MohanPublications Print Books Online store clik Here Devullu.com

అవిసె, గుమ్మ డి,నువ్వులు... ఈ గింజలు తింటున్నారా, Are You Eating These Nuts

అవిసె, గుమ్మ డి,నువ్వులు... ఈ గింజలు తింటున్నారా
Are You Eating These Nuts

++++++అవిసె, గుమ్మ డి,నువ్వులు...
ఈ గింజలు తింటున్నారా! +++++
ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల గింజల్లో మేలు చేసే ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వాటిని తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అవేంటో తెలుసా!
అవిసె: ఇవి పలు రకాల పోషకాల మిళితం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. యాంటీఆక్సిడెంట్లు ఉండే అవిసెగింజలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. మలబద్ధకం ఉన్నవాళ్లు రోజుకో చెంచా అవిసెగింజలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. రక్తపోటు ఉన్నవాళ్లకీ ఈ గింజల్లోని గుణాలు మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ కాలంలో వచ్చే పలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. చిన్నారులకు ప్రతిరోజూ తినిపించడం మంచిది.
గుమ్మడి: పొటాషియం అధికంగా లభించే వాటిల్లో గుమ్మడి గింజలు ఒకటి. ఇవి కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తాయి. శరీరంలో మేలు చేస్తే ఫ్లూయిడ్లని సమత్యులం చేస్తాయి. కప్పు గింజల్లో 588 మిల్లీగ్రాముల ఖనిజ లవణాలుంటాయి. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల పెద్దపేగుకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. పేగులోని మలినాలు బయటకు వచ్చేస్తాయి. ఒత్తిడిని దూరం చేసే గుణం ఈ గింజల సొంతం.
పొద్దుతిరుగుడు: చాలామంది పొద్దుతిరుగుడు గింజలు వేయించుకుని తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిలో విటమిన్‌ ఇ అధికం. అది చర్మానికి చాలా మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. క్యాన్సర్‌ కారకాలు నశిస్తాయి. మెదడులోని కొత్త కణాల పునరుద్ధరణకు వీటిలోని పోషకాలు తోడ్పడతాయి. అలానే రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపమున్నా వీటిని తినొచ్చు.
నువ్వులు: వీటిలో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. శాకాహారులు వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సిన ప్రొటీన్లు అందుతాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడేవారు నువ్వులతో చేసిన పదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిల్లో లభించే మెగ్నీషియం ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. నువ్వుల్లో ఉండే జింక్‌ ఎముకలను దృఢంగా మారుస్తుంది. మెనోపాజ్‌ దశలో మహిళలు వీటిని తరచూ ఆహారంలో చేర్చడం వల్ల ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list