MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆన్ లైన్ కూ ఆదా మార్గాలు, Online Purchase

ఆన్ లైన్ కూ ఆదా మార్గాలు
Online Purchase 

+++++++ ఆన్ లైన్ కూ ఆదా మార్గాలు ++++++
 సెర్చ్ నుంచి చెల్లింపు వరకూ
అంతా పొదుపు మంత్రం
 కూపన్లు, వ్యాలెట్లతోనూ డిస్కౌంట్ల వర్షం
 సందర్భాన్ని బట్టి కూడా తగ్గింపు ధరలు
 కొనే ముందు కాస్తంత రీసెర్చ్ చేస్తే చాలు
ఆన్‌లైన్ షాపింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకేనేమో!! కంపెనీలు సైతం ఇపుడు డిస్కౌంట్లు తగ్గించేస్తున్నాయి. దేశంలోని వినియోగదారులంతా ఇంటర్నెట్ షాపింగ్‌కు అలవాటుపడ్డారని, ఇపుడు వారు ఉత్పత్తుల్లో నాణ్యత, కొనుగోళ్లలో సౌఖ్యం మాత్రమే చూస్తున్నారని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలు చెబుతున్నాయి. అందుకే తాము డిస్కౌంట్లు తగ్గిస్తున్నా అమ్మకాలు మాత్రం తగ్గటం లేదని అవి చెబుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ జోరందుకోవటంతో ఇపుడు అరచేతిలోనే షాపింగ్ జరిగిపోతోంది. సరే!!
అవసరం ఉన్నా, లేకున్నా కనిపించింది కొనేయటం చాలామందే చేస్తున్నారు. మరి కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కాస్త ఆదా చేసుకునే పద్ధతులేంటి? అవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం...
తక్కువ ధర ఎక్కడుంది?
ఉదాహరణకు స్టోర్లకు వెళ్లేవారు జీన్స్ ప్యాంట్ కొనాలనుకుంటే ఎక్కడ తక్కువ ధరకు మంచి ఉత్పత్తులు దొరుకుతాయో కనుక్కుంటారు. షాపులోనూ వీలైతే బేరమాడతారు. ఆన్‌లైన్‌కు వచ్చేసరికి ఇవన్నీ మరిచిపోతారు. అలాం టివారు ఆన్‌లైన్లోనూ అదే చేస్తే బెటర్!. ఎలాగంటే... ఉదాహరణకు క్రోమ్ బ్రౌజర్‌లో ఈ కామర్స్ సైట్‌లో జీన్స్ ప్యాంట్ చూస్తున్నారు. ధర రూ.1999. సరిగ్గా అదే కంపెనీ అదే మోడల్ జీన్స్ ప్యాంట్ తక్కువధరకు ఏ సైట్లో విక్రయిస్తోందో ‘బైహట్కే.కామ్’ క్షణాల్లో చెప్పేస్తుంది. క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా బైహట్కే అందించే ప్లగ్ ఇన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఆ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే నోటిఫికేషన్ రూపంలో తక్కువ ధర ఎక్కడున్నదీ ఆటోమేటిక్‌గా చెప్పేస్తుంది. జంగ్లీ డాట్ కామ్, మైస్మార్ట్ ప్రైస్ డాట్ కామ్, షాప్ మానియా డాట్ కామ్, ప్రైస్ బాబా వంటి పోర్టళ్లు సైతం ఒక ఉత్పత్తి ఎక్కడెక్కడ ఎంత ధరలో ఉన్నదీ తెలియజేస్తున్నాయి.
డిస్కౌంట్ కూపన్లు వెతకండి...
ఆన్‌లైన్లో కొనుగోలు మొత్తం పూర్తయి... బిల్లు చెల్లించేటపుడు మీ దగ్గర కూపన్లేమైనా ఉంటే వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కొంటున్న సైట్లకు సంబంధించి కూపన్లేమైనా లభిస్తున్నాయేమో ముందే చూడాలి. కొనుగోళ్లను ప్రోత్సహించడానికి, తక్కువ సమయంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకునేందుకు ఈ కామర్స్ సైట్లు పోటా పోటీగా ఆఫర్లు ఇస్తుంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈబే సంస్థ 365 రోజులూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటుంది. ఒకవేళ ఎలాంటి కూపన్లు కనిపించకుంటే... ప్రత్యేకంగా డిస్కౌంట్ కూపన్లను అందించే కూపన్ దునియా వంటి వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. గూగుల్‌లో కాస్త శోధిస్తే మంచి కూపన్ పట్టుకోవడం ఏమంత కష్టం కాదు.
పండుగల బొనాంజా
పండగ రోజుల్లో కొనడం కూడా ఆదా చేసుకునే మార్గాల్లో ఒకటి. ఆఫ్‌లైన్ సంస్థల మాదిరిగానే దసరా, దీపావళి, నూతన సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం, వాలంటైన్స్ డే, గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ తదితర రోజుల్లో ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి.
ధర తగ్గినప్పుడే కొంటారా..?
మనం కొంటున్నపుడు గనక ఒక వస్తువు ధర ఎక్కువుందని మనం భావిస్తే... దాన్ని తగ్గాకే కొనొచ్చు. ఉదాహరణకు రమేష్‌కు శామ్‌సంగ్ అల్ట్రా యూహెచ్‌డీ టీవీ కొనాలని కోరిక. అన్నింటి కంటే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువగా రూ.80,999 ఉంది. కానీ రమేష్ బడ్జెట్ 70 వేలే. అప్పుడు రమేష్ ఏం చేశాడంటే... చీపాస్ డాట్ ఇన్ సైట్‌కు వెళ్లి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లోని ఉత్పత్తికి సంబంధించిన పేజీ యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేశాడు. ప్రైస్ అలర్ట్ పెట్టుకున్నాడు. నెల రోజుల తర్వాత పండుగ ఆఫర్లో భాగంగా అదే టీవీ ధరను ఫ్లిప్‌కార్ట్ రూ.66 వేలకు అందిస్తోందంటూ రమేష్‌కు చీపాస్ నుంచి మెయిల్ వచ్చింది. మనం కూడా ఇలా చేయొచ్చు కదా! అలాగే, జంగ్లీ, మైస్మార్ట్ ప్రైస్ వంటి సైట్లలోనూ కొనాలనుకుంటున్న ఉత్పత్తిని ఎంపిక చేసుకుని ‘ప్రైస్ అలర్ట్’ సెట్ చేసుకుంటే ధర తగ్గినప్పుడు తెలియజేస్తుంది.
కొత్త మెయిల్ ఐడీతో కొనేస్తే సరి
ఎంత మంది కస్టమర్లుంటే అంత పెద్ద సంస్థ అనే గుర్తింపు వస్తుంది. అందుకే ఈ కామర్స్ పోర్టళ్లు కొత్తగా నమోదైన కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 20 నుంచి 30 శాతం వరకు, కొన్ని 50 శాతం వరకు కూడా డిస్కౌంట్ ఇస్తుంటాయి. తగ్గింపు పొందాలంటే కొత్త మెయిల్ ఐడీతో కొత్త కస్టమర్ అవతారం ధరించాల్సిందే.
ఓఎల్‌ఎక్స్, క్వికర్
చంద్రశేఖర్ నెల క్రితమే ముచ్చటపడి బజాజ్ వీ బైక్ కొన్నాడు. రూ.72వేలు అయింది. నెల తర్వాత ఓ రోజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్‌కు చిన్న గీత పడలేదు. శేఖర్‌కు సైతం చిన్న గాయం కాలేదు. కానీ, బైక్ వల్లే ఇలా జరిగిందని శేఖర్‌లో అనుమానం మొదలైంది. దీంతో 60వేలకే వీ బైక్ అంటూ క్వికర్‌లో క్లిక్ మనిపించాడు. అదే రోజు ఓ తెలివైన కుర్రాడు చంద్రశేఖర్ చేతిలో రూ.58 వేలే పెట్టి ఆ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. కొన్న కుర్రాడి లాజిక్ ఏంటో తెలుసా... ‘నిజంగా ఇది లక్కీ బైక్. అందుకే ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు’ అనుకున్నాడు. రూ.14వేలు ఆదా చేసుకున్నాడు. ఈ రోజుల్లో వాడినవే కాదు. వాడనివి కూడా ఓఎల్‌ఎక్స్, క్వికర్లో తక్కువ ధరకు లభిస్తుంటాయి. తరచి చూస్తే, కొంచెం సమయం వెచ్చిస్తే ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆదా చేసుకునే మార్గాలు బోలెడు ఉన్నాయి.
వ్యాలెట్ వాడితే తగ్గుతుంది
పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, ఎయిర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎం పెసా ఇలా వ్యాలట్ సేవలు అందించే సంస్థలు చాలానే ఉన్నాయి. ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ కొంటే రూపాయి తగ్గింపు రాదు. కానీ, టికెట్ ధరను చెల్లించేటప్పుడు మొబీక్విక్ లేదా పేటీఎం నుంచి డబ్బులు చెల్లిస్తే ప్రమోషన్లలో భాగంగా ఆయా సైట్లు తగ్గింపు ఇస్తుంటాయి. వ్యాలెట్ సైట్లను చూస్తే ఆఫర్ల గురించి తెలుస్తుంది.
క్రెడిట్, డెబిట్ కార్డుతో షాపింగ్!
ఈ కామర్స్ పోర్టళ్లు తరచుగా వివిధ బ్యాంకుల సహకారంతో తమ వినియోగదారులకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఆయా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 5 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంటాయి. కాకపోతే దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. మీరు రూ.50వేల వస్తువు కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ అన్నారు కదా అని రూ.5వేలు వెనక్కి రాదు. షరతులుగా... ముందే గరిష్టంగా ఎంత డిస్కౌంట్ ఇస్తారో చెబుతారు. అదే లభిస్తుందని గుర్తుంచుకోవాలి.
కార్ట్‌లో ఉంచితే కలిసొస్తుంది!
ఉదాహరణకు అమెజాన్ సైట్‌లో ఫిలిప్స్ కంపెనీ హెడ్‌సెట్ ధర రూ.489 ఉంది. ధర ఫర్వాలేదనుకున్న మహేందర్ సైట్‌లోకి లాగిన్ అయి హెడ్‌సెట్‌ను షాపింగ్ కార్ట్‌కు యాడ్ చేసుకున్నాడు. కొనే లోపే నెట్ డిస్‌కనెక్ట్ అయింది. ఓ వారం తర్వాత అమెజాన్ నుంచి వచ్చిన మెయిల్ చూసి మహేందర్ ఎగిరి గంతేశాడు. వారం కిందట కొనాలనుకున్న ఫిలిప్స్ హెడ్‌సెట్‌పై 20% డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేసింది. ఈ కామర్స్ పోర్టళ్లలోని కార్ట్‌లలో పెండింగ్‌లో ఉన్న వస్తువులను విక్రయించుకునేందుకు కొన్ని సంస్థలు అప్పుడప్పుడు ఇలా డిస్కౌంట్‌ను ఇస్తుంటాయి. కార్ట్‌కు యాడ్ చేసుకుని కొనకుండా వేచి చూస్తే తెలుస్తుంది.
టాగ్లు: Online shopping, discounts, coupons, wallet, ఆన్‌లైన్ షాపింగ్, డిస్కౌంట్లు, కూపన్లు, వ్యాలెట్


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం