MohanPublications Print Books Online store clik Here Devullu.com

_కె.విశ్వనాధ్_ k.viswanath



జననంకాశీనాధుని విశ్వనాధ్
ఫిబ్రవరి 19, 1930 (వయస్సు: 87  సంవత్సరాలు)[1]
భారతదేశంతెనాలి,గుంటూరుజిల్లా,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంచెన్నై,తమిళనాడు
ఇతర పేర్లుకళాతపస్వి,కె.విశ్వనాధ్
వృత్తిసినిమా, టి.వి దర్శకుడు
నటుడు
కథా రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
శబ్ద గ్రాహకుడు
మతంబ్రాహ్మణ హిందూ
భార్య / భర్తజయలక్ష్మి
పిల్లలుపద్మావతి దేవి(కూతురు)
కాశీనాధుని నాగేంద్రనాథ్
కాశీనాధుని రవీంద్రనాథ్(కొడుకులు)
తండ్రికాశీనాధుని సుబ్రహ్మణ్యం
తల్లిసరస్వతమ్మ




కళాతపస్వి కె.విశ్వనాధ్కి
ఫాల్కే అవార్డు ప్రదానం

ఢిల్లీ: ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా విశ్వనాథ్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ త్యాగరాజ స్వామి కీర్తనను స్మరించుకున్నారు. తన తల్లిదండ్రులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు, డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం, ఉత్తమ నటీనటులుగా ఎంపికైన అక్షయ కుమార్, సోనంకపూర్ కూడా అవార్డు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కె.విశ్వనాథ్

కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు
వ్యక్తిగత జీవితం
ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడినుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.

సినీ ప్రస్థానం
చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

విశ్వనాథ్ సినిమాల ప్
విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీతదర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు
ఆత్మ గౌరవం
అల్లుడు పట్టిన భరతం
సిరి సిరి మువ్వ
సీతామాలక్ష్మి
శంకరాభరణం
సప్తపది
ఆపద్భాందవుడు
శృతిలయలు
స్వాతికిరణం
స్వాతిముత్యం
స్వర్ణకమలం
అమ్మ మనసు
శుభలేఖ
శుభోదయం
శుభ సంకల్పం
సిరివెన్నెల
సాగరసంగమం
స్వయంకృషి
జననీ జన్మభూమి
చిన్నబ్బాయి
సూత్రధారులు
స్వరాభిషేకం
జీవిత నౌక
కాలాంతకులు
జీవన జ్యోతి
ప్రేమ బంధం
చెల్లెలి కాపురం
నిండు హృదయాలు
చిన్ననాటి స్నేహితులు
ఉండమ్మా బొట్టు పెడతా
కలసొచ్చిన ఆదర్శం
ప్రైవేటు మాస్టారు
శారద
కాలం మారింది
ఓ సీత కథ
శుభప్రదం

కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు
సంతోషం (2002 సినిమా)
వజ్రం
శుభసంకల్పం
సంతోషం
స్వరాభిషేకం
నరసింహనాయుడు
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
ఠాగూర్
నీ స్నేహం
ద్రోహి
అతడు
సీమ సింహం
లక్ష్మీనరసింహ
ఆంధ్రుడు
మిస్టర్ పర్‌ఫెక్ట్
కలిసుందాం రా
కుచ్చికుచ్చి కూనమ్మ
స్టాలిన్

పురస్కారాలు
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం
1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది
1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం
1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం
1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు
2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం
1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం
పద్మశ్రీ పురస్కారం
2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list