MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాబోయే అమ్మ కచ్చితంగా చేయాలివి

కాబోయే అమ్మ కచ్చితంగా చేయాలివి



కాబోయే అమ్మ కచ్చితంగా చేయాలివి!
ఇతర సమయాల్లో ఎలా ఉన్నా.. గర్భిణిగా ఉన్నప్పుడు మాత్రం జీవనశైలిలో కచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే! ఫలితంగా జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. తల్లీ, గర్భస్థ శిశువు ఆరోగ్యం బాగుంటుంది. అందుకేం చేయాలంటే...కంటినిండా నిద్ర: ఉద్యోగం చేసినా ఇంటికే పరిమితం అయినా తప్పకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే మంచిది. ఉరుకులు పరుగులు కాకుండా విధుల్లో నిదానంగా ఉండాలి. వారానికోసారి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి.
నచ్చినవి తినాలి: గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు తినొద్దని చెబుతారు. కానీ పచ్చళ్లూ, జంక్‌ఫుడ్‌, మసాలా పదార్థాలు తినాలనిపిస్తుంది. ఒకవేళ అలాంటివి తినాలనిపించినా ఇంట్లోనే తయారుచేసుకుని తినొచ్చు. పదే పదే బయట తినడం మానేయాలి. శీతల పానీయాలకూ దూరంగా ఉండాలి.
అందానికీ ప్రాధాన్యం: ఎప్పటికప్పుడు పెడిక్యూర్‌, మెనిక్యూర్‌ చేయించుకోవాలి. ఒకవేళ పాదాలకు నీరు వచ్చినట్టు అనిపిస్తే వేణ్నీళ్లలో ఉప్పు, కాస్త నిమ్మరసం పిండి.. కాళ్లు అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గుతుంది. పాదాల నొప్పులూ బాధించకుండా ఉంటాయి.
సౌకర్యంగా: బిగుతుగా ఉండే దుస్తులు ఈ సమయంలో ధరించడం సరికాదు. సౌకర్యంగా ఉండేవాటిని ఎంచుకోవాలి. అందుకే గర్భం దాల్చిన తరవాత అవసరాన్ని బట్టి ప్రత్యేక దుస్తులు డిజైన్‌ చేయించుకోవడం మంచిది. సాగే గుణం ఉన్న దుస్తుల్ని ఎంచుకుంటే.. ప్రసవం అయ్యాక కూడా పనికొస్తాయి.
భావాలన్నీ రాయాలి: మిగతా సమయంలో కలిగే భావాలకీ.. గర్భిణిగా ఉన్నప్పుడు ఉన్న ఆలోచనలకీ చాలా తేడా ఉంటుంది. ఆ సమయంలో బిడ్డ పట్ల కలిగే ఆలోచనలు.. అమ్మగా మారే క్రమంలో కలిగే భావాలనూ తప్పనిసరిగా ఓ చోట రాసుకోవాలి. బ్లాగులో రాసినా.. ఇతర సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నా ఫర్వాలేదు. అవన్నీ ఎప్పటికీ చెదిరి పోని జ్ఞాపకాల్లో ఉండిపోతాయి.
వ్యాయామం: తప్పనిసరిగా గర్భం దాల్చాక వ్యాయామం చేయాలి. వైద్యుల సలహాలు తీసుకుంటూ నడవడం.. ఇతర యోగా సాధనాలకు ప్రాధాన్యమివ్వడం వంటివి చేయాలి. ఆలస్యంగా లేవడం, ఎక్కువ సమయం నిద్రపోవడం వంటివి మంచిది కాదు. శరీరానికి కదలికలు ఉండాలి. అతి విశ్రాంతి సరికాదు.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list