MohanPublications Print Books Online store clik Here Devullu.com

Kidney Related-ఆహారంలో కాల్షియం ఎక్కువైతే మూత్రపిండాలలో రాళ్ళు, Kidney Stones




ఆహారంలో కాల్షియం ఎక్కువైతే మూత్రపిండాలలో రాళ్ళు
Kidney Stones

ఆహారంలో కాల్షియం ఎక్కువైతే
మూత్రపిండాలలో రాళ్ళు
మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతోంది. సగటున జనాభాలో ఏడాదికి 10,000 మందిలో 7 నుంచి 21 మందికి మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ. 80 శాతం కేసులు పురుషులకు సంబంధించినవే అయి ఉంటున్నాయి.
ఈ రాళ్ళు మూత్రపిండాల లోపల ఏర్పడు తుంటాయిగాని మూత్రాశయంలోనూ, మూత్ర నాళంలోనూ కనిపిస్తుంటాయి. రక్తంలో కాల్షియం పాస్సరస్‌, యూరిక్‌ ఆసిడ్‌ లవణాలు అధికం కావటం మూలంగా రాళ్లు ఏర్పడుతుంటాయి.
అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి కిడ్నీ లోపలి పొరల మీద నిలవ అవుతాయి. లేకపోతే మూత్ర వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌ గురి కావటం మూలంగా రాళ్లు ఏర్పడుతుంటాయి.
కిడ్నీలోగాని బ్లాడర్‌లోగానీ ఇసుక రేణువు సైజు నుంచి బత్తాయిపండు సైజు దాకా ఉండే ఈ రాళ్లు ఆయా భాగాలలో కదలకుండా ఉన్నంతమట్టుకూ మనకు బాధను కలిగించవు. అసలు లేనట్టుగానే అనిపిస్తాయి.
కాని సైజులో ఎంత చిన్న రాయి అయినాసరే కిడ్నీ నుంచి బ్లాడర్‌లోకి జారుతున్నప్పుడు యురెటర్‌ లోపలి సున్నితమైన పొర లైనింగ్‌ దెబ్బ తినడం మొదలెట్టగానే మనకు భరించలేని బాధ కలుగుతుంది.
లక్షణాలు : వీపుకింద భాగాన తీవ్రంగా నొప్పి మొదలై ముందువైపు పొత్తి కడుపు దాకా వ్యాపిస్తుంది. అక్కడి నుంచి కిందకు జననేంద్రియాల వరకూ కూడా వ్యాపిస్తుంది.
కిడ్నీ రాయి మూత్రపిండం నుంచి మూత్రాశయం దాకా ఉన్న మూత్రనాళంలో కదుల్తున్న కొద్దీ నొప్పి అలలు అలలుగా కదులుతూ బాధ పెడుతుంది. అప్పుడప్పుడు తెమలటం, వణుకుతో జ్వరం, వాంతులు కూడా ఉండవచ్చు. మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది. మూత్రంలో నెత్తురు వెలువడుతుంది. వీపు కింద భాగాన్ని గాని, పొత్తి కడుపును గానీ అంటుకుంటే చాలు నొప్పి మొదలవుతుంది.
కారణాలు : సాధారణ భాషలో వివరిచాలంటే మూత్రంలో రసాయనాలు బాగా చిక్కబడి సాంద్రత పెరిగి స్పటిక రూపాన్ని దాల్చటంవల్ల ఈ రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలా చిక్కబడటానికి కారణాలు – రాళ్లు ఏర్పడే శరీరతత్వం ఉండటం వల్ల, రోజూ తీసుకునే ఆహారంలో కాల్షియం, ఇతర ఖనిజ లవణాలు కొన్ని అధికంగా ఉండటం వల్ల రాళ్లు ఏర్పడుతాయి. యూరిక్‌యాసిడ్‌ అధికం కావటం వల్ల కొన్ని రకాల మందులు – విటమిన్‌ ‘సి’ లేక విటమిన్‌ ‘డి’ అధికంగా తీసుకోవటం, సరిపడా నీరు తీసుకోకపోవటం వల్ల రాళ్లు ఏర్పడుతాయి.
మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌కి గురికావటం వల్ల, అతిగా చెమట పడుతూ శరీరంలోని నీటిని అధికంగా విసర్జింపచేసి ఉష్ణమండల ప్రదేశాలలో నివసించేవారికి, అనారోగ్య కారణాలవల్ల దీర్ఘకాలం మంచం నుంచి దిగలేనివారికి రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి.
చికిత్స : కిడ్నీరాయి చిన్నదిగా 5 మి.మీ లోపు ఉంటే ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే మూత్రం నుంచి వెళ్ళిపోతుంది. 5 నుంచి 10 మి.మి దాకా ఉండే రాయిపెద్దగా అవుతున్న కొద్దీ తనకు తానుగా బయటికి పోదు. 10 మి.మి మించిన సైజు ఉండే రాయిని సర్జరీ ద్వారా లేక లితో ట్రిప్సి ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
లిథో ట్రిప్సి : ద్వారా చేసే చికిత్సలో ఎక్స్‌రేల ద్వారా రాయి ఎక్కడ ఉందో పసిగట్టి సరిగా ఆ భాగాన అధిక శక్తి కలిగిన షాక్‌వేవ్స్‌ను ఫోకస్‌ చేస్తారు. అప్పుడు రాయి చిన్నచిన్న ముక్కలు కింద విడిపోయి ఆ ముక్కలు మూడు నాలుగు నెలల లోపుల మూత్రం ద్వారా ఒకటొకటిగా బయటకు వెళ్లిపోతాయి.
శస్త్రచికిత్స : సర్జరీలో డాక్టరు కిడ్నీని తెరిచి లోపలి రాళ్లను ఏరి బయటికి తీస్తారు. సర్జరీలో ఉండే అసౌకర్యం ఏమిటంటే కిడ్నీని కోసి తెరచినప్పు డల్లా కిడ్నీ తన సామర్థ్యంలో తడవకు 20 శాతాన్ని కోల్పోతుంది. మూత్రపిండాల్లో రాళ్ళను తొలగించటానికి ఇతర పద్ధతులు ఉన్నాయి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list