MohanPublications Print Books Online store clik Here Devullu.com

తెలివితేటలు 9 రకాలు, 9 Types of Ideas

తెలివితేటలు 9 రకాలు
9 Types of Ideas


+++++++ తెలివితేటలు 9 రకాలు +++++
నలుగురిలోకి ప్రత్యేకం అనిపించుకోవాలంటే భిన్నంగా ఆలోచించాలి. అలానే ఆలోచించారు ‘పాడ్‌ స్క్వాడ్‌’ వాళ్లు. పాడ్‌ స్క్వాడ్‌ ఏమిటి అంటున్నారా. నెలవారి సబ్‌స్ర్కిప్షన్‌తో మూడు నుంచి ఏడు సంవత్సరాల మధ్య పిల్లల్లో తెలివితేటలను అంచనా వేసి పెంచే ఒక బాక్స్‌.
ఈ బాక్స్‌ ద్వారా తొమ్మిది రకాల తెలివితేటలకి పిల్లలు ఎక్స్‌పోజ్‌ అవుతారు. అమెరికన్‌ డెవలప్‌మెంటల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ హార్వర్డ్‌ గార్డెనర్‌ ‘మల్టిపుల్‌ ఇంటిలిజెన్సెస్‌ థియరీ’ ఆధారంగా ఈ బాక్స్‌ రూపొందించారు. సాధారణంగా పిల్లలు తొమ్మిది రకాల ఇంటిలిజెన్స్‌ థియరీలతో జన్మిస్తారు. అవి... వెర్బల్‌ - లింగ్విస్టిక్‌, లాజికల్‌ - మేథమెటికల్‌, విజువల్‌ - స్పేషియల్‌, బాడీలీ - కైనస్థిటిక్‌, మ్యూజికల్‌, ఇంటర్‌ పర్సనల్‌, ఇంట్రా పర్సనల్‌, నేచురలిస్టిక్‌, ఎగ్జిస్టెన్షియల్‌. ఈ తొమ్మిదింటి కలయికే పాడ్‌ స్క్వాడ్‌ బాక్స్‌.
సామర్థ్యంలో తేడా
‘‘విద్యావ్యవస్థలో పిల్లలందరు ఒకే అంశాలను, ఒకే మెటీరియల్‌తో, ఒకే పద్ధతిలో నేర్చుకోగలరనే విధంగా ఉంది. కాని పిల్లల లెర్నింగ్‌ ఎబిలిటీ (నేర్చుకునే సామర్థ్యం) ఒకేలా ఉండదు’’ అంటారు గార్డెనర్‌. ఆయన చెప్పిన థియరీ ఆధారంగా ‘పాడ్‌ స్క్వాడ్‌’ను రూపొందించారు అభాషా. పిల్లలకు సంబంధించిన కంటెంట్‌ను ఉత్పత్తిచేసే ‘క్వాడ్రమ్‌ సొల్యూషన్స్‌’ అనే కంపెనీకి షా డైరెక్టర్‌, ప్రమోటర్‌. ‘‘నా మేనల్లుడికి జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే వాడు నేచురలిస్టిక్‌ ఇంటిలిజెన్స్‌కు సంబంధించిన యాక్టివిటీలను ఇష్టపడుతున్నాడు. ఆ విషయం వాడితో ఆడుకుంటున్నప్పుడు అర్థమైంది. దానివల్ల అంకెలు లేదా పదాలకు సంబంధించినవి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు వాటిపట్ల ఆసక్తి కనపరచడంలేదు. వెంటనే మరో అంశం వైపు దృష్టి సారిస్తున్నాడు. వాడిని చూశాక నాకు పిల్లలకు సంఖ్యాపరమైన నైపుణ్యాలు, సంప్రదాయ చదువులకంటే మించింది కావాలని అర్థమైంది. దాన్నే శాస్ర్తీయంగా మల్టిపుల్‌ ఇంటిలిజెన్స్‌ అని పిలుస్తారు.
పరిశోధనా ఫలితం ఇది
పిల్లలు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్లలో నిబిడీకృతంగా ఉన్న టాలెంట్‌ వెలికితీసి ప్రపంచంలో వాళ్లని ప్రత్యేకంగా నిలబడేలా చేయాలనిపించింది. ఆ ఆలోచన వచ్చాక స్కూల్స్‌, యాక్టివిటీ సెంటర్లకి వెళ్లి పరిశీలించాను. తల్లిదండ్రులతో గ్రూపు మీటింగ్‌లు ఏర్పాటుచేసి మాట్లాడేదాన్ని. పిల్లల సాహిత్యం ప్రచురించే ప్రచురణకర్తలతో, బొమ్మలు, ఆటలు తయారుచేసే వాళ్లతో మాట్లాడి మార్కెట్‌ను, వెరైటీలను, వాటి ధరలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ తరువాత పిల్లలకి డెవలపింగ్‌ యాక్టివిటీ ప్రోగ్రామ్‌లు రూపొందించి వాటిలో పాల్గొన్న పిల్లల ఫీడ్‌ బ్యాక్‌ సేకరించాం.
శాంపిల్‌ చూశాకే..
అలా మేము రూపొందించిన ఒక్కో బాక్స్‌లో ఆరు రకాల యాక్టివిటీలు ఉంటాయి. వాటి వల్ల నేర్చుకోవడంతో పాటు, ఫన్‌గా ఫీలవుతారు కూడా. బాక్స్‌లో ఉన్న యాక్టివిటీల్లో 70 శాతం భిన్నంగా ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించొచ్చు. 30 శాతం యాక్టివిటీలు మాత్రం వాళ్లకు వాళ్లుగా చేసేవి. ప్రస్తుతానికి పాడ్‌ స్క్వాడ్‌ మూడు నెలలు, ఆరు నెలలు సబ్‌స్ర్కిప్షన్‌తో లభిస్తోంది. ముందు ముందు ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌తో రూపొందించే యోచనలో ఉన్నాం. ఈ బాక్స్‌ శాంపిల్‌ను కొని ఎలా ఉందో చూడొచ్చు. తల్లిదండ్రులకి పూర్తి నమ్మకం కలిగాకే సబ్‌స్ర్కిప్షన్‌ చేయొచ్చు’’ అని చెప్పారు షా.
పాడ్‌ స్క్వాడ్‌లాంటివే స్మాల్‌ బ్రౌన్‌ బాక్స్‌, మ్యాజిక్‌ క్రేట్‌, బజింగా బాక్స్‌ వంటివి మార్కెట్‌లో ఉన్నాయి. ఇవన్నీ నెలవారీ సబ్‌స్ర్కిప్షన్‌తో లభిస్తున్నాయి.
వెర్బల్‌ - లింగ్విస్టిక్‌ : ఈ నైపుణ్యం ఉన్న వాళ్లు చదవడంలో, రాయడంలో, కథలు చెప్పడంలో, వర్డ్‌ గేమ్స్‌ ఆడడంలో చురుకుగా ఉంటారు.
లాజికల్‌ - మేథమెటికల్‌ : వీళ్లకు ప్రయోగాలు చేయడం ఇష్టం. ప్రశ్నలు సంధిస్తుంటారు. పజిల్స్‌ సులభంగా చేసేస్తారు.
విజువల్‌ - స్పేషియల్‌ : వాళ్ల పనుల్ని బాగా ప్లాన్‌ చేసుకుంటారు. ఏ పనికి సంబంధించి అయినా సులువైన మార్గాలు వెతుక్కుంటారు. డిజైనింగ్‌, డ్రాయింగ్‌, విజువలైజేషన్‌లు చేయడాన్ని ఇష్టపడతారు.
బాడీలీ - కైనస్థటిక్‌: యాక్టింగ్‌, డ్యాన్సింగ్‌లు ఇష్టపడతారు. ప్రత్యక్ష అనుభవాలంటే థ్రిల్‌ ఫీలవుతారు.
మ్యూజికల్‌ : సంగీతానికి సంబంధించిన పరిజ్ఞానము మెండుగా ఉంటుంది. ధ్వనులు, రిథమ్స్‌, టోన్‌, సంగీతాలను త్వరగా గ్రహించుకుంటారు.
ఇంటర్‌పర్సనల్‌: స్నేహంగా, సున్నితంగా ఉంటారు. ఇతరుల మనోభావాలు, భావోద్వేగాలు, వాళ్ల పనుల పట్ల సున్నితంగా వ్యవహరిస్తారు.
ఇంట్రాపర్సనల్‌: వాళ్లకు వాళ్లు లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో దిట్టలు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆ ప్రభావం వాళ్ల పనిమీద కనిపిస్తుంది.
నేచురలిస్టిక్‌: పెంపుడు జంతువులతో ఆడుకోవడాన్ని ఇష్టపడతారు. గార్డెనింగ్‌ను ప్రేమిస్తారు.
ఎగ్జిస్టెన్షియల్‌: వీళ్లు తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల సున్నితంగా ఉంటారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల ద్వారా కాకుండా బాహ్యప్రపంచం ద్వారా నేర్చుకున్న అంశాలకు తమని అన్వయించుకుంటారు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list