MohanPublications Print Books Online store clik Here Devullu.com

పురాణాల పరముగా శుక్రుడు, Puranala paramuga sukrudu

పురాణాల పరముగా శుక్రుడు
 Puranala paramuga sukrudu

పురాణాల పరముగా శుక్రుడు
శుక్రుడు థవళవర్ణపు శరీరకాంతి కలవాడు.నాలుగుభుజములు కలిగి చేతిలో రుద్రాక్షమాల,కమండలము,దండములనుథరించును.రధమును అథిరోహించును. ఇతనికి కావ్యుడు,సితుడు,భృగు సుతుడు,దానవాచార్యుడు,ఉశనుడు అని పేర్లు కలవు.హిరణ్యకశిపుని కుమార్తె ఉషను భృగు మహర్షి పెండ్లాడాడు.వారిద్దరికీ జన్మించినవాడే ఉశనుడు.ఈ ఉశనుడు శ్రీకృష్ణునిచే అనుగ్రహించబడిన కుచేలుడికి అపార థనసంపత్తులు ప్రాప్తించడముతో అవి అపహరింపవూనినాడు.అది పరమేశ్వరునికి కోపము కలిగించడముతో శివుడాతనిని చంపుటకు ఉద్యుక్తుడైనాడు.దీనితో ఉశనుడు తన తపశ్శక్తితో సాక్షాత్తూ పరమశివుని ఉదరములో తిష్టవేసి ఈశ్వరుని స్తుతించ సాగినాడు.బోళా శంకరునకు ఏమి చెయ్యడానికీపాలుబోక,శుక్రుడుకి అభయము ఇచ్చి బయటకు రమ్మన్నాడు.అలా శుక్రుడు శివుని శిశ్నములోనుంచి బయటకు రావడముతో ఆ పేరు సార్థకమైపోయింది.
మన్మధ నామ సంవత్సర శుథ్థ చైత్ర మాస మఘ నక్షత్రము ఏకాదశి తిథి యందు శుక్రుడిగా అవతరించినాడు ఉశనుడు.శివుడాతని స్తుతికి మెచ్చి థన వీర్యాలకు అతిపతిగానూ,రాక్ష సులకు గురువుగానూ (అథిపతిని) చేసి గ్రహమండలములో స్థానము కల్పించాడు.ఏకాక్షి.అక్ష మాల కమండలథారి.
శుక్రాచార్యుడు దానవకుల పురోహితుడు.శుక్రాచార్యుడు అసురుల అభ్యున్నతికి చేసిన కఠోరమైన తపస్సు,అభివృథ్థికి పాటుపడినంతగా వేరెవరూ చేయలేదు.తన తపస్సుతో పరమ శివునిమెప్పించి యుథ్థములో దేవతలను జయించగల శక్తిని,మృత్యుంజయ వరమును సంపా దించుకున్నాడు.శుక్రుడు సర్వసంపదలకే కాక ఔషథులు,రసాలకూ అథిపతి.ఆయన శక్తి సామర్థ్యములు అద్భుతము.ఇతడు తన సమస్త సంపదలను తన దానవ శిష్యులకప్పగంచి స్వయముగా తపోజీవనాన్ని స్వీకరించాడు.
బ్రహ్మప్రేరణతో శుక్రుడు గ్రహమై మూడు లోకములను కాపాడ సాగాడు. ఈయన గ్రహ రూపములో బ్రహ్మసభలో కొలువై ఉంటాడు.ప్రాణులకు అనుకూల గ్రహము శుక్రుడు అప్పుడప్పుడు వానలను,అనావృష్టిని,భయా భయాలను ప్రసాదిస్తూ,వర్షాలను నిరోథించే గ్రహాలను శాంత పరుస్తూ,ప్రాణుల యోగ క్షేమాలను చూచే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు.
మహనీయుల బలహీనతలు సైతం మానవాళికి కనువిప్పు కలిగించే సంఘటనలు ప్ర త్యక్షర సత్యములు.వృషపర్యుడను రాక్షసరాజు కొలువులో శుక్రుడుమంత్రిగా భాసిల్లుతున్న రోజు లలో త్రికాలపూజలు,నిత్యాగ్నిహోత్రాలు,విథివిథానముగా వైదిక కర్మలు నిర్వహిస్తూ రాక్షస రాజుల చేత శుక్రాచార్యులవారు సేవించబడుచున్నారు.
భారద్వాజసగోత్ర మణిరత్నమున శుక్రుడు సమస్త థర్మశాస్త్రకోవిదుడు. సకల విద్యాపారంగతుడు. వేద వేదాంగముల సారాంశమును శ్రథ్థతో గ్రహించినవాడు, థనుర్విద్యా పారంగతుడు.తేజస్సులో బ్రహ్మతోసమానుడు,మహత్తరమైన తేజస్సును కలిగినవాడు.బ్రాహ్మణశ్రేష్టుడు.అయినశుక్రునికి తన కుమార్తె అయిన దేవయాని అంటే అమితమైన ప్రేమానురాగములుచూపించేవాడు.
ఇలా ఉండగా ఒకరోజు రాజైన వృషపర్వుడి కుమార్తె శర్మిష్ట ఒక నాడు వనవిహారానికై త న చెలికత్తెలు,దేవయానితో అడవికి వెళ్ళింది. ఆమెకు తోడుగా వెయ్యి మంది చెలికత్తెలు కూడా ఉ న్నారు.చిన్నవిషయములో శర్మిష్టకు, దేవయానికి వాగ్వివాదము ఏర్పడింది.రాజకుమార్తెనన్న గ ర్వముతో దేవయానిని కించ పరచి పాడుబడ్డ బావిలోకి దేవయానిని త్రోసేసి తన చెలికత్తెలతోతన దారిన తానుపోయింది.ఆ నట్టనడి కారడివిలో బావిలో పడిపోయిన తనను కాపాడమని అరవసా గింది.అర్థించసాగింది.తనకు జరిగిన అవమానమునకు,తన నిస్సహాయతకు క్రోథాగ్నితో రగిలి పో తూ దుఃఖించసాగింది.
కొంత సేపటికి వేట కోసం అడవికి వచ్చిన మహా చక్రవర్తి యయాతి బైటకు లాగి రక్షించా డు.ఇంతలో తనను వెతుక్కుంటూ వచ్చిన తన చెలికత్తె షూర్ణికతో దేవయాని జరిగిన విషయ మంతా చెప్పి,శర్మిష్ట తనకు చేసిన అవమానానికిగానూ నేను ఇక ఈ దేహముతో నేను వృష ప ర్యుని రాజ్యమునకు రాలేను.అడుగుపెట్టలేను.ఈ విషయము మా తండ్రిగారికి చెప్పి,తెలియ చే యమని దేవయాని తన చెలికత్తెను తండ్రి దగ్గరకు పంపింది.
తేజో సంపన్నులయిన శుక్రాచార్యుల వారు దేవయాని సందేశం విని వడివడిగా అడుగు లు తడబడగా అడవిలో చెట్టుక్రింద దీనవదనయై యున్నతన కుమార్తెను చూసి తీవ్రమైన భావో ద్వేగముతో చలించపోయారు శుక్రాచార్యులవారు.శుక్రుడు పరిపరివిథములుగాదేవయానిని బ్రతి మలాడాడు.శర్మిష్ట చిన్నపిల్ల ఏదో తెలిసీతెలియక చేసిన తప్పునకు ఇంత భాథపడనేల.? ఇతరు లు విమర్శించిననూ,అవమానించిననూ సహజసిథ్థమైన ఓర్పును కోల్పోవుట మనలాంటి వారికి తగదు.క్షమాగుణమే అన్నిగుణాలలలోనికి ఉత్తమమైనది.నామాట విని ఊరడిల్లుము తల్లీ జరిగిం ది మరచిపో అని ఎన్నో విథములుగా నచ్చ చెప్పి చూశాడు.
దేవయాని మాత్రం పట్టినపట్టు వదల లేదు.నేను అడవులలోనే బ్రతుకుతాను.వృషపర్యుని రాజ్యానికి రాను.కృతజ్ఞతలేని వారిరాజ్యంలో ఉండేకన్నా అడవిలో కందమూలాలుతింటూ జీవిస్తాను.ఇక్కడ ఉండడమే శ్రేయస్కరము.అనిఅం ది.ఆమె నిర్ణయానికి కలత చెందిన శుక్రుడు నీకంటే నాకెవ్వరూ ప్రాణప్రదము కాదు.నీవే నా సర్వ స్వము తల్లీ.నీతోపాటే నేను కూడా ఈ అడవిలోనే ఉండెదను అని అన్నాడు.జరిగిన సంగతి దావానలములా వృషపర్య రాజుకు చేరింది.వెనువెంటనే వృషపర్యుడు త న పరివారముతో వచ్చి శుక్రుని,దేవయానిని వేడుకున్నాడు.
మహాత్మా నీవులేని రాజ్యం మృగరా జు లేని అడవి లాంటిది.నీ అనుగ్రహమున జీవించువారము మేము.నీవే విడిచిపెట్టిన మాకు దిక్కుఎవరు అని ఎన్నోవిథములుగా వృషపర్యుడు శుక్రాచార్యుని బ్రతిమలాడాడు.దానికి శుక్రుడు నాదేముంది మహారాజా నా కూతురు అంగీకరించినట్లయితే నాకూ సమ్మతమే.నేను నిమిత్త మాత్రుడను.నా కూతురు అభీష్టమునుకాదని నా కూతురిని వదులుకోలేను అనిచెప్పాడు.శుక్రుడి సందేశము విని దేవయాని కోరిక మేరకు శర్మిష్టతో సహా వెయ్యిమంది కన్యలను దేవయానికి దాసీలుగా సమర్పించాడు వృషపర్యుడు.కూతురుపట్ల శుక్రాచార్యునికి ఉన్న మమకారం.ప్రేమాభిమానాలు ఈ సంఘటనతో వెల్లడైనవి.శుక్రుడు వృషభ,తులా రాశులకు అథిపతి.శుక్రమహాదశ20సంవత్సరములు.పుష్యమి జన్మ నక్షత్రము.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం