని అర్థం. మరిన్ని సదుపాయాలు, ఫీచర్స్ వచ్చిచేరుతున్నాయని భావించవచ్చు.
మొబైల్ నెట్‌వర్క్‌లో మొదటిది 1జి. ఈ నెట్‌వర్క్‌లో రేడియో సిగ్నల్స్ ‘అనలాగ్’ రూపంలో ప్రసారమయ్యేవి. టెక్స్ట్ పంపుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం మాత్రమే సాధ్యమయ్యేది. అంతేకాకుండా నెట్‌వర్క్ కూడా లిమిటెడ్‌గా ఉండేది. అంటే ఆ దేశానికి మాత్రమే పరిమితమై ఉండేది. 14.4 కెబిపిఎస్ స్పీడ్‌లో మాత్రమే డాటా సమాచారం జరిగేది. 1980లో 2జి నెట్‌వర్క్ వచ్చాక గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో సిగ్నల్స్ డిజిటల్ ఫార్మాట్‌లో ప్రసారమవుతాయి. ఫలితంగా ఫోన్‌కాల్స్ మాట్లాడుకోవడంలో క్వాలిటీ వచ్చింది. డాటా ట్రాన్స్‌మిషన్‌లో సంక్లిష్టత తొలగిపోయింది. అదే సమయంలో సెమీ గ్లోబల్ రోమింగ్‌సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ప్రపంచం మొత్తం కనెక్టివిటీలోకి వచ్చింది.
ఏ దేశంలో ఉన్న వ్యక్తితోనైనా మాట్లాడుకోనే సౌలభ్యం కలిగింది. ఆ తరువాత 3జి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెట్‌వర్క్ వల్ల డాటా ట్రాన్స్‌మిషన్ 384 కెబిపిఎస్ నుంచి 2 ఎంబిపిఎస్ మధ్య సాధ్యమయింది. అంటే ఈ నెట్‌వర్క్‌తో వాయిస్, వీడియో కాలింగ్ సాధ్యమయింది. ఫైల్ ట్రాన్స్‌మిషన్, ఇంటర్నెట్ సర్ఫింగ్, ఆన్‌లైన్ టీవీ, హెచ్‌డీ వీడియోలు చూడటం, గేమ్స్ ఆడుకోవడం వంటివన్నీ సాధ్యమయ్యాయి. ఇంటర్నెట్‌తో నిరంతరం కనెక్ట్ అయి ఉండాలని కోరుకునే వారికి 3జి నెట్‌వర్క్ బాగా ఉపయోగపడింది. 4జి నెట్‌వర్క్‌లో మరిన్ని ఫీచర్స్ వచ్చిచేరాయి. 3జిలో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. డాటా ట్రాన్స్‌మిషన్ వేగం చాలా పెరిగింది. 100 ఎంబిపిఎస్ నుంచి 1 జిబిపిఎ్‌సకు డాటా స్పీడ్ పెరిగింది. ఇంటర్నెట్ సర్ఫింగ్, ఎక్కువ మందితో కాన్ఫరెన్స్, చాటింగ్, వీడియోకాల్స్, వర్చువల్ గేమింగ్... ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌లో నుంచే ఉపయోగించుకునే సదుపాయం కలిగింది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీ ఫీచర్ కలిగి ఉన్న ఫోన్లు 4జి నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ టెలికమ్యునికేషన్ యూనియన్ రూపొందించిన
ఇంటర్నేషనల్ మొబైల్ కమ్యునికేషన్స్ 2000 అడ్వాన్స్‌డ్ (ఐఎంటి 2000 అడ్వాన్స్‌డ్) స్పెసిఫికేషన్‌కు లోబడి ఉంటుంది.
ఇంటర్నేషనల్ మొబైల్ కమ్యునికేషన్స్ 2000 అడ్వాన్స్‌డ్ (ఐఎంటి 2000 అడ్వాన్స్‌డ్) స్పెసిఫికేషన్‌కు లోబడి ఉంటుంది.
5జి ఎందుకు?
రాబోయే నాలుగేళ్లలో 5జి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 5జి అందుబాటులోకి వస్తే 4జితో అందుతున్న ఇంటర్నెట్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. సెకనుకు 10 జిగాబైట్స్ డాటా రేట్ అందే వీలుంది. ఒకే ఫ్లోర్‌లో 1 జిగాబైట్ పర్ సెకన్‌తో అందే డాటాతో చాలా మంది ఉద్యోగులు నెట్ వినియోగించుకోవచ్చు. కవరేజ్ పెరుగుతుంది. సిగ్నల్ ఎఫిసియెన్సీ పెరుగుతుంది.

కంపాటిబులిటీ
ఏ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలన్నా దాన్ని సపోర్టు చేసే ఫీచర్లుఉన్న మొబైల్‌ఫోన్‌ను ఎంచుకోవాలి. మొబైల్ ఫోన్ ఉన్న ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను బట్టి ఏ నెట్‌వర్క్ కంపాటిబుల్ అవుతుందో
చూసుకోవాలి.
2జి - జిఎస్‌ఎమ్ 800, జిఎస్‌ఎమ్1800
3జి - యూఎంటిఎస్ 2100
4జి - ఎల్‌టిఈ 850(5), ఎల్‌టిఈ1800(3), ఎల్‌టిఈ2300(40).

నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. హెచ్‌డీ మూవీస్‌ను నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకునే వీలు కలుగుతుంది. స్పష్టమైన వీడియో కాల్స్‌ను మాట్లాడుకునే సౌలభ్యం ఏర్పడుతుంది.
2 జి
1991లో అందుబాటులోకి వచ్చింది.
స్టాండర్డ్స్ : జీఎస్‌ఎమ్, జీపీఆర్‌ఎస్, ఎడ్జ్
బ్యాండ్‌విడ్త్ : న్యారోబ్యాండ్
డాటా రేట్స్ : 80 100 కిలోబైట్స్/సెకన్
- ఎస్‌ఎమ్‌ఎస్, ఎమ్‌ఎమ్‌ఎస్
- బేసిక్ ఇంటర్నెట్ సర్వీస్ అప్ టు 144 కెబిపిఎస్
స్టాండర్డ్స్ : జీఎస్‌ఎమ్, జీపీఆర్‌ఎస్, ఎడ్జ్
బ్యాండ్‌విడ్త్ : న్యారోబ్యాండ్
డాటా రేట్స్ : 80 100 కిలోబైట్స్/సెకన్
- ఎస్‌ఎమ్‌ఎస్, ఎమ్‌ఎమ్‌ఎస్
- బేసిక్ ఇంటర్నెట్ సర్వీస్ అప్ టు 144 కెబిపిఎస్
3 జి
2001లో అందుబాటులోకి వచ్చింది
స్టాండర్ట్స్ : యూఎమ్‌టీఎ్‌స/హెచ్‌ఎ్‌సపీఏ
టెక్నాలజీ : డిజిటల్
బ్యాండ్‌విడ్త్ : బ్రాడ్‌బ్యాండ్
డాటారేట్స్ : అప్ టు 2 మెగాబైట్/సెకన్
- ఎస్‌ఎమ్‌ఎస్, ఎమ్‌ఎమ్‌ఎస్, ఇంటర్నెట్, వీడియోకాల్స్, మొబైల్ టీవీ
- ఇంటర్నెట్ స్పీడ్ అప్ టు 84 ఎమ్‌బిపిఎస్

4 జి
2010లో అందుబాటులోకి వచ్చింది
స్టాండర్ట్స్ : ఎల్‌టీఈ, ఎల్‌టీఈ అడ్వాన్స్డ్
టెక్నాలజీ : డిజిటల్
బ్యాండ్‌విడ్త్ : మొబైల్ బ్రాండ్‌బ్యాండ్
డాటా రేట్స్ : ఎక్స్‌డీఎస్‌ఎల్ లైక్ ఎక్స్‌పీరియన్స్
- 1 గంట హెచ్‌డీ మూవీ ఆరు నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.
- ఇంటర్నెట్, వీడియో కాల్స్, మొబైల్ టీవీ, గేమింగ్ సర్వీస్, క్లౌడ్ కంప్యూటింగ్.
- ఇంటర్నెట్ స్పీడ్ అప్ టు 300 ఎమ్‌బిపిఎస్.

4జి ప్రయోజనాలు
స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
వాయిస్‌కాల్స్ మాట్లాడుతూ ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. మొబైల్ హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
అవసరమైతే వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కాల్‌కి మారవచ్చు. అంటే స్విచింగ్‌కు అవకాశం ఉంటుంది.
హెచ్‌డీ వీడియోలు నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వర్చువల్ గేమింగ్ సాధ్యమవుతుంది.

5 జి
2020 కల్లా అందుబాటులోకి వచ్చే
అవకాశం ఉంది.
డౌన్‌లోడ్ స్పీడ్ 1జిబిపిఎస్ నుంచి
10 జిబిపిఎస్ మధ్య ఉంటుంది.
4జితో పోల్చితే 10 రెట్లు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది.
యూఎచ్‌డీ వీడియో సీ్ట్రమింగ్,
వర్చువల్ రియాల్టీ సర్వీసె్‌సను సపోర్టు
చేసే బ్యాండ్‌విడ్త్ ఉంటుంది.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565