షణ్ముఖి రుద్రాక్ష
Shanmuki Rudraksha
+++++++షణ్ముఖి రుద్రాక్ష++++++
షణ్ముఖి రుద్రాక్షకు ఆరుముఖాలు ఉంటాయి. షణ్ముఖి రుద్రాక్ష ‘కార్తికేయుని’ స్వరూపం. షణ్ముఖి రుద్రాక్షకి శుక్రుడు అధిపతి, శ్రీసుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైన షణ్ముఖి రుద్రాక్ష స్త్రీలు ధారణకు మంచిది. సంతాన దోషాన్ని అరికడుతుంది. తెలివి తేటలు, స్థిరత్వం కలుగును. కోపస్వభావా లను, అగ్ని ప్రమాదాలను అరికడుతుంది.
వ్యవసాయ దారులు, రియల్ ఎస్టేట్ చేసే వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించటం మంచిది. తరచు దెబ్బలు తగులు తున్న, వాహన ప్రమాదాలు జరుగుతున్నవాహనాలు రిపేరులు వస్తున్న షణ్ముఖి రుద్రాక్ష ధరించిన ప్రమాదాల బారినుండి రక్షణ కలుగుతుంది. అనారోగ్య బాధల నుండి రక్షణ కల్పిస్తుంది. కుజదోషం ఉన్నవారు, సర్పదోషం ఉన్నవారు షణ్ముఖి ధరించిన దోషాలు తొలగిపోవును.
షణ్ముఖి రుద్రాక్ష అత్యంత మహిమ గల రుద్రాక్ష. 'షణ్ముఖి' రుద్రాక్ష బ్రహ్మహత్యా దోషాల నుంచి బయటపడేస్తుంది. కుమారస్వామి స్వరూప మైన ఈరుద్రాక్ష మహాదైర్యసాహసాలను అందించటమే కాకుండా, మేధాశక్తి, బుద్ధి బలము కలిగించును. విద్యావ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది.
షణ్ముఖి రుద్రాక్షను భరణి, పుబ్బ, పూర్వాషాడనక్షత్రాల వారు, షష్ఠి తిధి రోజు జన్మించిన వారు, వృషభ, తులారాశి వారు, కుజదోషం ఉన్నవారు, శుక్రుడు 6,8,12 లో ఉన్న, శుక్రుడు కన్యా రాశిలో నీచలోఉన్న, శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్న షణ్ముఖిరుద్రాక్ష ధారణ చేయటం మంచిది. షణ్ముఖి రుద్రాక్షని శుక్రవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి శుక్రహోరలో షణ్ముఖి ధారణ మంత్రం పఠిస్తూ ధారణ చేసిన వారికి జననేంద్రియ సమస్యలు, గుహ్యం, పైల్స్, అతి కామ కోరికలు మొదలగు రుగ్మతల నుండి రక్షిస్తుంది.
షణ్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం హం నమః”
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565