MohanPublications Print Books Online store clik Here Devullu.com

వాట్సాప్‌మయం, WhatsApp

వాట్సాప్‌మయం
WhatsApp
++++++++వాట్సాప్‌మయం+++++++
అంతా వాట్సాప్‌మయం... ఇప్పుడు మెసేజ్‌లూ అందులోనే... మాటలు అందులోనే... త్వరలో వీడియో కాల్స్‌ కూడా! కొత్త సొబగులతో వాట్సాప్‌ కాంతులీనుతోంది.
వాట్సాప్‌ వచ్చిన ముందు... వాట్సాప్‌ వచ్చిన తర్వాత! మెసేజింగ్‌, కాల్స్‌ గురించి మాట్లాడినప్పుడు ఇలానే చెప్పాలి. వాట్సాప్‌ అంతగా ప్రభావం చూపిస్తోంది. ‘మెసేజ్‌ పంపించు’ స్థానంలో ‘వాట్సాప్‌ చేయ్‌’ వచ్చేసింది. అంతగా వాట్సాప్‌లో ఏముంది అనుకుంటూ దాన్ని వాడిన వారు... ఇందులో చాలా ఉంది అంటూ దాన్ని వదులుకోలేకపోతున్నారు. వాట్సాప్‌లో ఇటీవల కొన్ని కొత్త ఆప్షన్లు కలిశాయి. త్వరలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కలవబోతున్నాయి.
ఎన్‌క్రిప్ట్‌ చేద్దాం
వాట్సాప్‌లో మీ ఉన్నతాధికారితో ఆఫీసు విషయాలు మాట్లాడుతున్నారు... మీ శ్రీమతితో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీ ఫోన్‌లో వాడే థర్డ్‌ పార్టీ ఆప్‌లు మీ ఛాట్‌ హిస్టరీని యాక్సెస్‌ చేస్తే. ఈ ఇబ్బందిని ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ ద్వారా వాట్సాప్‌ దూరం చేసింది. మీ వాట్సాప్‌ అకౌంట్‌ను ఒక్కసారి ఎన్‌క్రిప్ట్‌ చేసుకున్నాక ఇక మీ సమాచారం సేఫ్‌ అంటోంది వాట్సాప్‌. అంటే మీరు, మీరు చాట్‌ చేసిన వ్యక్తి మాత్రమే ఆ సమాచారం చూడగలరు. థర్డ్‌ పార్టీ ఆప్‌లు ఆ సమాచారాన్ని యాక్సెస్‌ చేయలేవు. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఎన్‌క్రిప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ ఆప్‌ అప్‌డేటడ్‌ వెర్షన్‌ వాడుతుంటే చాలు.
ఎవరు చూశారు
వాట్సాప్‌ గ్రూపులో ఓ విషయాన్ని సభ్యులతో పంచుకున్నారు. అందులో ఎంతమందికి ఆ మెసేజ్‌ చేరింది, ఆ మెసేజ్‌ ఎవరెవరు చూశారు అనేది గతంలో తెలిసేది కాదు. వ్యక్తిగత ఛాటింగ్‌లో రీడ్‌ రిసిప్ట్స్‌ ఆప్షన్‌ ఉన్నా గ్రూపులో ఈ సౌకర్యం ఉండేది కాదు. ఇటీవల ఆ అవకాశమూ వచ్చింది. గ్రూపులో మీరు పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన ‘ఇన్ఫర్మేషన్‌’ ఐకాన్‌ వస్తుంది. దాన్ని ఒత్తితే ఆ మెసేజ్‌ ఎవరికి చేరింది, ఎవరు ఎప్పుడు చూశారనే విషయాలు తెలుసుకోవచ్చు.
సమాధానం కొత్తగా
వాట్సాప్‌ గ్రూపులో స్నేహితులతో చాట్‌ చేస్తున్నారు. ఓ అంశంపై ఐదుగురు స్నేహితులు సమాధానం ఇచ్చారు. అయితే అందరికీ ఒకే సమాధానం ఇవ్వడం కుదరదు. అలాగని మీరనుకున్న సమాధానాన్ని గ్రూపులో పోస్టు చేస్తే అది ఎవరికో తెలియక వాళ్లు తికమకపడతారు. వాళ్ల పేరు రాసి... ఆ తర్వాత మీ సమాధానం చెప్పాలి అంటే అసలు వాళ్లు ఏమన్నారో... మీరు దేనికి సమాధానమిస్తున్నారో తెలియాలి. ఈ ఇబ్బందంతా లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ ఛాట్‌లో రిప్లై ఆప్షన్‌ వచ్చింది. మీరు ఏ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలో ఆ మెసేజ్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన పేరు పక్కన రిప్లై గుర్తు కనిపిస్తుంది. దాన్ని ఒత్తితే మీరు మెసేజ్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. మెసేజ్‌ రాసి ఎంటర్‌ బటన్‌ ఒత్తితే... ఆ ప్రశ్న, మీ సమాధానం ఒకదాని దిగువ ఇంకొకటి కనిపిస్తాయి.
అన్నీ పంచుకో
వాట్సాప్‌లో తొలుత కేవలం మెసేజ్‌లు, ఫొటోలు మాత్రమే పంపించుకునే వీలుండేది. ఆ తర్వాత లొకేషన్‌ షేరింగ్‌, కాంటాక్ట్‌ షేరింగ్‌ లాంటి ఆప్షన్లు వచ్చాయి. ఇటీవల ఫైల్స్‌ షేరింగ్‌ సదుపాయం కూడా వచ్చింది. దీని ద్వారా పీడీఎఫ్‌లు, వర్డ్‌ డాక్యుమెంట్లు లాంటివి పంపించుకోవచ్చు. దీని కోసం మీరు ఎవరికి డాక్యుమెంట్లు పంపాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే పైన క్లిప్‌ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ఒత్తితే అక్కడ డాక్యుమెంట్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. దాన్ని ఒత్తి మీకు కావాల్సిన డాక్యుమెంట్లు పంపించుకోవచ్చు.
ఇవి రానున్నాయి
కాల్‌ అందుకోకపోతే
మనం కాల్‌ చేసిన వ్యక్తి నెట్‌వర్క్‌కు అందుబాటులో లేనప్పుడు లేదంటే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినప్పుడు ఆ ఫోన్‌కు వాయిస్‌ మెయిల్‌కు పంపించుకునే సౌలభ్యం ఉంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఆడియో సందేశంగా పంపించొచ్చు. ఇప్పుడు ఈ ఆప్షన్‌ వాట్సాప్‌కు వస్తోంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లో డేటా ఆఫ్‌ చేసినప్పుడు ఎవరైనా వాట్సాప్‌ కాల్‌ చేస్తే రింగ్‌ అయినట్లు వినిపిస్తుంది కానీ మీరు కాల్‌ చేసిన వ్యక్తికి రింగ్‌ రాదు. మళ్లీ నెట్‌ కనెక్ట్‌ చేసుకున్నాక మిస్డ్‌ కాల్‌ చూపిస్తుంది. ‘వాయిస్‌మెయిల్‌’ ఆప్షన్‌తో ఇకపై మిస్డ్‌ కాల్‌ మాత్రమే కాదు... వాయిస్‌ మెయిల్‌ రూపంలో సందేశం కూడా వస్తుంది. దీని కోసం కాల్‌ బటన్‌ పక్కనే మైక్‌ బటన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తిపట్టుకొని మీరు చెప్పాల్సిన విషయం చెప్పాక సెండ్‌ చేయాలి. అది వాయిస్‌మెయిల్‌ రూపంలో అవతలి వ్యక్తికి వెళ్తుంది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఇలాంటి సదుపాయం ఉంది.
బృందంలో చేరుతారా?
మీకు సంబంధం లేని వాట్సాప్‌ గ్రూపుల్లో, మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చేర్చేస్తుంటారు. దీంతో ప్రతిసారి ఆయా గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అవుతూ ఉండాలి. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా చూస్తోంది వాట్సాప్‌. మిమ్మల్ని ఏదైనా గ్రూపులో సభ్యునిగా చేర్చేముందు మీకు ఆ గ్రూపు లింక్‌ మెసేజ్‌ రూపంలో వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి అంగీకరిస్తేనే మీరు ఆ గ్రూపులో సభ్యులవుతారు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగ దశలో ఉంది.
పేరు చెబుదాం
ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్‌కింద కామెంట్‌ పెట్టినప్పుడు, లేదంటే మీ స్నేహితుడితో ఓ ఫొటో పెట్టి షేర్‌ చేసినప్పుడు వాళ్ల పేర్లు రాస్తే అవి బోల్డ్‌గా కనిపిస్తాయి. దీని వల్ల మనం ఎవరికి ఆ విషయం చెప్పాలనుకుంటున్నామో స్పష్టత ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆప్షన్‌ వాట్సాప్‌కు కూడా వస్తోంది. గ్రూప్‌లో ఛాట్‌ చేస్తున్నప్పుడు ఆ గ్రూపులో సభ్యుడి పేరుని @ తో కలిపి రాసి పంపిస్తే ఛాట్‌ బోర్డ్‌లో బోల్డ్‌గా కనిపిస్తుంది.
రీ డయల్‌
సాధారణ మొబైల్‌ కాల్స్‌ మాదిరిగా వాట్సాప్‌ కాల్స్‌ వాడుతున్నాం. త్రీజీ డేటా, వై-ఫై ఉన్నప్పుడు వాట్సాప్‌ కాల్స్‌ కూడా సాధారణ కాల్స్‌లా స్పష్టంగా వినిపిస్తాయి. అయితే ఎక్కడో చిన్న వెలితి. రీడయల్‌, కాల్‌ బ్యాక్‌ ఆప్షన్లు లేవు అని. త్వరలో వాట్సాప్‌ ఈ ఆప్షన్లను ప్రవేశ పెట్టనుంది. అంటే ఇకపై మీకు వాట్సాప్‌ కాల్‌ వచ్చినప్పుడు సాధారణ కాల్‌లా రీ డయల్‌ చేసుకోవచ్చు. మిస్డ్‌ కాల్‌ వస్తే నోటిఫికేషన్‌ బార్‌ నుంచే కాల్‌ బ్యాక్‌ చేసుకునే సదుపాయమూ వస్తోంది. ఇప్పటికే కొందరు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ప్రయోగాత్మకంగా ఈ ఆప్షన్‌ను వాడుతున్నారు.
వీడియో కాల్స్‌
వాట్సాప్‌లో వీడియో కాల్‌ కూడా రాబోతోంది. ఇప్పటికే ఒకసారి మేలో వాట్సాప్‌ ఈ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే కొద్ది రోజులకే వచ్చిన అప్‌డేట్‌లో ఆ ఆప్షన్‌ను తొలగించింది. మళ్లీ ఇప్పుడు వీడియో కాల్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
కదిలే బొమ్మలు
వాట్సాప్‌ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంశం జిఫ్‌లు. ఈ చిన్న యానిమేటడ్‌ ఇమేజ్‌లు ఛాటింగ్‌లో కొత్త అనుభూతిని తీసుకొస్తాయి. వంద పదాల్లో చెప్పాలనుకున్న విషయాన్ని ఒక్క జిఫ్‌తో చెప్పొచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ‘విచాట్‌’లో ఉన్న ఆప్షన్‌ వాట్సాప్‌లోకి వస్తుందని కొన్నాళ్లుగా అంటున్నారు. తాజాగా ఐఫోన్‌లో ఈ ఆప్షన్‌ ప్రారంభమైంది. త్వరలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులూ ఈ సదుపాయాన్ని వినియోగించు కోవచ్చు.
పెద్ద ఎమోజీలు
సమాచారం బట్వాడాలో ఎమోజీలది ముఖ్య స్థానమే. అందుకే వాట్సాప్‌లో వందల కొద్దీ ఎమోజీలు ఉన్నాయి. ప్రతి అప్‌డేట్‌కు కొత్త ఎమోజీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమోజీ పరిమాణం కూడా పెరగబోతోంది. త్వరలో పెద్ద ఎమోజీలు పంపొచ్చు. త్వరలో రానున్న ఐఓఎస్‌ 10 ఆధారిత ఫోన్లలో పెద్ద ఎమోజీలు చూడొచ్చు. ఆ తర్వాత ఈ ఆప్షన్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ అందుబాటులోకి వస్తుంది.
‘స్మార్ట్‌’గా పసిగట్టవచ్చు!
మైనింగ్‌, భారీ గ్యాస్‌ రిఫైనరీల్లో వెలువడే విష వాయువులను గుర్తించడానికి కేంబ్రిడ్జ్‌ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని సిద్ధం చేస్తున్నారు. తొలినాళ్లలో పక్షులు, ఎలుకల సాయంతో విష వాయువులను గుర్తించేవారు. పని చేసే ప్రదేశాల్లో వాటిని బోనులో ఉంచి... వాటి ప్రవర్తన బట్టి ఆ ప్రదేశంలోని విష వాయువుల శాతం పెరగడం, ఆక్సిజన్‌ శాతం తగ్గటాన్ని గుర్తించేవారు. ఆ తర్వాత వాటి స్థానంలోకి ఓ దీపం బుడ్డీ వచ్చింది. దీపం మంటలో వచ్చే మార్పులు బట్టి గాలిలోని విష వాయువుల శాతాన్ని గుర్తించేవారు. ప్రస్తుతం డిటెక్టర్లు వినియోగిస్తున్నారు. ఇవి ప్రభావవంతంగా పని చేస్తున్నా... వాటి ధర అధికంగా ఉండటం, ఎక్కువ బరువు, సైజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను దూరం చేయడానికి శాస్త్రవేత్తలు సెన్సార్ల లాంటి డిటెక్టర్లు సిద్ధం చేస్తున్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే మైనింగ్‌, గ్యాస్‌ రిఫైనరీల్లో విష వాయువుల శాతం తెలుసుకోవడం మరింత సులభమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల కార్మికుల రక్షణ మరింత మెరుగవుతుందని చెబుతున్నారు.
ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందబోయే విషవాయువు సెన్సార్లు బ్యాడ్జిల రూపంలో ఉంటాయి. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ద్వారా పని చేస్తాయి. వాటిని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకొని వినియోగించొచ్చు. ఈ సెన్సార్లున్న ప్రాంతంలో విష వాయువులు చేరితే అందులోని కార్బన్‌ నానో ట్యూబ్స్‌ ఆ విషయాన్ని అనుసంధాన స్మార్ట్‌ఫోన్‌కు సమాచారాన్ని అందిస్తాయి. ఫోన్లలో ఉండే నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అతి తక్కువ పరిమాణంలో వెలువడే విష వాయువులను సైతం ఇవి గుర్తిస్తాయి. సైనికులు యుద్ధభూమిలో రసాయన ఆయుధాలను గుర్తించడానికీ ఇవి ఉపయోగడతాయి.
ఒత్తిడి గుట్టు చెప్పేస్తుంది!
ఆఫీసులో మీ బాస్‌ మిమ్మల్ని చెడామడా తిట్టేశారు. మీ మనసు బరువెక్కింది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు!
మనసిచ్చిన అమ్మాయిని తొలిసారి డిన్నర్‌కు తీసుకెళ్లారు. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. గాల్లో తేలినట్టుంది!
ఈ రెండు సందర్భాల్లో మీ మనసులో కలిగిన భావాల్ని, దాని పరిణామాల్ని భద్రపరుచుకోవడం సాధ్యమా? అస్సలు కాదు. కానీ ఆ సంఘటనల వల్ల మీ ఆలోచనా విధానంలో జరిగిన మార్పును పసిగట్టే పరికరం ఒకటుంది. అదే ‘జెంటా బ్రాస్‌లెట్‌’. మీ నాడి కొట్టుకునే వేగం ఆధారంగా మీరు ఒత్తిడికి గురవుతున్నారా, లేదంటే సంతోషంగా ఉన్నారా అనే విషయాల్ని ఈ బ్రాస్‌టెట్‌ పసిగడుతుంది. నోటిఫికేషన్ల రూపంలో ఆ విషయాల్ని బ్రాస్‌లెట్‌ తెరపై చూడొచ్చు. అంతేకాకుండా ఆ వివరాలను మీరున్న ప్రాంతం, సమయం ఆధారంగా భద్రపరుచుకుంటుంది. మీరున్న ప్రదేశం ఆధారంగా ఎలాంటి కసరత్తులు చేస్తే బాగుంటుందనే విషయాన్నీ సూచిస్తుంది. మీరు ఎప్పుడు, ఎలా ఒత్తిడి గురవుతున్నారు అనే విషయాన్ని ఈ బ్రాస్‌లెట్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ బ్రాస్‌లెట్‌ను మొబైల్‌కు కనెక్ట్‌ చేసి వివరాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రాస్‌లెట్‌ను ఫిట్‌నెస్‌ ట్రాకర్‌, స్లీప్‌ ట్రాకర్‌గానూ వాడుకోవచ్చు.
పూర్తి వివరాలకు: https://goo.gl/416Gy0
పిల్లల బండి... పవర్‌ జనరేటర్‌
మీ పసిపాపను స్ట్రోలర్‌లో పడుకో బెట్టి... అలా బయటకు తీసుకెళ్లారు. ఇంతలో మీ ఫోన్‌ ఛార్జింగ్‌ పదికి పడిపోయింది. ఇప్పుడెలా? ఛార్జింగ్‌ పెట్టడం కుదరదు. ఫోన్‌ లేకపోతే ఇబ్బంది. మీరు తీసుకెళ్తొంది ‘మోక్షి స్ట్రోలర్‌’ అయితే మీ ఫోన్‌ ఛార్జింగ్‌ విషయంలో పెద్ద ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే ఈ ‘మోక్షి స్ట్రోలర్‌’ చక్రాలు విద్యుత్తు శక్తిని అందించే జనరేటర్లు కాబట్టి. స్ట్రోలర్‌ను ముందుకు నెడుతుంటే చక్రాలు తిరిగి దానికి అమర్చిన టర్బైన్‌ను తిప్పుతాయి. అప్పుడు విద్యుత్తు జనరేట్‌ అవుతుంది. దాని ద్వారా మీ మొబైల్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. అక్టోబరులో ఈ స్ట్రోలర్‌ మన మార్కెట్‌లోకి రానుంది. దీనికి హెడ్‌లైట్లు కూడా ఉంటాయి. చక్రాల ద్వారా జనరేట్‌ అయిన విద్యుత్తుతో ఆ లైట్లు వెలిగించి రాత్రి వేళల్లోనూ ఈ స్ట్రోలర్‌ వాడొచ్చు. దీనికి అమర్చిన ఎల్‌సీడీ తెర ద్వారా మీరు ఎంత దూరం నడిచారు, ఎంత విద్యుత్తు జనరేట్‌ చేశారనే విషయాలూ తెలుస్తాయి.
పాట... పరుగు
ఓ చేతిలో ఎంపీ3 ప్లేయర్‌, మరో చేతికి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌... ఉదయాన్నే వాకింగ్‌/రన్నింగ్‌కు వెళ్తున్నప్పుడు ఇదేనా మీ పరిస్థితి. ‘పెబెల్‌ కోర్‌’ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌తో ఆ పరిస్థితిని సింపుల్‌ చేయొచ్చు. పాటల పెట్టె, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను కలిపి ఒకటిగా చేసిన పరికరం ఇది. చేతి గడియారం పరిమాణంలో ఉండే పెబెల్‌ కోర్‌ను చొక్కా కాలర్‌కు లేదంటే డ్రెస్‌కు తగిలించేయొచ్చు. దానికి ఇయర్‌ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ ఉదయపు నడక కొనసాగించొచ్చు. ఇది మొబైల్‌ డేటా లేదా వై-ఫై ఆధారంగా జీపీఎస్‌ పరిజ్ఞానంతో పని చేస్తుంది. నాలుగు సెంటీమీటర్ల పరిమాణంలో, 50 గ్రాముల బరువు ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మన దేశ మార్కెట్‌లోకి వస్తుంది. ధర సుమారు రూ.ఐదు వేలు. పెబెల్‌ ట్రాకర్‌పై రెండు బటన్స్‌ ఉంటాయి. పెద్ద బటన్‌ను ఒత్తితే మీ రన్నింగ్‌ యాక్టివిటీ నమోదు చేసుకోవడం మొదలవుతుంది. మీరు ఎంతసేపు నడిచారో, పరిగెత్తారో తెలియాలంటే మరోసారి ఆ పెద్ద బటన్‌ నొక్కాలి. యాక్టివిటీ పూర్తయినప్పుడు ఆ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే సరి. దానిపైన ఉండే చిన్న బటన్‌ను ఒత్తడం ద్వారా అత్యవసర సమయాల్లో దీని నుంచి నేరుగా మీ మిత్రునికి సందేశం పంపొచ్చు. మిత్రుని నెంబరును ముందుగా నమోదు చేసుకొని ఉండాలి. ఈ మొత్తం యాక్టివిటీని సంబంధిత ఆప్‌ ద్వారా మీ మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకొని చూడొచ్చు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/yJcqgh
సెకనుకు 100 బిలియన్‌ ఫ్రేమ్‌లు
కెమెరాలో ఫొటో తీయడానికి ఎంత టైమ్‌ పడుతుంది? ఏముంది అలా కెమెరా ఓపెన్‌ చేయడం... ఇలా షటర్‌ బటన్‌ నొక్కడం... ఫొటో తీయడం అంతే. మహా అయితే ఐదు సెకన్ల పని. అందులో ఫొటో క్లిక్‌మనడానికి ఒక సెకనే పడుతుంది. దానికి వంద రెట్లు వేగంతో ఫొటోలు తీసే సాంకేతిక వస్తోంది. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ‘కంప్రెస్డ్‌ అల్ట్రాఫాస్ట్‌ ఫొటోగ్రఫీ’ అని పిలిచే ఈ సాంకేతికత ఉన్న కెమెరాతో ఒక సెకనులో 100 బిలియన్ల ఫ్రేమ్స్‌ను క్యాప్చర్‌ చేయొచ్చట. ఇది కాంతి లైట్‌ పల్సస్‌ ప్రవాహానికి సమానంగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సిన అసవరమూ లేదు. ఈ సాంకేతికత ఉన్న కెమెరాను రసాయనాల పేలుడు, సహజ వాయువుల దహనం, రసాయనిక చర్యల వంటి వాటిని చిత్రీకరించడానికి వాడతారు. ఈ సాంకేతికను నాసా టెలీస్కోప్‌లో వినియోగించి సూపర్‌నోవా లైట్‌ను రికార్డ్‌ చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list