MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోమూత్రం తో క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చు, Cure Cancer Disease By Gomotharam

గోమూత్రం తో  క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చు
Cure Cancer Disease By Gomotharam
+++++++గోమూత్రం తో
క్యాన్సర్ వ్యాధిని
నివారించవచ్చు+++++++++
గోవును భారతీయులు పవిత్రమైనదిగా భావిస్తారు . ఆవుపాలు , ఆవునెయ్యి వంటి వాటిలో మంచి పోషక విలువలున్నాయి . అయితే ఆవుయొక్క మూత్రం లో కూడా ఔషదవిలువలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది . గోమూత్రాన్ని వడగట్టి , స్టెరిలైజ్ చేసి ప్రజలకు బాటిల్స్ తో అందించే సంస్థలు కూడా ఉన్నాయి . నాగపుర్ లో ఈ చికిత్స అధికముగా అమలులో ఉన్నది .
గోమూత్ర చికిత్సవల్ల కొన్ని వ్యాధులు తగ్గ్గుతాయని అంటున్నారు . అవి : కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది , జ్ఞాపక శక్తిని పెంపోందిస్తుంది , తొందరగా ముసలితనము రాకుండా చేస్తుంది . కాలేయము సక్రమముగా పనిచేసేలా చేస్తుంది.
గోమూత్రం వలన చర్మవ్యాదులు , గుండెవ్యాదులు లతో పాటు ఎయిడ్స్ , కాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయయనే విశ్వాసము ఉంది . శరీరము విసర్జించే అనేక సూక్ష్మపోషక పదార్ధాలను పూరిస్తుంది . కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . లివర్ సక్రమముగా పనిచేసేటట్లు చేస్తుంది . జ్ఞాపక శక్తిని పెంచుతుంది . వృద్ధాప్యం దరిచేరనీయదు . గుండె , మెదడు లోని కణాల్ని బలపరుస్తుంది .
ఆయుర్వేద వైద్యప్రకారము : గోమూత్రము కఫాన్ని తగ్గిస్తుంది . ఆయుర్వృద్ధిని ఇస్తుంది . జ్వరము , ఫైల్సు , దగ్గు , శ్వాసకోశవ్యాధులు , కుష్టు , ఉబ్బు వంటి వ్యాధులను నయము చేస్తుంది . క్రిములను వాటివల్ల వచ్చే రోగాలను నయం చేస్తుంది . మల , మూత్ర బద్దకం రాకుండా చేస్తుంది . ఆకలిని పుట్టించి జీర్ణం అవడానికి దోహదపడుతుంది .
డోసేజ్ : రోజుకో గ్లాసును (200 m.l) తాగాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు .గోమూత్రం లొ పోషకాలు ->A, B,C,D,E విటమిన్లు , సోడియం , మెగ్నీషయం , పొటాషియం , గంధకం , ఐరన్‌ , నత్రజని , వంటి మూలకాలు , మాలిక్ , సిట్రిక్ , టైట్రిక్ , సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు , హార్మోనులు , క్రియాటినిన్‌ , లాక్టోజ్ వంటివి ఉన్నాయి .
ఆయుర్వేద వైద్యశాస్త్ర ప్రకారం, అన్ని వ్యాధులు మూడు రూపాలలో కలుగుతాయి. అవి మ్యూకస్, గాలి మరియు మలం. ఆవు మూత్రం ఈ రకంగా వచ్చే అన్ని రకాల వ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆవు మూత్రం కాలేయ పనితీరును మెరుగుపరచి, మంచి మరియు శుద్దమైన రక్తాన్ని శరీరంలో ప్రవహించేలా చేస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. "గోమూత్రం" మన మానసిక స్థితిటి పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా, వ్యాధుల భారినపడే అవకాశాలను పూర్తిగా తగ్గించి వేస్తుంది.
"గోమూత్రం"లో కాపర్ మరియు మంచి సాల్ట్ లను అధిక మొత్తంలో కలిగి ఉండి, శరీరానికి కావలసిన లవణాలను అందించి, వ్యాధులకు వ్యతిరేఖంగా పోరాడేలా చేస్తుంది. ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది,
కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల,శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి,
జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం.
మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది.
పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం.
గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు.
గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.
దక్షిణాసియా ప్రాంతవాసులనుంచి గోమూత్రానికి మంచి డిమాండ్ ఉందని తెలుసుకొన్న బ్రిటన్ వ్యాపారులు.. ప్రస్తుతం లండన్ దుకాణాల్లో గోమూత్రాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి అమ్ముతున్నారు. ఈ బాటిళ్లపై కేవలం మతపరమైన అవసరాల కోసమే అనే లేబుల్‌ను అతికించి.. ఆహార పదార్థాల పక్కనే పెట్టి అమ్మడం విశేషం. గోమూత్ర అమ్మకానికి సంబంధించిన కథనాన్ని బీబీసీ ఆసియా నెట్‌వర్క్ ప్రసారం చేసింది. ఆహార పదార్థాలు అమ్మేచోట ఈ గోమూత్రాన్ని అమ్మడంపై చార్టెర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అభ్యంతరం తెలిపింది. మతపరమైన కార్యక్రమాల కోసం హిందువులు గోమూత్రాన్ని కొనుగోలు చేస్తారని, సంతానం కలిగిన సమయంలో నిర్వహించే వేడుకల్లో ఇంటికి, బిడ్డకు క్షేమం జరుగాలని దీనిని ఉపయోగిస్తారని గ్రీన్‌విచ్‌లోని ఓ షాప్ యజమాని పేర్కొన్నాడట.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list