MohanPublications Print Books Online store clik Here Devullu.com

కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము, Krishna Veni River

కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము
 Krishna Veni River


కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము
స్వస్తిశ్రీ దుర్ముఖినామ సంవత్సర శ్రావణ శుద్ద నవమి గురువారము ది. 11-08-2016 రాత్రి గం, 8-38 నిమిషములకు గురువు కన్యారాశిలో ప్రవేశము చేయుటచే కృష్ణానదీ పుష్కరములు ప్రారంభమగును.
ది. 12-8-2016 నుండి ది. 23-8-2016 వరకు 12 రోజులు పుష్కరస్నానాలు జరుగుతాయి .పితృదేవతలకు పిండప్రదానం ,దశ,షోడశదానములు చేయుట శుభప్రదము.
పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది. అంత పరమేశ్వరుడు వారికి తరుణోపాయమును విశిద్ధ్హికపరచి పడమటి కనమలలో గల సహ్యాద్రి పర్వతమందు బ్రహ్మగిరి, వేదగిరి అను రెండు శిఖరములు గలవు. బ్రహ్మగిరి యందు నేవు శ్రీ మహా విష్ణువు ఆశ్వత (రావి) వృక్షము గాను, నేను వేదగిరి యందు పెద్ద ఉసిరిక వృక్షము గాను వెలయదుమని తెలిపారు. మా అంసలో కృష్ణ - వేణి నదులు ఆవిర్భవించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతములో కలియగలవని ఆ నదీమ తల్లిలో స్నానము ఆచరించిన జనులు సర్వ పాపవిముక్తులు అవుతారని పేర్కున్నారు. అలా బ్రహ్మాది దేవతలకు, ఈశ్వరుడు చెప్పి పంపించెను.
కాలానుగతముగా సహ్య పర్వతమందలి బ్రహ్మగిరి యందు శ్రీ మహా విష్ణువు ఆశ్వత వృక్షముగా ఆవిర్భవించి తన అంశతో "కృష్ణా నది"ని ఆవిర్భింప చేసెను. తదుపరి ఈశ్వరుడు వేదగిరి యందు ఆమలక వృక్షంగా వెలసి తన అంశతో "వేణి నది" గా ఆవిర్భింప చేసెను.
మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణా నది పుట్టిన ప్రాంతం. అటు మహాబలేశ్వర ప్రాంతాన ఉద్భవించిన "కృష్ణ - వేణి " నదులతో "ఖిల్లవడి" అనే ప్రదేశానికి పై భాగాన కలిసి కృష్ణవేణి నదులు విడిపోయి పులిగడ్డ నుంచి తూర్పుగా కృష్ణానది ప్రవహించి కృష్ణాజిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతములో కలిసినది. పులిగడ్డ నుండి వేణి నది దక్షిణంగా ప్రవహించి నాచుగుంట ప్రాంతాన మూడు పాయలై "త్రివేణి సాగర సంగమం" ను పేరు ప్రఖ్యాతలు గాంచి సముద్రంలో కలిసినది.
అందువల్ల ఈ రెండు నదుల మధ్య గల ప్రదేశమందు సంకల్పములో "కృష్ణవేణి యోర్యధ్యప్రదేశ్" అని చెప్పుకునే ఆచారము ననుడిలోనికి వచ్చినది.
కృష్ణ నది ఉప నదులు: కోయనా నది, పెన్నా నది, మాలప్రభ నది, భీమా నది, ఎర్ల నది, ఘాట్ ప్రభ నది, దిండి నది, వర్ణ నది, మూసి నది, పాలేరు నది, దూద్గంగ నది.
* నదీమతల్లి కృష్ణవేణికి వందనశ్లోకములు *
-------- --------------------------
నమామి సుకృత శ్రేణిం కృష్ణవేణీం తరంగిణీం
యద్వీక్షణం కోటజనకృత దుష్కర్మ శిక్షతాం .
కన్యాగతే గురౌయద్కత్సప్తకోట్య ఘనాశనం
స్నాన మాత్రేణ సర్వేషాం తావత్ పుణ్య వివర్ధనం .
భూతలేయాని తీర్ధాని తాని కన్యాగతేగురౌ
ఆయాంతి కృష్ణ వేణింతు మహాపుణ్య ఫలాయచ .
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్యా సర్వదేవతా:
పితరౌ ఋషయశ్చైవ తత్రైవసంతిహి
కృష్ణాయా: పుష్కరే కృత్వాస్నానదానంచపై తృకం
గంగాయా: కోటిగణితం ఫలయాప్నోతి మానవ
యస్కాంతిధౌ గురద్యాత కన్యయాచ సమాగమం
కృష్ణాయంతు తదాస్నానం ప్రయత్నేన సమాచరేత్ .
" బృహస్పతి కన్యారాశియందుండిన కృష్ణా(కృష్ణవేణి) నదిలో స్నానం చేసిన పాపాలు నశించిపోతాయి. ఏ నదిని చూసినమాత్రాన కోటిజన్మల పాపాలు నశిస్తాయో అటువంటి నదీమతల్లి కృష్ణవేణికి నమస్కరిస్తున్నాను."


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list